ఎయిరిండియా విమానానికి తప్పిన ముప్పు | air india flight misses mishap, landing gear pins not removed | Sakshi
Sakshi News home page

ఎయిరిండియా విమానానికి తప్పిన ముప్పు

Published Tue, Feb 28 2017 12:34 PM | Last Updated on Tue, Sep 5 2017 4:51 AM

ఎయిరిండియా విమానానికి తప్పిన ముప్పు

ఎయిరిండియా విమానానికి తప్పిన ముప్పు

ఎయిరిండియాలో పనిచేసే ఇద్దరు ఇంజనీర్ల నిర్లక్ష్యంగా కారణంగా ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురవ్వబోయి, త్రుటిలో తప్పించుకుంది. ఢిల్లీ నుంచి కేరళలోని కొచ్చి వెళ్లాల్సిన విమానం... అన్నిరకాలుగా సిద్ధంగా ఉందని ఆ ఇద్దరు ఇంజనీర్లు క్లియరెన్సు ఇచ్చారు. కానీ, ల్యాండింగ్ గేర్ పిన్‌లను వాళ్లు తీయలేదు. విమానం అలాగే గాల్లోకి ఎగిరింది. 
 
తీరా గాల్లోకి వెళ్లిన తర్వాత చక్రాలు లోపలకు వెళ్లాల్సింది వెళ్లలేదు.. విషయాన్ని గుర్తించిన పైలట్ టేకాఫ్ తీసుకున్న కొద్ది సేపటికే దాన్ని మళ్లీ ఢిల్లీ విమానాశ్రయంలో దించేశారు. దాంతో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను ఇద్దరు ఇంజనీర్లను విధుల నుంచి ఎయిరిండియా తప్పించింది. ఈ విషయాన్ని డీజీసీఏకు తెలిపింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement