విద్యార్థినిపై యాసిడ్ దాడి | Acid thrown at college girl in uttar pradesh | Sakshi
Sakshi News home page

విద్యార్థినిపై యాసిడ్ దాడి

Published Tue, Dec 17 2013 3:06 PM | Last Updated on Thu, Mar 21 2019 9:07 PM

Acid thrown at college girl in uttar pradesh

కళాశాల నుంచి ఇంటికి వెళ్తున్న విద్యార్థినిపై బైకుపై వచ్చిన ముగ్గురు యువకులు యాసిడ్తో దాడి చేసిన సంఘటన ఉత్తరప్రదేశ్ మీరట్ సమీపంలోని మన్వాలో  చోటు చేసుకుంది. దీంతో స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో  పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ఆ బాలికను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

 

ఆ బాలిక మోహం మొత్తం కాలిందని, అయితే కళ్లు మాత్రం సురక్షితంగా ఉన్నాయని చెప్పారు. అయితే బాధితులరాలి పరిస్థితి విషమంగానే ఉందని తెలిపారు. కళాశాలో నిర్వహించిన పరీక్ష రాసి ఇంటికి వెళ్తున్న క్రమంలో ఆగంతకులు యాసిడ్ దాడి చేశారని పోలీసులు వెల్లడించారు. అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. సాధ్యమైనంత త్వరగా నిందితులను ఆదుపులోకి తీసుకుంటామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement