సిటీబ్యూరో: మజాతో మనీని కూడా కలిపి జీ తెలుగు అందిస్తున్న గేమ్ షో ‘రేస్’. నటి రోజా ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. ఆలోచింపజేసే ప్రశ్నలతో, సెలబ్రిటీస్ సరదాలతో, ఆట పాటలతో ‘హంగామా’గా ఈ రేస్ కార్యక్రమం ఉండబోతోందని జీ తెలుగు చానల్ ప్రతినిధి తెలిపారు. సీనియర్ యాంకర్స్ ఝాన్సీ, శిల్పా చక్రవర్తిలతోపాటు నటుడు మధునందన్, చంద్ర తొలి ఎపిసోడ్‌లో పాల్గొని వినోదాన్ని పంచనున్నారనీ, రానున్న ఎపిసోడ్స్‌లో ఎందరో సెలబ్రిటీస్ ఈ కార్యక్రమంలో అలరించనున్నారనీ వారు చెప్పారు. ఈ నెల 29 (రేపు) నుంచి ప్రతి శనివారం రాత్రి 9 గం. 30 నిమిషాలకు ఈ కార్యక్రమం ప్రసారం కానుంది.
బహుమతిగా ముద్దమందారం..
జీ తెలుగులో ఇటీవలే ప్రారంభమై విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ధారావాహిక ‘ముద్దమందారం’. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న ఈ ధారావాహిక ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోందనీ, ఈ కథ విన్న నాగార్జున... ప్రియమైన వారికి విలువైన బహుమతుల బదులుగా ముద్దమందారం మొక్కని ఇవ్వాలని పిలుపునిచ్చారనీ జీ తెలుగు చానల్ ప్రతినిధి తెలిపారు. తనూజ, హరిత, పవన్‌సాయి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సీరియల్ సోమవారం నుంచి శనివారం వరకూ రాత్రి 7 .30 గంటలకు ప్రసారమవుతుంది.
జీ తెలుగు గేమ్ షో ‘రేస్’
Published Fri, Nov 28 2014 12:31 AM | Last Updated on Wed, Apr 3 2019 9:14 PM
Advertisement
Advertisement