
8 ఏళ్ల బాలికపై అత్యాచారం
జైపూర్: మదర్సాలో 8 ఏళ్ల బాలికపై గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటన రాజస్థాన్ లోని సంగనేర్ ప్రాంతంలో బుధవారం చోటు చేసుకుంది. మదర్సాకు వెళ్లిన బాలికను భవనంపైకి (రూప్ టాప్) తీసుకెళ్లి దుండగుడు ఈ ఆఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాధితురాలు ఇంటికి తిరిగొచ్చి తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది.
పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. బాధితురాలిని జేకే లోన్ ఆస్పత్రికి తరలించారు. ఆమెపై అత్యాచారం జరిగినట్టు వైద్యులు నిర్ధారించారని పోలీసులు తెలిపారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.