బీజింగ్: ప్రపంచవ్యాప్తంగా కార్లు సృష్టిస్తున్న కాలుష్యం అంతాఇంతా కాదు. ఊహించలేనంత. రెండవ ప్రపంచ యుద్ధం 70వ వార్షికోత్సవం సందర్భంగా చైనా రాజధాని బీజింగ్‌లో రెండు వారాలపాటు రోడ్లపై కార్ల రాకపోకలను నిషేధించారు. దీంతో ఒక్కసారిగా ఏర్ క్వాలిటీ ఇండెక్స్ (అంతర్జాతీయ కాలుష్య ప్రమాణాల సూచిక)లో కాలుష్యం స్థాయి 500 నుంచి 17కు పడిపోయింది. నింగిలోని నీలాకాశం స్పష్టంగా కనువిందుగా కనిపించింది.
గత గురువారం నాడు పరేడ్ ముగిశాక బీజింగ్ అధికారులు కార్ల రాకపోకలపై నిషేధం ఎత్తివేశారు. ఆ తర్వాత 24 గంటల్లోగానే కాలుష్యం పెరిగిపోయి ఆకాశం కనిపించనంతగా వాతావరణం మారిపోయింది. ఎగువ, దిగువ ఫొటోల్లో ఆ తేడాను స్పష్టంగా చూడవచ్చు.