హైదరాబాద్: శ్రీశైలం నీటి వివాదం విషయంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని వైఎస్ఆర్ సీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు రాజకీయ లబ్ది కోసమే ప్రయత్నిస్తున్నాయమని విమర్శించారు. వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది.
తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు, ప్రజాసమస్యలపై సమావేశంలో చర్చించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, గవర్నర్ నరసింహన్ను కలసి సమస్యలను వారి దృష్టికి తీసుకెళతామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. వైఎస్ఆర్ సీపీ ప్రజల పక్షాన పోరాడుతుందని అన్నారు. వచ్చే నెల 9న రంగారెడ్డి, 13న మహబూబ్ నగర్, 17న నల్లగొండలలో పార్తీ విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు.
'శ్రీశైలం నీటి వివాదంపై కేంద్రం స్పందించాలి'
Published Sat, Oct 25 2014 9:42 PM | Last Updated on Sun, Apr 7 2019 3:35 PM
Advertisement
Advertisement