
వరద బీభత్సం:105 మంది మృతి!
నేపాల్ లో వరద విలయ తాండవం సృష్టించింది. ఆదివారం సంభవించిన ఈ ప్రళయ విధ్వంసంలో 105 వరకూ మృత్యువాత పడ్డారు.
కాట్మాండు:నేపాల్ లో వరద విలయ తాండవం సృష్టించింది. ఆదివారం సంభవించిన ఈ ప్రళయ విధ్వంసంలో 105 వరకూ మృత్యువాత పడ్డారు. మరో 135 మంది ఆచూకీ గల్లంతైంది. నేపాల్ లోని వరద తాకిడికి కొండచరియలు విరిగి పడటంతో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి నేపాల్ హెం మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఇప్పటివరకూ 105 మంది మృతి చెందగా, ఏడు మృతదేహాలు మాత్రమే లభించినట్లు స్పష్టం చేసింది.
దేశంలోని బర్దియా, బాంకే, కైలాలీ తదితర ప్రాంతాల్లో వరద తాకిడికి కొండచరియులు విరిగిపడటంతోనే అధికమొత్తంలో ప్రజలు మృతిచెందారని తెలిపింది. అయితే ప్రజలు వ్యాధుల బారిన పడతామనే ఆందోళన నేపథ్యంలో ముందుస్తు జాగ్రత్త చర్యలో భాగంగా మెడిసన్ ప్యాకేజ్ లను కూడా సిద్దం చేశామని స్పష్టం చేసింది. కాగా 200 మంది బాధితులికి హోలీయా, బహదూర్ మల్లాల్లో వైద్యం అందించినట్లు ఆరోగ్య కార్యాలయం తెలిపింది.