ఖమ్మంలో సీఎం కేసీఆర్ పర్యటన ప్రారంభం | CM KCR two days tour at khammam district | Sakshi
Sakshi News home page

ఖమ్మంలో సీఎం కేసీఆర్ పర్యటన ప్రారంభం

Published Mon, Feb 15 2016 1:57 PM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM

ఖమ్మంలో సీఎం కేసీఆర్ పర్యటన ప్రారంభం - Sakshi

ఖమ్మంలో సీఎం కేసీఆర్ పర్యటన ప్రారంభం

ఖమ్మం: రెండు రోజుల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం ఖమ్మం నగరానికి విచ్చేశారు. ఆయనకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్, కలెక్టర్, ఎస్పీలు ఘన స్వాగతం పలికారు.

ఖమ్మం నగరంలో పర్యటిస్తున్న సీఎం కాన్వాయ్‌ను సీపీఎం నాయకులు అడ్డుకున్నారు. కేసీఆర్ నూతన బస్టాండ్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం రాపర్తినగర్‌లో డంపింగ్ యార్డు స్థలాన్ని పరిశీలించి తిరిగి వెళ్తుండగా సీపీఎం కార్యకర్తలు సీఎం కాన్వాయ్‌ను అడ్డగించారు. స్థానికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రాలను ముఖ్యమంత్రికి అందజేశారు.

ఖమ్మం నగర అభివృద్ధిపై సమీక్షలతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. త్వరలోనే ఖమ్మం నగర పాలక సంస్థ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. సీఎం వెంట కె.కేశవరావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఉన్నారు. ఇప్పటికే టీడీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు టీఆర్ఎస్లో చేరనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement