లండన్లోని అపోలో థియటర్లోని పై కప్పు (సీలింగ్) ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ ఘటనలో 76 మంది మంది గాయపడ్డారని ఉన్నతాధికారులు వెల్లడించారు. వారిలో ఏడుగురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని చెప్పారు. గత రాత్రి ఘటన చోటు కున్నప్పుడు థియటర్ ప్రేక్షకులతో నిండి ఉందని, ఈ నేపథ్యంలో క్షతగాత్రుల సంఖ్య పెరిగిందని వివరించారు.
థియటర్పై భాగం చిన్న శబ్దంతో ఒక్కసారిగా మీదపడిందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారని చెప్పారు. అయితే ఆ సీలింగ్ కుప్పకూలిన ఘటనతో షాక్ గురైనట్లు అపోలో థియటర్ యాజమాన్యం వెల్లడించింది. ఆ ఘటనకు కారణాలను ఆన్వేషించేందుకు చర్యలు చేపట్టినట్లు ఓ ప్రకటనలో తెలిపింది.