- వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపు
- వచ్చే నెల 5 లోపు జిల్లా కమిటీలు, అనుబంధ సంఘాలకు కమిటీలు
- 20వ తేదీలోపు పూర్తి స్థాయిలో మండల కమిటీల నియామకాలు
- హామీలను నెరవేర్చేలా టీ సర్కారుపై ఒత్తిడి తేవాలని నేతలకు సూచన
సాక్షి, హైదరాబాద్: వివిధ సమస్యలతో సతమతమవుతున్న రాష్ట్ర ప్రజల పక్షాన పోరాడేందుకు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని వైఎస్సార్ సీపీ తెలంగాణ కమిటీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. దివంగతనేత వైఎస్సార్ అమలు చేసిన సంక్షేమ పథకాలను కొనసాగించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆయన పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్‌లో లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కమిటీ అత్యవసర సమావేశం జరి గింది. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడారు.
ఏప్రిల్ ఐదో తేదీ లోపల పార్టీ జిల్లా కమిటీలు, అనుబంధ సంఘాల కమిటీలను ఏర్పాటు చేయాలని... ఏప్రిల్ 20వ తేదీలోపు పూర్తిస్థాయిలో మండల కమిటీల నియామకాలు పూర్తి చేయాలని చెప్పారు. పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నా రు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం హామీలను నీరుగార్చడంపై ఉద్యమించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి తీవ్రమయిందని.. కరువు పరిస్థితులు ఏర్పడి, కూలీలు వలస బాట పట్టే పరిస్థితి వచ్చిందని, రైతుల ఆత్మహత్యలు పెరిగాయని పొంగులేటి చెప్పారు. ఇలాంటి సమయంలో ప్రజలు, రైతులు, కార్మికవర్గం పక్షాన పోరాటాలు చేయాల్సి ఉందని పేర్కొన్నారు.
పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు ఎడ్మ కి ష్టారెడ్డి మాట్లాడుతూ... రాష్ట్రంలో 70 శాతం బోర్లు ఎండిపోయాయని.. 401 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైందని పేర్కొన్నారు. రోజూ ఎక్కడో ఒకచోట రైతులు ఆత్మహత్య లు చేసుకొంటున్నారని చెప్పారు. సంక్షేమం, సహా యం, అభివృద్ధి అనే మూడు అంశాలపై నడిచిన దివంగత సీఎం వైఎస్సార్.. ప్రజల్లో, కార్యకర్తల గుండెల్లో నిలిచిపోయారని తెలి పారు. పార్టీ ప్రధాన కార్యదర్శి హెచ్‌ఏ రెహమాన్ మాట్లాడుతూ... అందరం కలిసికట్టుగా పని చేస్తే, నాలుగేళ్ల తర్వాత ఏ పార్టీ వారైనా పొత్తుకోసం లోటస్‌పాండ్ రావాల్సిందేనని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ పార్టీ అభిమానులున్నారని పార్టీ ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాశ్ చెప్పారు. పార్టీని గ్రామస్థాయికి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అనుసరించే ప్రజావ్యతిరేక విధానాలను ఉద్యమాల ద్వారానే ఎదుర్కొం దామన్నారు. కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు కె.శివకుమార్, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, జి.నిరంజన్‌రెడ్డి, మతిన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు బి. అనిల్‌కుమార్ (ఆదిలాబాద్), వెంకన్నగౌడ్(నల్లగొండ), ప్రభుగౌడ్(మెదక్), జి.సురేష్‌రెడ్డి (రంగారెడ్డి) మాట్లాడగా పార్టీ మైనార్టీ విభాగం అధ్యక్షుడు సయ్యద్ ముస్తాఫా అహ్మద్, క్రిస్టియన్ మైనార్టీ విభా గం అధ్యక్షుడు కె.జి.హెర్భట్, సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు టీఎస్ విజయచందర్, యూత్ అధ్యక్షుడు బి.రవీందర్, వైద్య విభాగం అధ్యక్షుడు డాక్టర్ పి.ప్రఫుల్లా, వీఎల్‌ఎన్ రెడ్డి, కార్మిక విభాగం అధ్యక్షులు ఎన్.భిక్షపతి, పార్టీ జిల్లా అధ్యక్షుడు జె.మహేందర్‌రెడ్డి(వరంగల్), నాయుడు ప్రకాశ్ (నిజామాబాద్), ఎస్.భాస్కర్‌రెడ్డి (కరీంనగర్), పార్టీ ప్రధానకార్యదర్శులు జి.నాగి రెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎం.జయరాజు, అధికారప్రతినిధి సత్యం శ్రీరంగం పాల్గొన్నారు.