సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర కమిటీలో పలువురిని నియమిస్తూ పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం ప్రకటన విడుదల చేశారు. పార్టీ రాష్ర్ట కార్యదర్శులుగా కె. రుక్మారెడ్డి (రంగారెడ్డి), సయ్యద్ అలీ సయ్యద్ (హైదరాబాద్), సంయుక్త కార్యదర్శులుగా మహ్మద్ అష్వఖ్ అలీఖాన్, జేఎల్ మేరీ, డా. ఎం.వరలక్ష్మి, మహ్మద్ అజ్మేరీ ఖురేషి, రాష్ట్ర కార్యాలయంలో 10 జిల్లాల సమన్వయకర్తగా ఆరె లింగారెడ్డి (నల్లగొండ) నియమితులయ్యారు.
అలాగే పార్టీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శిగా జాలా మహేశ్ యాదవ్ (హైదరాబాద్ జిల్లా), రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యదర్శిగా కుక్కల హనుమంతరెడ్డి (నల్లగొండ జిల్లా)లను నియమించారు. పార్టీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి సింగిరెడ్డి ఇందిరారెడ్డి (కరీంనగర్ జిల్లా), కార్యదర్శులుగా కట్టా సంధ్యారాణి (కరీంనగర్ జిల్లా), ఎస్‌కే బీబీజాన్ (హైదరాబాద్) నియమితులయ్యారు.
వైఎస్సార్‌సీపీ తెలంగాణ కమిటీ విస్తరణ
Published Wed, Apr 22 2015 2:48 AM | Last Updated on Tue, Aug 21 2018 5:36 PM
Advertisement
Advertisement