విమానంలో 'కాక్రోచ్ మీల్'
న్యూఢిల్లీ: ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా మరోసారి చిక్కుల్లో పడింది. ఓ ప్రయాణికుడికి అందించిన భోజనంలో బొద్దింక దర్శనమిచ్చిన ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది.ఎయిర్ ఇండియా విమానంలో్ హైదరాబాద్ కు చెందిన రాహుల్ రఘువంశీ హైదరాబాద్ నుంచి ఢిల్లీ మీదుగా షికాగో వెళుతుండగా ఈ చేదు అనుభవం ఎదురైంది.
విమాన సిబ్బంది ఆఫర్ చేసిన భోజనంలో బొద్దింక కనిపించడంతో ఆందోళన చెందిన రాహుల్ ఈ విషయాన్ని ఫోటోతో సహా ట్విట్టర్ లో షేర్ చేశారు. ఏఐ127 విమానంలో.. వెజిటిరేయన్ ఫూడ్ లో సిబ్బంది బొద్దింకలను వడ్డిస్తున్నారంటూ వాపోయారు. అయితే ఈ సంఘటనపై తీవ్రంగా స్పందించిన ఎయిర్ఇండియా ట్విట్టర్ ద్వారా క్షమాపణలు చెప్పింది. ఎయిర్ ఇండియా తాము ఈ విషయాన్ని అస్సలు సహించమని, వెంటనే సంబంధిత చర్యల్ని తీసుకుంటామని ట్వీట్ చేసింది. సంబంధిత క్యాటరర్ కి నోటీసులు పంపామని ఎయిర్ ఇండియా కార్పొరేట్ కమ్యూనికేషన్స్, సీనియర్ మేనేజర్ ధనంజయ్ కుమార్ తెలిపారు. దర్యాప్తు జరుగుతోందని చెప్పారు.
.@airindiain now serves cockroach for vegetarian meals on AI127 #sicktomystomach #traumatized #cockroachinfood pic.twitter.com/SX1DR2Cufy
— Rahul Raghuvanshi (@BostonNewsHound) November 16, 2016