'ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతుల ఆత్మహత్యలు' | t-ysrcp leaders held a coference on farmers suicide in lotus pound | Sakshi
Sakshi News home page

'ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతుల ఆత్మహత్యలు'

Published Sun, Sep 13 2015 6:21 PM | Last Updated on Sat, Sep 29 2018 7:10 PM

t-ysrcp leaders held a coference on farmers suicide in lotus pound

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలపై టీ-వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన లోటస్ పాండ్లో ఆదివారం సమీక్షా సమావేశంనిర్వహించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అంతటా కరవు పరిస్థితులు నెలకొన్నాయి, ప్రభుత్వం వెంటనే నివారణ చర్యలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.


ఈ నెల 18న రైతుల ఆత్మహత్యలపై అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతిపత్రం, 19న తెలంగాణ సీఎస్ను కలిసి రైతుల ఆత్మహత్యలపై వినతిపత్రం ఇవ్వాలని టీ-వైఎస్ఆర్సీపీ నేతలు ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement