landing gear problem
-
గాల్లోకి ఎగిరాక ఊడిపోయిన విమానం టైర్
రోమ్: అట్లాస్ ఎయిర్‌కు చెందిన బోయింగ్ 747 విమానం గాల్లోకి ఎగిరిన కాసేపటికే దాని ల్యాండింగ్ గేర్ టైర్ ఊడిపోయింది. ఈ సంఘటన ఇటలీలోని టరంటో విమానాశ్రయం నుంచి బయలుదేరిన కాసేపటికే జరిగింది. ఈ భారీ విమానాన్ని ప్రధానంగా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ పరికరాలను రవాణా చేసేందుకు ఉపయోగిస్తుంటారు. ఇటలీలోని టరంటో ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి అమెరికాలోని చార్లెస్టన్కు చేరుకోవాల్సి ఉంది. విమానం టైర్ ఊడిపోయిన దృశ్యాలు కెమెరాలో నమోదయ్యాయి. భారీ రవాణా విమానం రన్‌వేపై వేగంగా వెళ్తూ గాల్లోకి ఎగిరింది. అయితే, ఆ కాసేపటికే ల్యాండింగ్ గేర్ టైర్ ఊడిపోయింది. రన్‌వేపై పడి కొంత దూరం దొర్లుతూ వెళ్లింది. చక్రం ఊడిపోయిన క్రమంలో నల్లటి పొగ సైతం వచ్చినట్లు వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది. అయితే, ఎలాంటి ప్రమాదం జరగలేదు. టైర్ ఊడిపోయినప్పటికీ అలాగే అమెరికా చేరిన విమానం.. చార్లెస్టన్ విమానాశ్రయంలో సురక్షితంగా దిగింది. టైర్ టరంటో ఎయిర్పోర్ట్ రన్‌వే చివరిలో గుర్తించారు. బోయింగ్ 747 డ్రీమ్‌లిఫ్టర్ రవాణా విమానం. బోయింగ్ 747-400 ఎయిర్‌క్రాఫ్ట్‌ను ఆధునికీకరించి రవాణా విమానంగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం విమాన పరకరాలను రవాణా చేసేందుకు ఉపయోగిస్తున్నారు. సెప్టెంబర్, 2006లో తొలిసారి గాల్లోకి ఎగిరింది. అయితే, వస్తు రవాణాకు మాత్రమే అనుమతి ఉంది. కేవలం విమాన సిబ్బంది మినహా మానవ రవాణాకు దీనిని ఉపోయోగించేందుకు అనుమతి లేదు. Un Boeing 747 Dreamlifter operat de Atlas Air (N718BA) care a decolat marți dimineață (11OCT22) din Taranto (IT) spre Charleston (SUA) a pierdut o roată a trenului principal de aterizare în timpul decolării. Avionul operează zborul #5Y4231 și transportă componente de Dreamliner. pic.twitter.com/R95UHkLD7V — BoardingPass (@BoardingPassRO) October 11, 2022 ఇదీ చదవండి: Work From Pub Trend: యూకేలో నయా ట్రెండ్ ‘వర్క్ ఫ్రమ్ పబ్’.. ఆడుతూ పాడుతూ పని! -
ఇద్దరు పైలెట్ల లైసెన్స్ రద్దు చేసిన డీజీసీఏ
న్యూఢిల్లీ: జబల్పూర్ విమానాశ్రయంలోని రన్‌వే పై మార్చి 12న ల్యాండ్ అయిన ఒక విమానం విషయమై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విచారణ జరిపింది. ఈ మేరకు ఢిల్లీకి చెందిన అలయన్స్ ఎయిర్ ఏటీఆర్-72 విమానం ఆ రోజు జబల్పూర్లో రన్‌వేని దాటి ల్యాండ్ అయ్యింది. ఈ విమానంలో దాదాపు 55 మంది ప్రయాణికులు ఉన్నారు. దర్యాప్తులో ఈ విమానం రన్‌వే సమీపంలో చాలా సేపు ల్యాండ్ అవ్వకుండా గాల్లోనే ఉందని, రన్‌వేకి దాదాపు 900 మీటర్లు దాటి ల్యాండ్ అయ్యిందని తేలింది. అలాంటి విపత్కర సమయంలో మంటలు రాజుకునే అవకాశం పొంచి ఉందని డీజీసీఏ పేర్కొంది. ల్యాండింగ్ సమయంలో విమానం సరిగా స్థిరికరించబడకపోతే వెంటనే గో అరౌండ్ కోసం అధికారులకు సమాచారం ఇవ్వాలి. కానీ ఆ పైలెట్లు ఇద్దరూ అవేమి చేయకుండా ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలో పడేసి ఏవియేషన్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ ఒక ఏడాది పాటు వేటు వేసింది. (చదవండి: చీర కట్టుకోవడం రాదని.. లెటర్ రాసి భర్త ఆత్మహత్య) -
గాల్లో చక్కర్లకు ఇక చెక్!
సాక్షి, అమరావతి బ్యూరో: మేఘాలు ఆవరించినా, పొగమంచు కమ్ముకున్నా విమానాల ల్యాండింగ్‌కు సమస్య తలెత్తుతుంది. రన్‌వే పైకి దిగాలంటే రిస్క్‌తో కూడుకున్న పని. అందుకే అలాంటి వాతావరణ పరిస్థితులేర్పడినప్పుడు పైలెట్లు విమానాలను రన్‌వే పైకి దించకుండా కాసేపు గాల్లోనే చక్కర్లు కొడుతుంటారు. ఆ సమయంలో విమానంలో ఉన్న ప్రయాణికుల్లో అలజడి, ఆందోళన నెలకొంటుంది. కొంతసేపటికి మేఘాలు/పొగమంచు క్లియర్ అయ్యాక రన్‌వేపై ల్యాండ్ అవడానికి విమానాశ్రయ అధికారులు అనుమతులిస్తారు. లేదంటే ఆ విమానాన్ని వెనక్కి పంపిస్తారు. శీతాకాలం, వానాకాలాల్లో ఇలాంటి పరిస్థితులు సహజంగా ఏర్పడుతుంటాయి. మన విజయవాడ (గన్నవరం) అంతర్జాతీయ విమానాశ్రంలోనూ తరచూ పొగమంచు కమ్ముకోవడం, మబ్బులు ఆవరించడం సర్వసాధారణంగా మారింది. ప్రస్తుతం ఈ ఎయిర్‌పోర్టులో సింపుల్ అప్రోచ్ సిస్టం మాత్రమే ఉంది. దీనివల్ల రన్‌వేపై ల్యాండ్ అయ్యే విమానాల పైలట్లకు రన్‌వేపై పరిస్థితి కనిపించక (విజిబిలిటీ లేక) సతమతమవుతున్నారు. రూ. 2 కోట్లతో.. ఈ నేపథ్యంలో ఈ విమానాశ్రయంలో కొత్తగా కేటగిరి–1 (కేట్–1) అప్రోచ్ లైటింగ్ సిస్టంను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు దాదాపు రూ.2 కోట్లు వెచ్చిస్తున్నారు. ఇటీవలే ఇందుకు అవసరమైన పనులను ప్రారంభించారు. ఈ విద్యుత్ లైట్లను రన్‌వేకి ఇరువైపులా రన్‌వే దాటాక దాదాపు 900 మీటర్ల వరకు (బుద్ధవరం–దావాజీగూడెం వైపు) ఏర్పాటు చేస్తారు. కేట్–1 అప్రోచ్ లైటింగ్ సిస్టం మరో మూడు నెలల్లో అందుబాటులోకి రానుంది. ఇది అందుబాటులోకి వస్తే 300–400 మీటర్ల వరకు విజిబిలిటీని పెంచుతుంది. లైటింగ్ బ్రైట్‌గా కనిపిస్తుంది. దీంతో పైలెట్ దూరం నుంచే రన్‌వేను అంచనా వేయడానికి వీలవుతుంది. వెయ్యి మీటర్ల లోపు విజిబిలిటీ పడిపోతే పైలట్లు ల్యాండింగ్‌కు సాహసం చేయరు. ఇకపై ఇలా వెయ్యి మీటర్లలోపు విజిబిలిటీ తగ్గినా అప్రోచ్ లైటింగ్ సిస్టం వల్ల రన్‌వే స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో పూర్ విజిబిలిటీలోనూ విమానాలు ల్యాండ్ అవుతాయన్న మాట! రాష్ట్రంలోనే మొదటిది.. భారత నావికాదళం ఆధీనంలో ఉన్న విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో మినహా రాష్ట్రంలో మరే ఎయిర్పోర్టుల్లోనూ ఇప్పటివరకు కేట్–1 అప్రోచ్ లైటింగ్ సిస్టం ఏర్పాటు కాలేదు. దీంతో రాష్ట్రంలో ఈ సిస్టం అందుబాటులోకి రానున్న తొలి ఎయిర్‌పోర్టు ఇదే కావడం విశేషం!! విజిబిలిటీ సమస్య ఉండదు వర్షాకాలంలో మేఘాలు ఆవరించినప్పుడు, శీతాకాలంలో పొగమంచు ఏర్పడినప్పుడు విజిబిలిటీ సరిగా లేక ఈ విమానాశ్రయంలో విమానాలు ల్యాండ్ అవడానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం ఈ ఎయిర్‌పోర్టులో సింపుల్ అప్రోచ్ లైటింగ్ సిస్టం ఉంది. విజిబిలిటీ సమస్యను అధిగమించడానికి కొత్తగా కేట్–1 అప్రోచ్ లైటింగ్ సిస్టంను ఏర్పాటు చేస్తున్నాం. ఇది అందుబాటులోకి వస్తే విజిబిలిటీ సమస్యకు చాలా వరకు పరిష్కారం లభించినట్టవుతుంది. మరో మూడు నెలల్లో ఈ సిస్టం అందుబాటులోకి వస్తుంది. – గిరి మధుసూదనరావు, డైరెక్టర్, విజయవాడ విమానాశ్రయం -
విమానం ల్యాండ్ అవుతుండగా చెలరేగిన మంటలు
టెహ్రాన్ : ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని మెహ్రాబాద్ విమానాశ్రయంలో మంగళవారం పెనుప్రమాదం తప్పింది. ల్యాండవుతున్న ఓ విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో విమానంలో దాదాపు 100 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వెంటనే స్పందించిన సిబ్బంది వారిని సురక్షితంగా కిందకు దించేశారని అధికారులు తెలిపారు. ఇరాన్ ఎయిర్ సంస్థకు చెందిన ఫాకర్ 100 విమానంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సాంకేతిక కారణాల వల్ల ల్యాండింగ్ గేర్ సరైన సమయంలో తెరచుకోలేదని.. అందువల్లే ప్రమాదం సంభవించినట్లు అధికారుల భావిస్తున్నారు. ప్రమాదం విషయం తెలిసి వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. విమానాశ్రయంలోని అంబులెన్సులు గాయాలైన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఈ సంఘటనపై విచారణ జరుపుతున్నట్లు.. ప్రమాదానికి గల కారణాల గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. Plane catches fire at Tehran's Mehrabad airportpic.twitter.com/VToujBXdZI — Matilda Effect (@matilda_effect) March 19, 2019 -
ఓఎన్జీసీ హెలికాఫ్టర్‌కు తప్పిన ప్రమాదం
సాక్షి, రాజమండ్రి: రాజమండ్రిలో ఓఎన్జీసీ హెలికాఫ్టర్‌కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. గురువారం ఉదయం ఓఎన్జీసీకి చెందిన హెలికాఫ్టర్ రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే ప్రతికూల వాతావరణంతో ల్యాండింగ్ కష్టమై ఆకాశంలోనే చక్కర్లు కొట్టింది. అయితే స్థానికంగా ఉన్న రావులపాలెం వద్ద పొలాల్లో హెలికాఫ్టర్‌ను ఫైలట్ సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం తప్పడంతో హెలికాఫ్టర్‌లో ఉన్న సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. కాగా, ఈరోజు ఉదయం నుంచి రాజమండ్రిలో భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో పలు చోట్టు చెట్లు, భారీ హోర్డింగ్‌లు విరిగిపడ్డాయి. మరోవైపు ఆకాశం మేఘావృతం కావడంతో పట్టపగలే చిమ్మచీకటిని తలపిస్తోంది. -
ఎయిరిండియా విమానానికి తప్పిన ముప్పు
ఎయిరిండియాలో పనిచేసే ఇద్దరు ఇంజనీర్ల నిర్లక్ష్యంగా కారణంగా ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురవ్వబోయి, త్రుటిలో తప్పించుకుంది. ఢిల్లీ నుంచి కేరళలోని కొచ్చి వెళ్లాల్సిన విమానం... అన్నిరకాలుగా సిద్ధంగా ఉందని ఆ ఇద్దరు ఇంజనీర్లు క్లియరెన్సు ఇచ్చారు. కానీ, ల్యాండింగ్ గేర్ పిన్‌లను వాళ్లు తీయలేదు. విమానం అలాగే గాల్లోకి ఎగిరింది. తీరా గాల్లోకి వెళ్లిన తర్వాత చక్రాలు లోపలకు వెళ్లాల్సింది వెళ్లలేదు.. విషయాన్ని గుర్తించిన పైలట్ టేకాఫ్ తీసుకున్న కొద్ది సేపటికే దాన్ని మళ్లీ ఢిల్లీ విమానాశ్రయంలో దించేశారు. దాంతో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను ఇద్దరు ఇంజనీర్లను విధుల నుంచి ఎయిరిండియా తప్పించింది. ఈ విషయాన్ని డీజీసీఏకు తెలిపింది.