విమానంలో 'కాక్రోచ్ మీల్' | Air India 'serves' cockroach-meal on flight | Sakshi
Sakshi News home page

విమానంలో 'కాక్రోచ్ మీల్'

Published Fri, Nov 18 2016 1:39 PM | Last Updated on Tue, Oct 2 2018 8:04 PM

విమానంలో 'కాక్రోచ్ మీల్' - Sakshi

విమానంలో 'కాక్రోచ్ మీల్'

న్యూఢిల్లీ: ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా మరోసారి చిక్కుల్లో పడింది. ఓ  ప్రయాణికుడికి అందించిన భోజనంలో   బొద్దింక దర్శనమిచ్చిన ఉదంతం  ఒకటి వెలుగులోకి వచ్చింది.ఎయిర్ ఇండియా విమానంలో్  హైదరాబాద్ కు చెందిన రాహుల్ రఘువంశీ  హైదరాబాద్ నుంచి ఢిల్లీ మీదుగా షికాగో  వెళుతుండగా ఈ చేదు అనుభవం ఎదురైంది.  

విమాన సిబ్బంది ఆఫర్ చేసిన  భోజనంలో   బొద్దింక కనిపించడంతో  ఆందోళన చెందిన  రాహుల్ ఈ విషయాన్ని ఫోటోతో సహా ట్విట్టర్ లో షేర్ చేశారు.  ఏఐ127 విమానంలో.. వెజిటిరేయన్  ఫూడ్ లో  సిబ్బంది  బొద్దింకలను వడ్డిస్తున్నారంటూ  వాపోయారు.  అయితే  ఈ సంఘటనపై  తీవ్రంగా స్పందించిన  ఎయిర్ఇండియా ట్విట్టర్ ద్వారా క్షమాపణలు చెప్పింది.  ఎయిర్ ఇండియా తాము ఈ విషయాన్ని అస్సలు సహించమని, వెంటనే  సంబంధిత చర్యల్ని తీసుకుంటామని ట్వీట్ చేసింది.  సంబంధిత  క్యాటరర్ కి నోటీసులు పంపామని  ఎయిర్ ఇండియా కార్పొరేట్ కమ్యూనికేషన్స్,  సీనియర్ మేనేజర్ ధనంజయ్ కుమార్ తెలిపారు.  దర్యాప్తు జరుగుతోందని  చెప్పారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement