srisilam
-
శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు
-
30 ఏళ్లపాటు సీఎం జగన్ పాలన కొనసాగాలని " తిరుమల TO శ్రీశైలం పాదయాత్ర "
-
శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో కార్తీక శోభ..పోటెత్తిన జనం
కార్తీకమాసం సందర్భంగా శివాలయాలన్ని భక్తులతో కిటకిట లాడుతున్నాయి. ఈ కార్తీక మాస పర్వదినంలో శైవ క్షేత్రాల్లో భక్తుల రద్దీ మాములుగా ఉండదు. ఈ మేరకు కర్నూల్ జిల్లాలో ఉన్న ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలం వంటి పుణ్య క్షేత్రం గురించి చెప్పనవసరం లేదు. వారాంతపు సెలవులు కావడంతో శ్రీశైలం మల్లన్న క్షేత్రానికి భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తులు ఆలయానికి ఎదురుగా ఉన్న గంగాధర మండపం, శివమాడ విధుల్లో దీపారాధనలు చేసుకున్నారు. ఇక కార్తీక మాసోత్సవాల సందర్భంగా ఆలయంలో గర్భాలయం అభిషేకాలు, స్పర్శ దర్శనం తదితర సేవలను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా కేవలం శ్రీ మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవార్ల అలంకార దర్శనానికి మాత్రమే భక్తులను అనుమతిస్తున్నారు. స్వామి వారి ఉచిత దర్శనానికి సుమారు 4 గంటలు, ప్రత్యేక దర్శనానికి రెండు గంటలు పడుతోంది. లోక కళ్యాణం కోసం లక్ష దీపోత్సవం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో లవన్న తెలిపారు. అలాగే లక్ష దీపోత్సవంలో పాల్గొనే భక్తులకు కావాల్సిన వస్తువులను దేవస్థావం వారే ఉచితంగా అందించే ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ కార్తిక పర్వదినం సందర్భంగా ప్రముఖ శైవ క్షేత్రాలన్ని భక్తుల కోలహలంతో శివ నామ స్మరణతో మారుమ్రోగుతున్నాయి. (చదవండి: రబ్బర్ తొడుగులతో 12 మంది వైద్యుల బయోమెట్రిక్ హాజరు ) -
కృష్ణమ్మ పరవళ్లు.. నిండుకుండలా శ్రీశైలం!
సాక్షి, హైదరాబాద్ : కొన్నిరోజులుగా కొనసాగుతున్న కృష్ణమ్మ పరవళ్లు.. రాష్ట్ర రైతాంగంలో ఆశలు రేపుతున్నాయి. నాగార్జున సాగర్‌లో ప్రస్తుతం నమోదవుతున్న ప్రవాహాలు ఖరీఫ్ సాగుకు ఊపిరిపోశాయి. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండటం, ఇకపై వచ్చే నీరంతా దిగువ సాగర్‌కు రానుండటం ఆయకట్టు రైతాంగాన్ని ఆనందంలో ముంచెత్తు తోంది. ఈ నేపథ్యంలో సాగర్ ఎడమ కాల్వ కింద 6.25 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చేందుకు నీటి పారుదల శాఖ సిద్ధమైంది. ఈ ఆయకట్టుకు నీటి విడుదలపై సోమవారం మిర్యాలగూడలో షెడ్యూల్ ప్రకటించనుంది. మొత్తంగా ఏడు తడుల్లో నీరిచ్చేలా కార్యాచరణ సిద్ధం చేసింది. సాగర్‌కు 2.34 లక్షల క్యూసెక్కుల ప్రవాహం సాగర్ ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. గత ఇరవై రోజులుగా స్థిరంగా వస్తున్న ప్రవాహాలతో ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. ఎగువ కర్ణాటకలోని ఆల్మట్టి నుంచి 1.28 లక్షల క్యూసెక్కులు, నారాయణపూర్ నుంచి 1.35 లక్షల క్యూసెక్కుల వరద దిగువకు వస్తోంది. దీంతో జూరాలకు 1.39 లక్షల క్యూసెక్కుల మేర ప్రవాహం నమోదుకాగా, 1.47 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ ప్రవాహాలకు తోడు తుంగభద్ర నుంచి 1.06 లక్షల క్యూసెక్కుల మేర ప్రవాహాలు వస్తుండటంతో శ్రీశైలానికి 2.64 లక్షల క్యూసెక్కుల మేర ఇన్‌ఫ్లో నమోదవుతోంది. ప్రాజెక్టులో ప్రస్తుతం 215.8 టీఎంసీల నిల్వకు గానూ 198.36 టీఎంసీల లభ్యత ఉంది. భారీ ప్రవాహాల నేపథ్యంలో ఇక్కడి నుంచి 2.64 లక్షల క్యూసెక్కుల మేర నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ నేపథ్యంలో సాగర్‌లోకి ప్రస్తుతం 2.34 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా, 312.05 టీఎంసీలకు గానూ 187.83 టీఎంసీల నిల్వలున్నాయి. మరో 125 టీఎంసీలు వస్తే ప్రాజెక్టు నిండుతుంది. నేడు షెడ్యూల్ ప్రకటన జూన్, జూలైలో ప్రవాహాలు లేని కారణంగా ఖరీఫ్‌లో నాగార్జునసాగర్ కింది ఆయకట్టుకు నీటి విడుదలపై ఎలాంటి స్పష్టత లేదు. ప్రస్తుత నిల్వ, వస్తున్న ప్రవాహాలను దృష్టిలో పెట్టుకొని నీటి పారుదల శాఖ వచ్చే నవంబర్ వరకు ప్రాజెక్టు కింద అవసరాలపై అంచనా లెక్కలను సిద్ధం చేసింది. మొత్తంగా 6.25 లక్షల ఎకరాలకు నీరివ్వాలనే సంకల్పంతో ఉంది. దీనికి ఇప్పటికే విడుదల చేసిన 12 టీఎంసీలకు తోడు మరో 33 టీఎంసీలు వినియోగించనుంది. ఇప్పటికే 33 టీఎంసీలు కోరుతూ కృష్ణా బోర్డుకు ఇండెంట్ సమర్పించింది. ఒక్కో టీఎంసీ నీటితో 15 నుంచి 16 వేల ఎకరాలకు నీరిచ్చే అవకాశం ఉందని, ఈ లెక్కన 33 వేల టీఎంసీలు సరిపోతాయని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా 7 తడుల్లో నవంబర్ చివరి వరకు నీటిని ఇచ్చేలా సిద్ధం చేసిన షెడ్యూల్‌ను సోమవారం ప్రకటించనున్నారు. 22వ తేదీ నుంచి ఆయకట్టుకు నీటిని విడుదల చేయనున్నారు. ఎస్ఎల్బీసీ కింద చెరువులను నింపేందుకు 12 టీఎంసీలు, హైదరాబాద్ నగర తాగునీటి అవసరాలకు 7.50 టీఎంసీలు కేటాయించాలని తెలంగాణ కోరుతోంది. 45 టీఎంసీలు దాటాలి.. తెలంగాణతోపాటు, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా, ప్రస్తుతం 1,072 అడుగులకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 33.13 టీఎంసీలు ఉంది. ఆదివారం మధ్యాహ్నం 12,550 క్యూసెక్కుల ప్రవాహం నమోదైంది. అయితే ప్రాజెక్టు నిల్వలు 45 టీఎంసీలకు చేరితే గానీ ఆయకట్టుకు నీటి విడుదలపై స్పష్టత రాదని నీటి పారుదల వర్గాలు పేర్కొంటున్నాయి. ఎల్లంపల్లికి 24 వేల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతుండటం, ప్రాజెక్టు ఇప్పటికే నిండటంతో 32 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలేస్తున్నారు. కడెంలోకి 2,582 క్యూసెక్కులు, ఎల్ఎండీలోకి 527 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు, ప్రవాహాలు ఇలా.. ప్రాజెక్టు వాస్తవ నీటి నిల్వ (టీఎంసీల్లో) ప్రస్తుత నిల్వ ఇన్‌ఫ్లో (క్యూసెక్కుల్లో) ఔట్‌ఫ్లో ఆల్మట్టి 129.72 124.38 1,21,670 1,28,770 నారాయణపూర్ 37.64 35.70 1,30,000 1,35,000 జూరాల 9.66 9.65 1,39,000 1,47,559 శ్రీశైలం 215.81 198.36 2,64,665 2,64,665 సాగర్ 312.05 187.83 2,34,240 8,788 కడెం 7.6 6.01 2,587 5,721 లోయర్ మానేరు 24.07 3.51 527 99 నిజాంసాగర్ 17.80 2.26 0 0 సింగూరు 29.91 7.61 170 170 ఎల్లంపల్లి 20.17 19.09 24,684 32,406 ఎస్సారెస్పీ 90.31 33.13 12,550 380 -
శివయ్యా.. బతికించావయ్యా..!
దోమలపెంట(అచ్చంపేట) : శ్రీశైలం ఆనకట్ట ఘాట్ రోడ్డులో శనివారం ఉదయం కురిసిన భారీ వర్షంతో కొండచరియలు విరిగి రోడ్డుపై పడ్డాయి. నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డుపై అదృష్టవశాత్తు ఆ సమయంలో వాహనాలు రాకపోవడం తో ఎవరికి ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. శివయ్యా.. బతికించావయ్యా.. అంటూ ప్రయాణికులు ఊపరిపి పీల్చుకున్నారు. ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఈ ప్రాం తంలో కుండపోత వర్షం కురిసింది. ఆనకట్ట వద్ద శ్రీశైలం ఘాట్‌రోడ్డులో వర్షపు నీరు వరదలా ప్రవహించడంతో రోడ్డు ప్రొటక్షనల్ కూలిపోయింది. దీంతో కొండ చరియలు దిగువనున్న ఘాట్ రోడ్డుపై అడ్డంగా పడిపోయాయి. ఎస్పీఎఫ్ సేవలు భేష్ సమాచారం అందుకున్న శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ విద్యుత్తు కేంద్రం రక్షణ బాధ్యతలు చూస్తున్న ఎస్పీఎఫ్ (స్పెషల్ ప్రొటక్షన్ ఫోర్స్) ఎస్ఐలు జి.శ్రీనివాస్, ఎం.రంగయ్య, సిబ్బంది ప్రయాణికులను అప్రమత్తం చేశారు. అనంతరం బండరాళ్ల తొలగింపు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. హెడ్‌కానిస్టేబుల్ ప్రేమ్‌కుమార్, ఉప సర్పంచ్ ప్రసాద్, పాతాళగంగ అంజిలు సైతం స్పందించి టూరిజం పనులు చేస్తున్న ప్రొక్లయిన్తో రోడ్డుపై అడ్డంగా పడిన బండరాళ్లను తీయించారు. వీటిని తీయడానికి సుమారు మూడు గంటల సమయం పట్టింది. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వైపు వస్తున్న వాహనాలన్నింటిని ఈగలపెంట వద్దనున్న జెన్కో గ్రౌండ్లో పార్క్ చేయించారు. జరిగిన సంఘటనను తెలియపరచి కొండచరియలను తొలగించిన తర్వాత పంపించారు. మరోవైపు శ్రీశైలం నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న వాహనాలను భూగర్భ కేంద్రం పీఏటీ ప్రాంతం వద్ద నిలిపివేయించారు. రాళ్లను తొలగించిన అనంతరం నెమ్మదిగా ఘాట్‌నుంచి దాటించారు. అనంతరం భూగర్భ కేంద్రం చీఫ్ ఇంజినీర్ మంగేష్‌కుమార్ ఎస్పిఎఫ్ పోలీసులు పర్యాటకులు, భక్తులకు అందించిన సేవలను ప్రశంసించారు. ప్రమాదకరంగా రహదారి ఇదిలాఉండగా కొండచరియలు పడిన ప్రతి సారి రోడ్డుపైనున్న మరో రోడ్డులో కూలిపోయిన రోడ్డు ప్రొటక్షన్ వాల్ క్రమంగా పెద్దదవుతూనే ఉంది. దీంతో రాళ్లు ద్రొర్లుతూ వచ్చి దిగువ రోడ్డుపై పడుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఆనకట్ట ఘాట్ రోడ్డు వద్ద వాహనాల రాకపోకలు సాగించడం ప్రమాదకరంగా మారింది. ఆర్అండ్బీ అధికారులు యుద్దప్రాతిపదికన స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఆకలితో అలమటించిన ప్రయాణికులు ఇదిలాఉండగా అనుకోని విధంగా ట్రాఫిక్ జామ్ కావడంతో మూడు గంటలపాటు ప్రయాణికులు వాహనాల్లో ఇబ్బంది పడ్డారు. ఈగలపెంటలో పర్యాటకులు, భక్తులు వాహనాలు, ఆర్టీసి బస్సులను నిలిపివేయడంతో నిరీక్షించాల్సి వచ్చింది. స్థానికంగా ఉన్న హోటళ్లలో టీ, టిఫిన్ అయిపోవడంతో చాలామంది ఆకలితో అలమటించారు. తాగడానికి, సేద తీరడానికి కూడా వీల్లేని పరిస్థితి ఉండడంతో పర్యాటకులు ఇక్కట్ల పాలయ్యారు. -
'శ్రీశైలం నీటి వివాదంపై కేంద్రం స్పందించాలి'
హైదరాబాద్: శ్రీశైలం నీటి వివాదం విషయంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని వైఎస్ఆర్ సీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు రాజకీయ లబ్ది కోసమే ప్రయత్నిస్తున్నాయమని విమర్శించారు. వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు, ప్రజాసమస్యలపై సమావేశంలో చర్చించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, గవర్నర్ నరసింహన్‌ను కలసి సమస్యలను వారి దృష్టికి తీసుకెళతామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. వైఎస్ఆర్ సీపీ ప్రజల పక్షాన పోరాడుతుందని అన్నారు. వచ్చే నెల 9న రంగారెడ్డి, 13న మహబూబ్ నగర్, 17న నల్లగొండలలో పార్తీ విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు.