పేమెంట్ బ్యాంకే బెటరు గురూ!
పేమెంట్ బ్యాంకే బెటరు గురూ!
Published Sat, Dec 24 2016 12:03 PM | Last Updated on Fri, Aug 17 2018 6:18 PM
నగదు రహిత లావాదేవీల నేపథ్యంలో వివిధ రకాల వాలెట్లు బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. అయితే, వివిధ రకాల వాలెట్లు వినియోగదారులకు అందిస్తున్న సౌకర్యాల కంటే పేమెంట్ బ్యాంకులు అందిస్తున్న సౌకర్యాలు బాగున్నాయి. భారత ప్రభుత్వం పేమెంట్ బ్యాంకులకు అనుమతి ఇచ్చిన తర్వాత ఎయిర్ టెల్, రిలయన్స్ లు పేమెంట్ బ్యాంకులను చేపట్టాయి. వీటిలో ఎయిర్ టెల్ తొలుత రాజస్ధాన్ లో ఎయిర్ టెల్ పేమెంట్ బ్యాంకులను ప్రారంభించగా.. త్వరలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో సర్వీసులను విస్తృతపరచేందుకు ప్రణాళికలు రచిస్తోంది.
మిగిలిన వాలెట్ సర్వీసులతో పోల్చితే ఎయిర్ టెల్ పేమెంట్ బ్యాంకు ద్వారా వినియోగదారుడికి పలు రకాల లాభాలు ఉన్నాయి. అవేంటో ఓ సారి చూద్దాం. బిల్లుల చెల్లింపులు, సినిమా టికెట్లు, ఈవెంట్ల బుకింగులు, రీచార్జ్ లు అన్నీ పేమెంట్ బ్యాంకుల ద్వారా నిర్వహించుకోవచ్చు. ఈ సర్వీసులన్నింటినీ కొన్ని సంస్ధలు అందిస్తున్న వాలెట్ సర్వీసులతో చేసుకున్నా పేమెంట్స్ బ్యాంకు ఇచ్చే సదుపాయాలు వాటికి రావు.
పేమెంట్ బ్యాంకు లాభాలు:
1. ఎయిర్ టెల్ పేమెంట్ బ్యాంకులో నగదు డిపాజిట్ చేసినా, విత్ డ్రా చేసినా ప్రతి రూపాయి లావాదేవీకి ఒక ఉచిత ఎయిర్ టెల్ టూ ఎయిర్ టెల్ టాక్ టైం మీ మొబైల్ నంబర్ కు ఇస్తారు. కేవలం డిపాజిట్లు, విత్ డ్రాల మీదే కాకుండా బిల్లుల చెల్లింపులు, సినిమా టికెట్లు ఇలా ఎలాంటి సర్వీసులు ఉపయోగించిన ప్రతి రూపాయికి ఒక ఉచిత ఎయిర్ టెల్ టూ ఎయిర్ టెల్ టాక్ టైం వస్తుంది.
2. ఎయిర్ టెల్ పేమెంట్ బ్యాంకులో మీరు డిపాజిట్ చేసిన మొత్తానికి వడ్డీ 7.25 శాతం కూడా వస్తుంది. ఏ ఇతర వాలెట్ సంస్ధలు ఇలాంటి సదుపాయాన్ని ఇవ్వడం లేదు.
3. ఎయిర్ టెల్ పేమెంట్ బ్యాంకులో సాధారణ వినియోగదారుడు కూడా నెలకు రూ.లక్ష వరకూ లావాదేవీలు చేసుకోవచ్చు.
4. కేవలం వడ్డీ, ఉచిత టాక్ టైంతో సరిపెట్టుకోకుండా ప్రతి వినియోగదారుడికి రూ.లక్ష ప్రమాద బీమా సౌకర్యాన్ని ఎయిర్ టెల్ పేమెంట్ బ్యాంకు కల్పిస్తోంది.
Advertisement