ఫిలిప్పీన్స్లో శనివారం భారీ భూకంపం సంభవించింది.
మనీలా: ఫిలిప్పీన్స్లో శనివారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.5 నమోదైంది. 69 కిలో మీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు.
ఆస్తి, ప్రాణ నష్టం ఏమైనా జరిగిందా అన్న విషయం ఇంకా తెలియరాలేదు. ఈ భూకంపం వల్ల సునామీ వచ్చే ప్రమాదం లేదని పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం తెలియజేసింది.