సరికొత్త మైలురాయి చేరుకున్న ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్..! | India Post Payments Bank Customer Base Crosses 5 Crore Mark | Sakshi
Sakshi News home page

సరికొత్త మైలురాయి చేరుకున్న ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్..!

Published Wed, Jan 19 2022 6:27 PM | Last Updated on Wed, Jan 19 2022 6:28 PM

India Post Payments Bank Customer Base Crosses 5 Crore Mark - Sakshi

న్యూఢిల్లీ: ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ కొత్త మైలురాయిని అధిగమించింది. 5 కోట్ల మంది కస్టమర్ల స్థాయిని చేరుకున్నట్టు సంస్థ మంగళవారం ప్రకటించింది. యూపీఐ బెనిఫీషియరీ బ్యాంక్స్‌లో పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్, ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ తర్వాత మూడవ స్థానంలో ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ నిలిచింది. 

‘కార్యకలాపాలు ప్రారంభించిన మూడేళ్లలోనే ఈ ఘనతను సొంతం చేసుకున్నాం. 1.36 లక్షల పోస్ట్‌ ఆఫీస్‌లను ఆధునీకరించడం ద్వారా పూర్తిగా డిజిటల్‌ విధానంలో 5 కోట్ల ఖాతాలు తెరిచాం. 1.20 లక్షల పోస్ట్‌ ఆఫీస్‌లు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. వినియోగదార్లలో 48 శాతం మహిళలు ఉన్నారు. 98 శాతం ఖాతాలు మహిళల ఇంటి వద్దే తెరిచాం. మొత్తం ఖాతాల్లో 41 శాతం 18-35 ఏళ్ల వయసున్న కస్టమర్లు ఉన్నారు’ అని సంస్థ ఎండీ, సీఈవో జె.వెంకట్రాము ఈ సందర్భంగా తెలిపారు. పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ 6.4 కోట్లు, ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌నకు 6 కోట్ల మంది వినియోగదార్లు ఉన్నారు. 

(చదవండి: బిగ్ బజార్ బంపర్ ఆఫర్.. వాటి మీద 50 శాతం డిస్కౌంట్..!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement