టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లో ఎండగడతామని తెలంగాణ వైఎస్ఆర్ సీపీ నేతలు స్పష్టం చేశారు.
హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లో ఎండగడతామని తెలంగాణ వైఎస్ఆర్ సీపీ నేతలు స్పష్టం చేశారు. సోమవారం లోటస్ పాండ్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన తెలంగాణ వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ బలోపేతంపై తీసుకోవాల్సిన చర్యలపై తెలంగాణ వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
సమావేశంలో తెలంగాణలోని కరువు, రైతు ఆత్మహత్యలు, ప్రాజెక్టుల రీడిజైన్ వంటి పలు ప్రజాసమస్యలపై చర్చించినట్లు పార్టీ నేతలు శివకుమార్, కొండా రాఘవరెడ్డి, రెహ్మాన్లు వెల్లడించారు. ప్రజల పక్షాన పోరాడేందుకు అవసరమైన కార్యచరణను రూపొందిస్తామని నేతలు వెల్లడించారు.