స్టాండింగ్‌ కమిటీలో సమప్రాతినిధ్యం | ZP Standing Committee Meeting In Nizamabad | Sakshi
Sakshi News home page

స్టాండింగ్‌ కమిటీలో సమప్రాతినిధ్యం

Published Fri, Aug 23 2019 9:50 AM | Last Updated on Fri, Aug 23 2019 9:50 AM

ZP Standing Committee Meeting In Nizamabad - Sakshi

జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశానికి హాజరైన జెడ్పీటీసీ సభ్యులు

సాక్షి, నిజామాబాద్‌: అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఒక్కో జెడ్పీటీసీని ఒక్కో స్టాండింగ్‌ కమిటీ (స్థాయీ సంఘం)లో సభ్యులుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. నిజామాబాద్‌ అర్బన్‌ మినహాయిస్తే మిగిలిన ఐదు నియోజకవర్గాల నుంచి అన్ని కమిటీల్లో ప్రాతినిధ్యం ఉండేలా కూర్పు జరిగింది. పక్షం రోజుల క్రితం నుంచే ఈ కమిటీలపై కసరత్తు కొనసాగుతోంది. జెడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు అధ్యక్షతన గురువారం జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో కమిటీలను ప్రకటించారు. సమావేశానికి మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ డి రాజేశ్వర్‌రావు హాజరు కాగా, ఎమ్మెల్యేలంతా గైర్హాజరయ్యారు. సమావేశం ప్రారంభానికి ముందు చైర్మన్‌ చాంబర్‌లో జెడ్పీటీసీలందరూ కమిటీలపై చర్చించారు. అనంతరం మధ్యాహ్నం జెడ్పీ సమావేశం ప్రారంభమైంది. సీఈఓ ఐ గోవింద్‌ కమిటీలను అధికారికంగా ప్రకటించారు. 

కమిటీలు ఇలా... 
ఫైనాన్స్, ప్లానింగ్‌ కమిటీ చైర్మన్‌గా జెడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు, సభ్యులుగా సీహెచ్‌.రవి (భీంగల్‌ జెడ్పీటీసీ), విజయభాస్కర్‌రెడ్డి (మోస్రా), బాజిరెడ్డి జగన్‌మోహన్‌ (ధర్పల్లి), పి.లక్ష్మిబాయి (బోధన్‌),  వేముల ప్రశాంత్‌రెడ్డి ( ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి),  ఆశన్నగారి జీవన్‌రెడ్డి (ఆర్మూర్‌ ఎమ్మెల్యే)  
గ్రామీణాభివృద్ధి కమిటీ చైర్మన్‌గా జెడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు, సభ్యులుగా బి హరిదాస్‌(వర్ని జెడ్పీటీసీ), బి సుమలత (నిజామాబాద్‌రూరల్‌), ఎంఎ మోయిజ్‌(కోఆప్షన్‌ సభ్యులు), ఎండీ సిరాజ్‌(కోఆప్షన్‌ సభ్యులు),  బీబీ పాటిల్‌(జహీరాబాద్‌ ఎంపీ).
వ్యవసాయ కమిటీ చైర్మన్‌గా జెడ్పీ వైస్‌చైర్‌పర్సన్‌ మానకాల రజిత , సభ్యులుగా దాదన్నగారి విఠల్‌రావు, బి.రవి (మోర్తాడ్‌ జెడ్పీటీసీ), ఎన్‌ గంగారాం (రుద్రూరు జెడ్పీటీసీ), ఎం మాన్‌సింగ్‌ (సిరికొండ జెడ్పీటీసీ), డి శ్రీనివాస్‌(రాజ్యసభ సభ్యులు), బాజిరెడ్డి గోవర్ధన్‌(రూరల్‌ ఎమ్మెల్యే). 
విద్య, వైద్యం కమిటీ చైర్మన్‌గా దాదన్నగారి విఠల్‌రావు, సభ్యులుగా ఎ భారతి(వేల్పూరు), గడ్డం సుమన రవిరెడ్డి (ఇందల్‌వాయి జెడ్పీటీసీ), ఎస్‌ శంకర్‌ (కోటగిరి), టి గంగాధర్‌ (మెండోర), వీజీ గౌడ్‌(ఎమ్మెల్సీ). 
స్త్రీ, శిశు సంక్షేమ కమిటీ చైర్మన్‌గా దాసరి లావణ్య, సభ్యులుగా దాదన్నగారి విఠల్‌రావు, వై యమున (నందిపేట జెడ్పీటీసీ), కమల బా నోత్‌ (మోపాల్‌), జి రాజేశ్వర్‌ (ఏర్గట్ల), ఆకుల లలిత (ఎమ్మెల్సీ), టి జీవన్‌రెడ్డి(ఎమ్మెల్సీ). 
సోషల్‌ వెల్ఫేర్‌ కమిటీ చైర్మన్‌గా దాసరి ఇందిర (డిచ్‌పల్లి జెడ్పీటీసీ), సభ్యులుగా దాదన్నగారి విఠల్‌రావు, బి నర్సవ్వ(ముప్కాల్‌), ఆర్‌ అంబర్‌సింగ్‌(చందూరు), ఎం విజయ(రెంజల్‌), ధర్మపురి అరవింద్‌(ఎంపీ). 
పనులు కమిటీ చైర్మన్‌గా దాదన్నగారి విఠల్‌రావు, సభ్యులుగా పి రాధ(కమ్మర్‌పల్లి), పి తనూజ (జక్రాన్‌పల్లి), ఎన్‌ సవిత(నవీపేట), ఎం సంతోష్‌(ఆర్మూర్‌), పోచారం శ్రీనివాస్‌ రెడ్డి( స్పీకర్‌), ఎండీ షకీల్‌ అమీర్‌(బోధన్‌ ఎమ్మెల్యే), డి.రాజేశ్వర్‌(ఎమ్మెల్సీ) కమిటీలో ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement