లెటర్ బాంబులు పేలి ఆరుగురి మృతి | 6 Killed in China as Letter Bombs Explode in Multiple Locations | Sakshi
Sakshi News home page

లెటర్ బాంబులు పేలి ఆరుగురి మృతి

Published Wed, Sep 30 2015 6:12 PM | Last Updated on Sun, Sep 3 2017 10:15 AM

లెటర్ బాంబులు పేలి ఆరుగురి మృతి

లెటర్ బాంబులు పేలి ఆరుగురి మృతి

బీజింగ్: చైనాలో లెటర్ బాంబులు పేలిన ఘటనలో ఆరుగురు మరణించగా, పలువురు గాయపడ్డారు. బుధవారం చైనాలోని గ్వాంఝై ప్రాంతంలో ప్రభుత్వ ఆఫీసులతో సహా పదికిపైగా ప్రాంతాల్లో 15 లెటర్ బాంబులు పేలాయి.

చైనా జాతీయ దినోత్సవం నాడు ఈ దుర్ఘటన జరిగింది. స్వీడ్ డెలివరీ ప్యాకేజీల్లో పేలుడు పదార్థాలను అమర్చి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. జైలు, ప్రభుత్వ కార్యాలయం, షాపింగ్ సెంటర్లో లెటర్ బాంబులు పేలాయి. ఓ భవంతి సగానికి కూలిపోగా, రోడ్డుపై పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement