ఎయిర్‌ ఇండియా వారికి మూడేళ్లు తగ్గించింది | Air India lowers age limit to 60 years for elderly travel concession | Sakshi
Sakshi News home page

ఎయిర్‌ ఇండియా వారికి మూడేళ్లు తగ్గించింది

Published Fri, Apr 21 2017 7:59 PM | Last Updated on Tue, Sep 5 2017 9:20 AM

ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా సీనియర్‌ సిటిజన్లకు శుభవార్తం అందించింది.

న్యూఢిల్లీ:  ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా సీనియర్‌ సిటిజన్లకు శుభవార్తం అందించింది.    ప్రయాణం రాయితీ పొందేందుకు ఉద్దేశించిన వయసు పరిమితిని మూడు సంవత్సరాలు తగ్గించింది.  సీనియర్‌ సిటిజెన్స్‌ ట్రావెల్‌  కన్‌సెషన్‌ పొందే   పథకానికి వయసు పరిమితిని  60  సం.రాలుగా నిర్ణయించింది   

ఎయిర్‌ ఇండియా సీనియర్ పౌరులుగా పరిగణించే వయసును 60 ఏళ్లకు తగ్గించింది. ఇప్పటిదాకా ఈ పరిమితి 63 ఏళ్లు.  ఈ పథకం ప్రకారం, 60 రోజుల వయసున్న భారతీయ పౌరుడికి ఎయిర్‌ ఇండియా ఎకానమీ విమానంలో మూల రేటులో 50 శాతం  డిస్కౌంట్‌ లభిస్తుంది. గతంలో 63 సం.రాలు ఉన‍్న ఈ పరిమితిని 60కి తగ్గించినట్టుగా  ఎయిర్ ఇండియా ప్రతినిధి ధ్రువీకరించారు.  అయితే, ఈ ఆఫర్  దేశీయ ప్రయాణంలో మాత్రమే చెల్లుతుంది.

ఈ  డిస్కౌంట్‌  పొందేందుకుగాను  ఓటరు గుర్తింపు కార్డు, పాస్‌పోర్ట్‌,  డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఎయిర్ ఇండియా జారీ చేసిన సీనియర్ సిటిజెంట్ కార్డు లాంటి చెల్లుబాటు అయ్యే గుర్తింపును కార్డును   చూపించాల్సి ఉంటుంది.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement