IPPB
-
రూ.399 కడితే.. ₹10 లక్షల బీమా: ఇదిగో ఫుల్ డీటెయిల్స్
జీవితంలో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో.. ఎవ్వరూ ఊహించలేరు. కానీ ఊహకందని ప్రమాదం జరిగినప్పుడు ఆర్థికంగా కొంత నిలదొక్కుకోవడానికి ఇన్సూరెన్స్ అనేది చాలా ముఖ్యం. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు కార్పొరేట్ సంస్థలు, ఐపీపీబీ (ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్).. 'గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్' ప్లాన్స్ ప్రవేశపెట్టింది. వీటికి సంబందించిన పూర్తి వివరాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ఐపీపీబీ రూ.399 ప్లాన్ఈ ప్లాన్ కింది మీరు ఏడాదికి రూ.399 చెల్లిస్తే.. ప్రమాదవశాత్తు మరణించినా లేదా వైకల్యం ఏర్పడినా, ప్రమాదంలో కాళ్ళు, చేతులు పనిచేయకుండా పోయినా.. రూ.10 లక్షల భీమా సౌకర్యం పొందవచ్చు.ఈ పాలసీ తీసుకున్న వ్యక్తి ప్రమాదం వల్ల హాస్పిటల్లో చేరితే యాక్సిడెంటల్ మెడికల్ ఖర్చులు కోసం రూ.60,000 లేదా ప్రమాదవశాత్తు వైద్య ఖర్చుల కోసం రూ.30,000 అందిస్తారు. అంతే కాకుండా హాస్పిటల్లో 10 రోజులు ఉంటే రోజుకు రూ.1000 చొప్పున చెల్లిస్తారు. ఈ పాలసీ తీసుకున్న వ్యక్తికి కుటుంబ ప్రయోజనం కింద రవాణా ఖర్చుల కోసం రూ.25,000 లభిస్తుంది. ఒకవేళ పాలసీదారు మరణిస్తే అంత్యక్రియల కోసం మరో రూ.5,000 అందుతాయి. ఈ ప్లాన్ కింద ఎడ్యుకేషన్‌కు సంబంధించిన ప్రయోజనాలు లభిస్తాయి.ఐపీపీబీ రూ.299 ప్లాన్ఈ ప్లాన్ ఎంచుకునే పాలసీదారు సంవత్సరానికి రూ.299 చెల్లించి.. 10 లక్షల రూపాయల ప్రమాద భీమా పొందవచ్చు. ప్రమాదవశాత్తు మరణించినా లేదా వైకల్యం ఏర్పడినా, ప్రమాదంలో కాళ్ళు, చేతులు పనిచేయకుండా పోయినా.. రూ.10 లక్షల భీమా లభిస్తుంది.ఈ ప్లాన్ ఎంచుకునే పాలసీదారుకు రూ.399 ప్లాన్‌లో లభించే దాదాపు అన్ని ప్రయోజనాలు లభిస్తాయి. కానీ ఎడ్యుకేషన్ బెనిఫీట్స్.. హాస్పిటల్లో 10 రోజులు ఉంటే రోజుకు రూ.1,000 చొప్పున లభించే ప్రయోజనాలు అందవు.ఇదీ చదవండి: బ్యాంకులకు ఆరు రోజులు వరుస సెలవులుదీనికి అర్హులు ఎవరంటే..18 నుంచి 65 సంవత్సరాల వయసున్న ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు.గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ దేనిని కవర్ చేయదంటే..ఆత్మహత్య చేసుకున్నా, మిలటరీ సర్విసెస్‌లో ఉంటూ మరణించినా, యుద్ధంలో ప్రాణాలు కోల్పోయినా, చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడి కన్నుమూసినా, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, ఎయిడ్స్ వంటి వాటివల్ల చనిపోయినా.. ప్రమాదకరమైన క్రీడల్లో మృత్యువాత పడినా ఈ ఇన్సూరెన్స్ లభించదు. -
ఐపీపీబీ ఖాతాదారులకు బజాజ్ అలియాంజ్ బీమా
ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (ఐపీపీబీ) ఖాతాదారులకు బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్ గ్రూప్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ప్రారంభించింది. ఇది ఇండియాపోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాదారులకు ప్రత్యేకం. చిన్న మొత్తంలో ప్రీమియం చెల్లించడం ద్వారా బీమా రక్షణ పొందొచ్చని బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ తెలిపింది. పాలసీదారు మరణించిన సందర్భంలో తక్షణమే పరిహారంతోపాటు, 5, 7, 10 ఏళ్లపాటు కుటుంబ అవసరాలకు నెలవారీ చెల్లించే సదుపాయాలు ఇందులో ఉన్నట్టు పేర్కొంది. -
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త!
న్యూఢిల్లీ: విస్తృతమైన పోస్టాఫీసుల నెట్వర్క్ ఉన్న ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు (ఐపీపీబీ) .. పూర్తి స్థాయి బ్యాంకుగా మారే యోచనలో ఉంది. తద్వారా మరింత మందికి ఆర్థిక సేవలు అందించవచ్చని భావిస్తోంది. పరిశ్రమల సమాఖ్య సీఐఐ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఐపీపీబీ ఎండీ, సీఈవో జె. వెంకట్రాము ఈ విషయాలు తెలిపారు. 2018లో ఐపీపీబీ కార్యకలాపాలు ప్రారంభించినప్పుడు 80 శాతం లావాదేవీలు నగదు రూపంలోనే జరిగేవని, ప్రస్తుతం టెక్నాలజీ వినియోగంతో ఇది 20 శాతానికి తగ్గిందని ఆయన పేర్కొన్నారు. తమకున్న నెట్‌వర్క్‌తో మారు మూల ప్రాంతాలకు కూడా చేరడం సాధ్యపడుతుందని, పూర్తి స్థాయి బ్యాంకింగ్ లైసెన్స్ లభిస్తే భారీ లక్ష్యాల సాధనకు తోడ్పడగలదని వెంకట్రాము చెప్పారు. ప్రస్తుతం పేమెంట్ బ్యాంకు హోదాలో ఐపీపీబీ.. డిపాజిట్లు, రెమిటెన్సులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి సర్వీసులు అందించగలదు. కానీ రుణాలు ఇవ్వడానికి, క్రెడిట్ కార్డులు జారీ చేయడానికి వీలు లేదు. మరోవైపు, కస్టమర్ల ఫిర్యాదుల పరిష్కారం కోసం సరైన వ్యవస్థను రూపొందించాల్సిన అవసరం ఉందని పరిశ్రమలు, అంతర్గత వాణిజ్యం ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) కార్యదర్శి అనురాగ్ జైన్ తెలిపారు. -
March 1: నేటి నుంచి అమలులోకి వచ్చే కొత్త రూల్స్ ఇవే!
చూస్తుండంగానే రోజులు చకచక గడిచిపోతున్నాయి. ఈ కొత్త ఏడాదిలో అప్పుడే 3 నెలలోకి ఎంట్రీ ఇచ్చాం. కొత్త నెలతోపాటు దేశంలో కొత్త కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయి. దీంతో చాలా మందిపై ప్రభావం పడే అవకాశముంది. అందువల్ల వల్ల ఈరోజు నుంచే మారే అంశాలు ఏంటివో ఇప్పుడు తెలుసుకుందాం. అమూల్ సంస్థ తన లీటర్ పాల ప్యాకెట్ ధరలను రూ.2 పెంచుతున్నట్లు వెల్లడించింది. పెంచిన ధరలను మార్చి 1 నుంచి అమలలోకి రానున్నాయి. అమూల్ సంస్థ గోల్డ్, తాజా, శక్తి, టీ స్పెషల్ లాంటి వేరియంట్లలో పాల ప్యాకెట్లను ఉత్పత్తి చేస్తోంది. అమూల్ గోల్డ్ అరలీటర్ ప్యాకెట్ ప్రస్తుతం రూ.28గా ఉండగా మార్చి 1 నుంచి రూ.30కి పెరగనుంది. చమురు మార్కెటింగ్ కంపెనీలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచాయి. 19 కేజీల సిలిండర్ ధరపై రూ.105లు, 5 కేజీల సిలిండర్‌పై రూ.27లు పెంచుతున్నట్లు ప్రకటించాయి. దీంతో దేశ రాజధానిలో కమర్షియల్ సిలిండర్ ధర రెండు వేలు దాటింది. 19 కేజీ సిలిండర్ ధర రూ. 2,012కి చేరగా 5 కేజీల సిలిండర్ ధర రూ. 569గా ఉంది. వివిధ నగరాల వారీగా 19 కేజీల సిలిండర్ల ధరను పరిశీలిస్తే చెన్నైలో రూ. 2185, ముంబై రూ.1962 , కోల్‌కతా రూ.2089లు, హైదరాబాద్‌లో రూ.1904లుగా ఉన్నాయి అంతర్జాతీయ చమురు ధరలు ఏడేళ్ల గరిష్టానికి పెరగడంతో జెట్ ఇంధన ధరలు దేశవ్యాప్తంగా ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి 3.3 శాతం పెరిగాయి. ప్రపంచ చమురు ధరలు పెరిగిన తర్వాత జెట్ ఇంధనం లేదా ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్(ఏటిఎఫ్) ధర పెరగడం ఇది ఐదోసారి. లక్ష్మీ విలాస్ బ్యాంక్ డిజిటల్'గా డబ్బును బదిలీ చేయడానికి ఉపయోగించే ఐఎఫ్ఎస్సీ కోడ్స్ మార్చి 1 నుంచి మారనున్నాయి. 2020 నవంబర్ నెలలో డీబీఎస్ బ్యాంక్ ఇండియా లిమిటెడ్(డీబీఎల్) విలీనం కావడంతో ఆ బ్యాంకుకు చెందిన ఐఎఫ్ఎస్సీ కోడ్స్ ఫిబ్రవరి 28, 2022 వరకు మాత్రమే చెల్లుతాయని డీబీఎస్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. చాలా రాష్ట్రాలలో కోవిడ్ 19 మహమ్మారి పెరగడంతో, సీనియర్ సిటిజన్స్ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని గతంలో కేంద్ర ప్రభుత్వం లైఫ్ సర్టిఫికేట్ డెడ్ లైన్‌ను ఫిబ్రవరి 28, 2022 వరకు పొడిగించింది. దీంతో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లందరూ లైఫ్ సర్టిఫికేట్‌ను 28.02.2022 వరకు సమర్పించవచ్చు. ఒకవేళ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించకపోతే మార్చి 1 నుంచి పెన్షన్ తీసుకునే సమయంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఇండియా పోస్టు పేమెంట్స్ బ్యాంకు(ఐపీపీబీ) డిజిటల్ సేవింగ్స్ అకౌంట్ క్లోజర్ ఛార్జీలను ప్రవేశపెట్టింది. మార్చి 5, 2022 నుంచి రూ.150 ప్లస్ జీఎస్టీ ఛార్జీలను విధించనున్నట్టు ఐపీపీబీ తెలిపింది. అయితే ఈ ఛార్జీలు కేవలం కేవైసీ అప్డేషన్ లేకుండా ఏడాది తర్వాత క్లోజ్ అయ్యే డిజిటల్ సేవింగ్స్ అకౌంట్లకు మాత్రమేనని తెలిపింది. మిగతా అకౌంట్ల మూసివేతకు ఈ ఛార్జీలు వర్తించవని పేర్కొంది. ఈ కొత్త నిబంధన మార్చి 5 2022 నుంచి అమల్లోకి వస్తుంది. చక్రవాహనాల పెండింగ్ చలాన్లకు 75 శాతం రాయితీ ఇస్తున్నట్లు ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ స్పష్టం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఆన్లైన్ ద్వారా పెండింగ్ చలాన్లను చెల్లించవచ్చని, ఈ చలాన్ల రాయితీ మార్చి 1 నుంచి 31 వరకు అమలులో ఉంటుందని తెలిపారు. (చదవండి: Hero Electric Eddy: రూ.72 వేలకే హీరో ఎలక్ట్రిక్ స్కూటర్.. విడుదల అప్పుడే!) -
పోస్ట్ ఆఫీస్ పొదుపు ఖాతాదారులకు షాక్..!
ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్(ఐపీపీబీ) తన పొదుపు ఖాతాదారులకు భారీ షాక్ ఇచ్చింది. పోస్ట్ ఆఫీస్ పొదుపు ఖాతాలలో జమ చేసే నగదుపై చెల్లించే ప్రస్తుత వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. కొత్త వడ్డీ రేట్లు ఫిబ్రవరి 1, 2022 నుంచి అమల్లోకి రానున్నాయి. ఐపీపీబీ వెబ్సైట్లో తెలిపిన వివరాల ప్రకారం.. రూ.లక్ష వరకు డీపాజిట్ చేసే నగదు మీద 2.25% వడ్డీ రేటు లభిస్తుంది. లక్ష రూపాయలు నుంచి రూ.2 లక్షల వరకు డీపాజిట్ చేసే నగదు మీద 2.50% వడ్డీ రేటు లభించనుంది. గతంలో రూ.లక్ష వరకు డీపాజిట్ చేసే నగదు మీద 2.50% వడ్డీ రేటు లభిస్తే, లక్ష రూపాయలు నుంచి రూ.2 లక్షల వరకు డీపాజిట్ చేసే నగదు మీద 2.75% వడ్డీ రేటు లభించేది. రోజు వారి బ్యాలన్స్ మీద కొత్త వడ్డీ రేటు లెక్కిస్తారు. రోజువారీ ఈఓడి బ్యాలెన్స్ మీద లెక్కించిన వడ్డీని 3 నెలలకు ఒకసారి ఖాతాలో జమ చేయనున్నారు. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ గత నెలలో 5 కోట్ల మంది కస్టమర్లకు చేరుకొని సరికొత్త మైలురాయిని అధిగమించింది. యూపీఐ బెనిఫీషియరీ బ్యాంక్స్‌లో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ తర్వాత మూడవ స్థానంలో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ నిలిచింది. (చదవండి: ప్రత్యక్ష పన్ను వసూళ్లు.. అదుర్స్!) -
సరికొత్త మైలురాయి చేరుకున్న ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్..!
న్యూఢిల్లీ: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ కొత్త మైలురాయిని అధిగమించింది. 5 కోట్ల మంది కస్టమర్ల స్థాయిని చేరుకున్నట్టు సంస్థ మంగళవారం ప్రకటించింది. యూపీఐ బెనిఫీషియరీ బ్యాంక్స్‌లో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ తర్వాత మూడవ స్థానంలో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ నిలిచింది. ‘కార్యకలాపాలు ప్రారంభించిన మూడేళ్లలోనే ఈ ఘనతను సొంతం చేసుకున్నాం. 1.36 లక్షల పోస్ట్ ఆఫీస్‌లను ఆధునీకరించడం ద్వారా పూర్తిగా డిజిటల్ విధానంలో 5 కోట్ల ఖాతాలు తెరిచాం. 1.20 లక్షల పోస్ట్ ఆఫీస్‌లు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. వినియోగదార్లలో 48 శాతం మహిళలు ఉన్నారు. 98 శాతం ఖాతాలు మహిళల ఇంటి వద్దే తెరిచాం. మొత్తం ఖాతాల్లో 41 శాతం 18-35 ఏళ్ల వయసున్న కస్టమర్లు ఉన్నారు’ అని సంస్థ ఎండీ, సీఈవో జె.వెంకట్రాము ఈ సందర్భంగా తెలిపారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ 6.4 కోట్లు, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్‌నకు 6 కోట్ల మంది వినియోగదార్లు ఉన్నారు. (చదవండి: బిగ్ బజార్ బంపర్ ఆఫర్.. వాటి మీద 50 శాతం డిస్కౌంట్..!) -
జనవరి 1 నుంచి అమలులోకి వచ్చే కొత్త రూల్స్ ఇవే..!
New Rules From 1st January 2022: అమ్మో ఒకటో తారీఖు..! ఒకటో తారీఖు వచ్చిదంటే చాలు సామాన్యుడి జీవితంతో పాటు దేశంలో కూడా అనేక కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. కొత్త కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయి. ఈ నిబంధనలు వల్ల కొన్ని సార్లు సామాన్యుడి జేబుకు చిల్లు పడుతుంది. ప్రతి నెల మాదిరిగానే రాబోయే కొత్త ఏడాది జనవరి 1 నుంచి కూడా పలు కీలక నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర, ఈపీఎఫ్ ఈ-నామినేషన్, కొత్త జీఎస్టీ రూల్స్, ఏటీఎమ్ ఛార్జీలు వంటివి జనవరి నెలలో మార్పులు చోటు చేసుకొనున్నాయి. వచ్చే నెల 1 నుంచి అమలులోకి రాబోయే కొత్త రూల్స్ గురుంచి ఇప్పుడు తెలుసుకుందాం.. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్: 2022 జనవరి 1 నుంచి క్యాష్ డిపాజిట్, క్యాష్ విత్‌డ్రాయల్ లావాదేవీలపై ఐపీపీబీ ఛార్జీలు వసూలు చేయనుంది. బేసిక్ సేవింగ్స్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్లకు ఈ ఛార్జీలు వేర్వేరుగా ఉంటాయి. బ్యాంకు ఖాతాను బట్టి ఉచిత లిమిట్ ఉంటుంది. ఫ్రీ లిమిట్ దాటిన తర్వాత క్యాష్ విత్‌డ్రాయల్, క్యాష్ డిపాజిట్లపై 0.50 శాతం లేదా కనీసం రూ.25 ప్రతీ లావాదేవీకి చెల్లించాలి. ఏటీఎం ఛార్జీలు: క్యాష్, నాన్-క్యాష్ ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్ల(ఏటీఎం) ఉపయోగానికిగానూ కస్టమర్ల నుంచి అధిక వసూళ్లకు ఆర్బీఐ గతంలోనే బ్యాంకులకు అనుమతి ఇచ్చింది. ఇదివరకు ఇది 20రూ.గా ఉండగా, 21రూ.కి పెంచుకునేందుకు ఆర్బీఐ బ్యాంకులకు అనుమతి ఇచ్చింది. సొంత బ్యాంకుల్లో ఐదు ట్రాన్జాక్షన్స్, ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో అయితే ఐదు(నాన్-మెట్రో నగరాల్లో మాత్రమే), మెట్రో నగరాల్లో మూడు విత్‌డ్రాలకు అనుమతి ఉంది. ఇవి దాటితే ఒక్కో ట్రాన్జాక్షన్కు రూ.21 చొప్పున వసూలు చేస్తాయి బ్యాంకులు. ఈ కొత్త ఛార్జీలు జనవరి 1 నుంచి అమలులోకి వస్తాయి. (చదవండి: కేంద్రం కీలక ఆదేశాలు! కాల్ రికార్డ్స్, ఇంటర్నెట్ యూజర్ల వివరాలన్నీ..) ఈపీఎఫ్ ఈ-నామినేషన్: ఈపీఎఫ్ ఖాతాదారులు డిసెంబర్ 31లోపు తప్పనిసరిగా మీ పీఎఫ్ ఖాతాకు నామిని తప్పనిసరిగా లింక్ చేయాలి. లేకపోతే మీరు ఈపీఎఫ్, ఈపీస్, ఈడీఎల్ఐకు సంబంధించిన ప్రయోజనాలను జనవరి 1 నుంచి పొందలేరు. ఎల్పీజీ గ్యాస్ ధర: ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెల 1, 15వ తేదీ నాడు గ్యాస్ సిలిండర్ల ధరల్ని సవరిస్తాయి. అలాగే, జనవరి 1న కూడా గ్యాస్ సిలిండర్ల ధరల్ని సవరించనున్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్: పన్ను చెల్లింపుదారులు 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేది 2021 డిసెంబర్ 31 ఫైల్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే, 2022 జనవరి 1 నుంచి 2020-21 ఐటీఆర్ ఫైల్ చేస్తే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. జీఎస్టీ రూల్స్: పన్ను చెల్లింపు విషయంలో మోసపూరిత కార్యకలాపాలను అరికట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ చట్టానికి పదికి పైగా సవరణలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సవరణలన్నీ కొత్త సంవత్సరం జనవరి 1 నుంచి అమలులోకి రానున్నాయి. హీరో మోటోకార్ప్: వచ్చే ఏడాది జనవరి 4 నుంచి హీరో మోటోకార్ప్‌కు చెందిన మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల ఎక్స్-షోరూమ్ ధరలను పెంచే యోచనలో కంపెనీ ఉన్నట్లు తెలుస్తోంది. ధరల పెంపుపై కంపెనీ గురువారం రోజున స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. క్రమంగా పెరుగుతున్న ముడిసరుకుల ధరల ప్రభావాన్ని పాక్షికంగా ఆఫ్సెట్ చేయడానికి ధరల పెంపు అనివార్యమని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కార్ల ధరలు: వచ్చే ఏడాది 2022 జనవరి నుంచి కార్ల ధరలను పెంచుతూ చాలా వరకు దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ కొత్త ధరలు అనేవి కంపెనీ బట్టి మారుతున్నాయి. (చదవండి: అమెజాన్: ప్లీజ్ ఆత్మహత్య చేసుకోవద్దు..మీ హెచ్ఆర్ను కలవండి!) -
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాదారులకు షాక్..!
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాదారులకు చేదువార్త. ఇప్పటి వరకు ఉచితంగా అందిస్తున్న విత్ డ్రా, డిపాజిట్ సేవలకు జనవరి 1, 2022 నుంచి ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకు అందించే ఉచిత లావాదేవీల పరిమితిని అధిగమించిన తర్వాత ప్రత్యేకమైన ఛార్జీలు వసూలు చేయనున్నట్లు ఐపీపీబీ తెలిపింది. బేసిక్ సేవింగ్స్ ఖాతాదారులకు ప్రతి నెల ఉచితంగా 4 లావాదేవీలు చేయవచ్చు, ఆ తర్వాత ప్రతి విత్ డ్రా లావాదేవీకి దాని విలువలో 0.50%(కనీసం రూ.25) ఛార్జీల రూపంలో వసూలు చేయనుంది. ఈ ఖాతాదారులకు క్యాష్ డిపాజిట్ చేసుకోవడం ఉచితం. ఎలాంటి ఛార్జీలు ఉండవు. బేసిక్ సేవింగ్స్ ఖాతాదారులు కాకుండా ఇతర పొదుపు ఖాతాదారులు, కరెంట్ ఖాతాదారులు నెలకు రూ.25వేల వరకు విత్‌డ్రా చేసుకునేందుకు ఎలాంటి ఛార్జీలు ఉండవు. ఆ తర్వాత విత్‌డ్రా చేసుకునే మొత్తంలో 0.50 శాతం (కనీసం రూ.25) వరకు చెల్లించుకోవాల్సి ఉంటుంది. అలాగే, ఈ ఖాతాదారులు రూ.10వేల వరకు క్యాష్ డిపాజిట్ చేసుకోవచ్చు. ఎలాంటి ఛార్జీలు ఉండవు. కానీ రూ.10వేల మొత్తానికి పైగా డిపాజిట్ చేసుకుంటే 0.50 శాతం లేదా రూ.25 ప్రతి లావాదేవీకి ఛార్జీలు ఉంటాయి. ఈ నిబంధనలు 2022 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. లేకుంటే ఎక్కువ విత్‌డ్రాలు చేసుకుంటే అదనంగా ఛార్జీల బదులు తప్పనిసరి ఉంటుంది. గతంలో కూడా ఉచితంగా అందిస్తున్న డోర్ స్టెప్ సేవలకు ఛార్జీలు వసూలు చేస్తుంది. 01 ఆగస్టు 2021 నుంచి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలకు ఛార్జీలు వసూలు చేస్తూ వచ్చింది. (చదవండి: మోదీ ప్రభుత్వం భారీ స్కెచ్..! వచ్చే మూడేళ్లలో..!) -
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ యూజర్లకు గుడ్‌న్యూస్!
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్(ఐపీపీబీ) వినియోగదారులకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ శుభవార్త తెలిపింది. ఐపీపీబీ బ్యాంకుకు చెందిన వినియోగదారులకు గృహ రుణాలు అందించేందుకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఒప్పందం చేసుకున్నట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు హెచ్డీఎఫ్సీ గృహ రుణాలను అందించడానికి ఇండియా పోస్ట్ తన దేశవ్యాప్తంగా 650 బ్రాంచ్‌లతోపాటు 1,36,000 పైగా బ్యాంకింగ్ యాక్సెస్ పాయింట్ల నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోనుందని కంపెనీ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం ఐపీపీబీ, హెచ్డీఎఫ్సీ మధ్య అవగాహన ఒప్పందం(ఎంఒయు) చేసుకున్నాయి. "ఈ భాగస్వామ్యం ఐపీపీబీ వినియోగదారులకు హెచ్డీఎఫ్సీ గృహ రుణాలను సులభంగా అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా బ్యాంకు లేని ప్రాంతాల్లోని చాలా మందికి ఫైనాన్స్ అందుబాటులో లేదు. కొత్త ఇల్లు కట్టుకోవాలనే వారి కలను నెరవేర్చడానికి ఐపీపీబీ దాదాపు 190,000 బ్యాంకింగ్ సర్వీస్ప్రొవైడర్ల(పోస్ట్ మెన్, గ్రామీణ్ డాక్ సేవక్) ద్వారా గృహ రుణాలను అందిస్తుంది" అని తెలిపింది. ఈ ఎంఒయు ప్రకారం అన్ని గృహ రుణాలకు సంబంధించిన క్రెడిట్, సాంకేతిక, చట్టపరమైన విషయాలు, ప్రాసెసింగ్, పంపిణీని హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ నిర్వహిస్తుంది. అయితే ఐపీపీబీ కేవలం రుణాన్ని అందించడంలో బ్యాంకుకు, వినియోగదారుల మధ్య వారదులగా పని చేస్తారని వెల్లడించింది. (చదవండి: క్రోమాతో జట్టుకట్టిన ఇన్నోవిటీ..!) -
చౌక వడ్డీకే ఐపీపీబీ గృహ రుణాలు.. ఎంతంటే?
డిపార్ట్ మెంట్ ఆఫ్ పోస్ట్స్, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్, ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్(ఎల్ఐసీహెచ్ఎఫ్ఎల్)తో చేసుకున్న ఒప్పందంలో భాగంగా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్(ఐపీపీబీ) తన 4.5 కోట్ల మంది ఖాతాదారులకు తక్కువ వడ్డీకే గృహ రుణాలను అందించనున్నట్లు ప్రకటించింది. వేతన జీవులకు రూ.50 లక్షల వరకు అందించే గృహ రుణాలపై వడ్డీ రేటు 6.66 శాతం నుంచి ప్రారంభమవుతుంది. ఈ వడ్డీ రేటు రుణగ్రహీత క్రెడిట్ స్కోర్ మీద ఆధారపడి ఉంటుంది అని ఎల్ఐసీహెచ్ఎఫ్ఎల్, ఐపీపీబీ పేర్కొన్నాయి. (చదవండి: దూసుకొస్తున్న కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్స్) దేశ వ్యాప్తంగా 650 బ్రాంచీలు, 136,000కు పైగా బ్యాంకింగ్ యాక్సెస్ పాయింట్లతో విస్తృతమైన నెట్ వర్క్ కలిగి ఉన్నట్లు ఐపీపీబీ తెలిపింది. ఐపీపీబీ, ఎల్ఐసీహెచ్ఎఫ్ఎల్ గృహ రుణాలు పాన్-ఇండియా మొత్తం అందుబాటులో ఉంటాయి. అవగాహనపూర్వక ఒప్పందం(ఎమ్ఒయు)లో భాగంగా.. అన్ని గృహ రుణాల కోసం క్రెడిట్ అండర్ రైటింగ్, ప్రాసెసింగ్ బాధ్యతలు చేపట్టే ఐపీపీబీ చేత ఎల్ఐసీహెచ్ఎఫ్ఎల్ నిర్వహిస్తుంది. ఐపీపీబీ తన ఆన్ గ్రౌండ్ వర్క్ ఫోర్స్ 200,000 పోస్టల్ ఉద్యోగులు(పోస్ట్ మెన్, గ్రామీణ్ డక్ సేవకులు) ద్వారా మైక్రో ఎటిఎమ్, బయోమెట్రిక్ సేవాలు, డోర్ స్టెప్ బ్యాంకింగ్ సర్వీస్ అందిస్తుంది. ఈ విస్తృతమైన నెట్ వర్క్ ద్వారా విభిన్న ప్రజలకు ఎల్ఐసీ హౌసింగ్ రుణాలను చేరడానికి ముఖ్య పాత్ర పోషిస్తుంది అని ఐపీపీబీ తెలిపింది. -
ఆగస్టు 1 నుంచి అమలులోకి వచ్చే కొత్త రూల్స్ ఇవే!
మీరు ఎక్కువగా బ్యాంకు సంబంధిత లావాదేవీలు చేస్తుంటారా? అయితే, మీకు ఒక ముఖ్య గమనిక. ఆగస్టు 1 నుంచి బ్యాంకుకు సంబంధించిన కొత్త నిబందనలు అమలులోకి రానున్నాయి. ఈ కొత్త నిబంధనల వల్ల సామాన్యుల మీద ఎక్కవగా భారం పడనుంది. ఏటీఎం లావాదేవీలు, ఎల్పీజీ ధరలు, వేతనాలు, పెన్షన్లు ఇలా చాలా అంశాలకు సంబంధించి కొత్త మార్పులు ఆగస్టు 1 నుంచి చోటు చేసుకొనున్నాయి. సాధారణంగా ప్రతీ నెల ప్రారంభంలో కొత్త నిబందనలు అమల్లోకి వస్తుంటాయి. మరి ఆగస్టు 1 నుంచి అమలులోకి రానున్న కొత్త రూల్స్ ఏంటీ? అవి మిమ్మల్ని ఏ విధంగా ప్రభావితం చేయనున్నయో? తెలుసుకోండి. వేతనం, ఈఎమ్ఐ చెల్లింపులు: నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్(ఎన్ఏసీహెచ్) నిబంధనలలో ఆర్బీఐ మార్పు చేయడం వల్ల సెలవు రోజుల్లో కూడా విద్యుత్, గ్యాస్, టెలిఫోన్, నీరు, జీతం, మ్యూచువల్ ఫండ్స్, పెన్షన్ సంబంధిత లావాదేవీలు సెలవు రోజుల్లో కూడా జరగనున్నాయి. ఈ కొత్త మార్పులు ఆగస్టు 1, 2021 నుంచి అమల్లోకి వస్తాయి. రియల్ టైమ్ గ్రాస్ సెటిల్ మెంట్(ఆర్ టీజిఎస్), ఎన్ఏసిహెచ్ సేవలు 24ఎక్స్7 అందుబాటులో ఉంటాయని ఆర్బీఐ పేర్కొంది. ఎన్ఏసీహెచ్ అనేది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్ పీసీఐ) చేత నిర్వహించబడుతుంది. ఎటిఎమ్ క్యాష్ విత్ డ్రా: జూన్ నెలలో ఆర్బీఐ తీసుకొచ్చిన మరో ఆర్డర్ ప్రకారం, ఆగస్టు 1 నుంచి ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్స్(ఏటీఎం) చార్జీలు పెరగనున్నాయి. ఏటీఎం కేంద్రాల నిర్వహణ భారంగా మారిందన్న బ్యాంక్ ఆందోళన నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ఇంటర్ చేంజ్ ఫీజ్ ను ₹2 పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. తాజాగా వచ్చే ఆగస్టు 1 నుంచి ఏటీఎం కేంద్రాల్లోనూ ఒక్కో ఆర్ధిక లావాదేవీపై ఇంటర్ ఛేంజ్ ఫీజు రూ.15 నుంచి రూ.17కు, ఆర్ధికేతర లావాదేవీలపై రూ.5 నుంచి రూ.6కు పెరగనుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు చెందిన డెబిట్ కార్డులు 90 కోట్ల వరకు వాడుకలో ఉన్నాయి. ఐపీపీబీ డోర్ స్టెప్ సేవలు ఖరీదు: ఇప్పటి వరకు ఉచితంగా అందిస్తున్న ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ డోర్ స్టెప్ సేవలకు ఇక నుంచి ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. డోర్ స్టెప్ బ్యాంకింగ్ ఛార్జీలను, సేవింగ్స్ అకౌంట్ల వడ్డీ రేట్లను ఐపీపీబీ సవరించింది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ డోర్ స్టెప్ బ్యాంకింగ్ ఛార్జీలు 01 ఆగస్టు 2021 నుంచి వర్తిస్తాయి. ప్రస్తుతం, డోర్ స్టెప్ బ్యాంకింగ్ సంబంధించి ఎలాంటి ఛార్జీలు లేవు. ఇక ఆగస్టు 1, 2021 నుంచి ప్రతి కస్టమర్ ఐపీపీబీ డోర్ స్టెప్ అభ్యర్థనకు బ్యాంకింగ్ ఛార్జీల కింద రూ.20 + జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఒకే కస్టమర్ ఎక్కువ సార్లు అభ్యర్థనలు చేయడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్ సర్వీస్ ఛార్జీలు: భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్ బ్యాంకు ఐసీఐసీఐ తన దేశీయ పొదుపు ఖాతాదారులకు నగదు లావాదేవీలు, ఎటిఎం ఇంటర్ చేంజ్, చెక్ బుక్ ఛార్జీల సవరించిన్నట్లు తెలిపింది. ఈ మార్పులు ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ వెబ్ సైట్ తెలిపింది. అన్ని నగదు లావాదేవీలపై ఛార్జీల సవరణ వర్తిస్తుంది.ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎంలలో నెలకు మొత్తం 4 ఉచిత నగదు లావాదేవీలను అనుమతించింది. ఆ తర్వాత లావాదేవీలకు ఛార్జీలు వర్తిస్తాయి.ప్రతి ఆర్థిక లావాదేవీకి బ్యాంకు ₹20, ఆర్థికేతర లావాదేవీకి ₹8.50 వసూలు చేస్తుంది. ఆగస్టు 1 నుంచి ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారుల హోమ్ బ్రాంచీలో నగదు లావాదేవీ పరిమితి నెలకు రూ.1 లక్ష వరకు ఉచితం. లక్షకు పైగా జరిపే ప్రతి లావాదేవిపై ₹1,000కు ₹5 చెల్లించాలి. కనీస రుసుము ₹150గా ఉంది. ఎల్పీజీ ధరలు: ఎల్పీజీ ధరలను గ్యాస్ ఏజెన్సీలు ప్రతి నెల ఒకటో తేదీన సవరిస్తాయి. జూలై నెల 1 తేదీన ఎల్పీజీ ధరలను రూ. 26 పెంచాయి. మరి ఈ నెల పెరగనున్నాయా? తగ్గనున్నాయా? అనేది ఆగస్టు 1 తేదీన తెలవనుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ): 15సీఏ, 15సీబీ ఫామ్స్ ఎలక్ట్రానిక్ ఫైలింగ్ విషయంలో పలు సడలింపులు ఇచ్చింది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. గతంలో జూలై 15 వరకు ఉన్న చివరి తేదీని ఆగస్ట్ 15కి పొడిగించింది. -
ఇంటి వద్దే ఆధార్ మొబైల్ నెంబరు అప్డేట్ సేవలు
ఆధార్ కార్డుదారులకు శుభవార్త. ఇక నుంచి ఆధార్ హోల్డర్ తన ఇంటి వద్దనే ఆధార్ కార్డులో మొబైల్ నంబర్ ను అప్డేట్ చేసుకోవచ్చు. యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యుఐడీఎఐ) ఆధార్ లో మొబైల్ నంబర్ ను అప్డేట్ చేయడానికి కొత్త సేవలను ప్రారంభించినట్లు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్(ఐపీపీబి) నేడు(జూలై 20) ప్రకటించింది. ఆధార్ హోల్డర్ ఇంటి వద్దే మొబైల్ నంబర్ ను పోస్ట్ మాన్ ఆధార్ లో అప్డేట్ చేయనున్నట్లు ఐపిపీబి ఒక ప్రకటనలో తెలిపింది. దేశ వ్యాప్తంగా ఉన్న 650 ఐపిపీబి బ్రాంచీలు, 1,46,000 పోస్ట్ మెన్ లు, గ్రామీణ్ డాక్ సేవక్ ల ద్వారా ఈ సేవలు అందనున్నాయి. ప్రస్తుతం, ఐపీపీబి మొబైల్ అప్డేట్ సేవలను మాత్రమే అందిస్తోంది. అతి త్వరలోనే ఐపీపీబి నెట్ వర్క్ ద్వారా పిల్లల నమోదు సేవలను ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఆధార్ కార్డులో మొబైల్ నంబర్ అప్డేట్ తో పాటు, పోస్ట్ మెన్ లు, గ్రామీణ్ డాక్ సేవకులు అనేక బ్యాంకింగ్ సేవలను అందిస్తారు. "ఆధార్ సంబంధిత సేవలను సులభతరం చేయడానికి యుఐడీఎఐ తన నిరంతర ప్రయత్నంలో భాగంగా పోస్ట్ మాన్, గ్రామీణ్ డాక్ సేవకుల ద్వారా నివాసితుల ఇంటి వద్దే మొబైల్ అప్డేట్ చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తుంది. అనేక యుఐడీఎఐ ఆన్ లైన్ అప్ డేట్ సదుపాయాలతో పాటు అనేక ప్రభుత్వ సంక్షేమ సేవలను కూడా ఉపయోగించుకోవచ్చు" అని యుఐడీఎఐ సిఈఓ సౌరభ్ గార్గ్ తెలిపారు. Now a resident Aadhaar holder can get his mobile number updated in Aadhaar by the postman at his door step. 👉👉@IPPBOnline launched today a service for updating mobile number in Aadhaar as a Registrar for @UIDAI . pic.twitter.com/TGjiGhHPeG — PIB_INDIA Ministry of Communications (@pib_comm) July 20, 2021 -
ఐపీపీబీ ఖాతాదారులకు షాకింగ్ న్యూస్!
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాదారులకు చేదువార్త. ఇప్పటి వరకు ఉచితంగా అందిస్తున్న డోర్ స్టెప్ సేవలకు ఇక నుంచి ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. డోర్ స్టెప్ బ్యాంకింగ్ ఛార్జీలను, సేవింగ్స్ అకౌంట్ల వడ్డీ రేట్లను ఐపీపీబీ సవరించింది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ డోర్ స్టెప్ బ్యాంకింగ్ ఛార్జీలు 01 ఆగస్టు 2021 నుంచి వర్తిస్తాయి. ప్రస్తుతం, డోర్ స్టెప్ బ్యాంకింగ్ సంబంధించి ఎలాంటి ఛార్జీలు లేవు. ఇక ఆగస్టు 1, 2021 నుంచి ప్రతి కస్టమర్ ఐపీపీబీ డోర్ స్టెప్ అభ్యర్థనకు బ్యాంకింగ్ ఛార్జీల కింద రూ.20 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఛార్జీలతో పాటు పొదుపు ఖాతాల వడ్డీ రేట్లను కూడా ఐపీపీబీ సవరించింది. ఈ కొత్త వడ్డీ రేట్లు జులై 1 నుంచి వర్తిస్తాయి. వడ్డీ రేట్లు ఖాతా బ్యాలెన్స్ పై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం లక్ష రూపాయల వరకు బ్యాలెన్స్ ఉంటే 2.75 శాతం అందిస్తుండగా, ఇక 2021 జూలై 1 నుంచి ఏడాదికి 2.5 శాతం అందించనున్నారు. అలాగే, రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు బ్యాలెన్స్ ఉంటే ఏడాదికి 2.75 శాతం వడ్డీ ఖాతాదారులకు లభిస్తుంది. పోస్టాఫీస్ ఖాతాదారులు వారి బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం, మనీ ట్రాన్స్ఫర్ సర్వీసుల కోసం, ఇతర ఆర్థిక సేవలను ఇప్పుడు ఐపీపీబీ యాప్ ద్వారానే పొందవచ్చు. ఈ సేవల కోసం పోస్టాఫీస్ బ్రాంచుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. -
ఐపీపీబి ద్వారా పోస్టాఫీస్‌లో ఖాతా తెరవండి
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఎప్పటికపుడు కొత్త ఫీచర్స్ తీసుకొస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. గతంలో కేవలం ఉత్తరాల పంపిణీకి మాత్రమే పరిమితమైన పోస్ట్ ఆఫీస్ కొత్తగా బ్యాంకింగ్ సేవలను తీసుకొచ్చినప్పటి నుంచి తన యూజర్ల సంఖ్యను పెంచుకుంటూ పోతోంది. తాజాగా ఇండియన్ పోస్టల్ బ్యాంకు మరో కొత్త సాంకేతికతను కొత్త యూజర్లకు అందుబాటులోకి తీసుకొనివచ్చింది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్(ఐపీపీబి) తన మొబైల్ అప్లికేషన్ ద్వారా డిజిటల్ పొదుపు ఖాతాలను తెరిచే సౌకర్యాన్ని కొత్త యూజర్లకు అందిస్తుంది. గతంలో పోస్టాఫీస్‌లో ఖాతా తెరవడానికి కూడా ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం వచ్చేది. ఇప్పుడు ఎక్కడికి వెళ్లకుండానే ఐపీపీబి యాప్ ద్వారానే ఇంట్లో నుంచే ఖాతా తెరవవచ్చు. అలాగే ఈ యాప్ ద్వారా బ్యాలెన్స్ చెకింగ్, డబ్బులను ట్రాన్స్ఫర్ చేసుకోవడంతో పాటు ఇతర లావాదేవీలను పూర్తి చేసుకోవచ్చు. ఐపీపీబిలో పోస్టాఫీస్ ఖాతా తెరిచే విధానం: 1) దరఖాస్తుదారుడు 18 ఏళ్లు నిండిన భారతీయ పౌరుడు అయి ఉండాలి. 2) మీ మొబైల్ ఫోన్లోని ఐపిపిబి మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్‌కు వెళ్లి 'ఓపెన్ అకౌంట్' పై క్లిక్ చేయండి. 3) ఇప్పుడు మీ పాన్ కార్డు నంబర్, ఆధార్ కార్డు నంబర్ ఎంటర్ చేయాలి. 4) ఆధార్ కార్డు లింక్ చేసిన మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తుంది. 5) విద్యా అర్హతలు, చిరునామా, నామినీ వివరాలు వంటి వ్యక్తిగత వివరాలు సమర్పించాలి. 6) అన్ని వివరాలు సమర్పించిన తర్వాత డిజిటల్ ఖాతా తెరవబడుతుంది. ఈ డిజిటల్ పొదుపు ఖాతా ఒక సంవత్సరానికి మాత్రమే చెల్లుతుంది. ఖాతా తెరిచిన ఒక సంవత్సరంలో మీరు దగ్గరలో ఉన్న బయోమెట్రిక్ విధానాన్ని పూర్తి చేయాలి. ఆ తర్వాత అది సాధారణ పొదుపు ఖాతాగా మార్చబడుతుంది. చదవండి: 10కోట్లకు పైగా అమ్ముడైన ఆపిల్ వాచ్‌లు ఎంఆధార్ వినియోగదారులకు తీపికబురు -
పోస్టల్ బ్యాంక్ నుంచి ‘డాక్‌పే’ యాప్
సాక్షి, అమరావతి: మారుమూల గ్రామీణ ప్రాంతాల నుంచి దేశంలో ఎక్కడికైనా తక్షణం నగదు పంపిణీ చేసే సౌకర్యాన్ని తపాలా శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (ఐపీపీబీ) ‘డాక్‌పే’ పేరుతో మొబైల్ డిజిటల్ పేమెంట్ సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది. డాక్‌పే యాప్ ద్వారా అన్ని బ్యాంకు అకౌంట్లను అనుసంధానం చేసుకోవడం ద్వారా అన్ని రకాల ఆర్థిక సేవలను వినియోగించుకోవచ్చని ఐపీపీబీ తెలిపింది. నగదు బదిలీ, చెల్లింపులతో పాటు పోస్టల్ శాఖ అందిస్తున్న వివిధ సేవింగ్స్ పథకాల్లో నేరుగా ఇన్వెస్ట్ చేయొచ్చు. డాక్‌పే యాప్ అందిస్తున్న సేవలు యూపీఐ: ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి మరో బ్యాంక్ అకౌంట్‌కు సురక్షితంగా, వేగంగా నగదు బదిలీ. వీడీసీ: రూపే డెబిట్ కార్డు ద్వారా చేసిన కొనుగోళ్లకు డిజిటల్ విధానంలో చెల్లింపులు చేయొచ్చు. డీఎంటీ: దేశంలో ఎక్కడి బ్యాంకు ఖాతాకైనా తక్షణం నగదు బదిలీ చేసుకోవచ్చు. ఏపీఎస్: ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సర్వీసుల్లో భాగంగా ఇంటి వద్దనే వేలి ముద్ర వేయడం ద్వారా బ్యాంకు సేవలు పొందవచ్చు. బిల్ చెల్లింపులు : దేశ వ్యాప్తంగా 470కిపైగా వ్యాపార సంస్థలకు నగదు రహిత లావాదేవీలు చేయొచ్చు. ఈ సంఖ్య క్రమేపీ పెరుగుతూ ఉంటుంది. పోస్టల్ పథకాలు: తపాల శాఖ అందిస్తున్న రికరింగ్ డిపాజిట్, పీపీఎఫ్, సుకన్య సంవృద్ధి ఖాతా వంటి వివిధ ఆర్థిక సేవలను వినియోగించుకోవచ్చు. -
ఇంటికే డబ్బులు తెచ్చిస్తారు
వృద్ధులు, మహిళలు, దివ్యాంగులకు శుభవార్త. ఇకపై వీరంతా నగదు కోసం బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూ కట్టాల్సిన పని లేదు. బ్యాంక్ పాస్‌బుక్, విత్ డ్రా ఫామ్, ఏటీఎం కార్డులూ అవసరం లేవు. ఇంట్లో ఉండే నగదు డ్రా చేసుకోవచ్చు. ఎలాగంటారా?.. మీ మొబైల్ లేదా ల్యాండ్‌లైన్ ద్వారా పోస్టల్ టోల్ ఫ్రీ నంబర్ 155299కు ఫోన్ చేసి రిక్వెస్ట్ పంపితే చాలు. మీ ఏరియా పోస్ట్‌మేన్ ‘మొబైల్ మైక్రో ఏటీఎం’తో మీ ఇంటికే వస్తారు. ఆయన అడిగిన వివరాలు అందిస్తే చాలు.. అవసరమైన మొత్తాన్ని కనీసం రూ.100 నుంచి రూ.10 వేల వరకు పొందవచ్చు. బ్యాలెన్స్, లావాదేవీల వివరాలూ తెలుసుకోవచ్చు. ఈ సేవలన్నీ ఉచితమే.. సాక్షి, సిటీబ్యూరో : పోస్టల్ శాఖ ఉత్తరాలు, మనీ ఆర్డర్ల బట్వాడాకే పరిమితం కాకుండా.. మార్పులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్నీ అందిపుచ్చుకొంటోంది. ఈ క్రమంలోనే బ్యాంకింగ్ సేవలకు శ్రీకారం చుట్టింది. గతేడాది ‘ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్’ పేరుతో బ్యాంకింగ్ రంగంలో ప్రవేశించిన తపాలా శాఖ పోస్టాఫీసులతో పాటు ఇంటి వద్దకు కూడా సేవలను అందిస్తోంది. ఇప్పటి వరకు పోస్టాఫీస్‌కు వెళ్లలేని మహిళలు, వృద్ధులు, దివ్యాంగులైన ఐపీపీబీ ఖాతాదారులకు బ్యాంకింగ్ సేవలందిస్తూ వచ్చిన తపాలా శాఖ ఇటీవల వివిధ బ్యాంక్‌ల ఖాతాదారులకు సైతం ఇంటి వద్ద బ్యాంకింగ్ సేవలందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. హెడ్, సబ్ పోస్టాఫీసుల ద్వారా కేవలం ఆధార్ నంబర్ ఆధారంగా ‘ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్’ ద్వారా ఏ బ్యాంక్‌లో ఖాతా ఉన్నా నగదు విత్ డ్రా చేసుకునే వెసులుబాటును కల్పించిన తపాలా శాఖ తాజాగా ఇంటి ముంగిటకు ఆధార్ ఏటీఎం పేరుతో సేవలను విస్తరించింది. మొబైల్ మైక్రో ఏటీఎంలు తపాలా శాఖ హైదరాబాద్ నగర పరిధిలోని 950 మంది పోస్ట్మేన్లకు ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ విధానంపై శిక్షణనిచ్చింది. మొబైల్ ఫోన్లలో మైక్రో ఏటీఎం యాప్‌లను డౌన్లోడ్ చేసి మొబైల్ ఫోన్లను సైతం అందజేసింది. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో ఉత్తరాలు బట్వాడా చేసే వీరంతా అవసరమైన వారికి ఆధార్ ఏటీఎంల ద్వారా సేవలందిస్తున్నారు. ఆధార్ ఏటీఎం సేవలు ఇలా.. - 155299 నంబర్‌కు రిక్వెస్ట్ పంపగానే, ఆ ఏరియా పోస్ట్‌మేన్ ‘మొబైల్ మైక్రో ఏటీఎం’తో మీ ఇంటి వద్దకు వస్తారు. - పోస్ట్‌మేన్ మీ పేరు, మొబైల్ నంబరు తీసుకుని ఎంటర్ చేయగానే, మీ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేయగానే ఆధార్ నంబర్ అడుగుతుంది. - అది నమోదు చేయగానే కావల్సిన నగదు, బ్యాంక్ పేరు అడుగుతుంది. నగదు మొత్తం ఎంటర్ చేసి, ఖాతా కలిగిన బ్యాంక్ పేరును ఎంపిక చేసుకోవాలి (ఆధార్‌తో ఆ బ్యాంక్ ఖాతా అనుసంధానమై ఉండాలి). - ఆపై బయోమెట్రిక్ అందిస్తే.. అది ఆమోదం కాగానే నగదు విత్ డ్రా, మినీ స్టేట్మెంట్, బ్యాలెన్స్ విచారణ, ఫుల్ మనీ ఆప్షన్లు వస్తాయి. - ఉదాహరణకు నగదు విత్ డ్రా ఆప్షన్ ఎంచుకుంటే.. నగదు మొత్తం ధ్రువీకరణ కోసం మరోమారు బయోమెట్రిక్ అందించాలి. - ఈ ప్రక్రియ పూర్తి కాగానే, పోస్ట్‌మేన్ ఆ నగదు అందజేస్తారు. ఏరియా పోస్ట్మేన్లను అడిగితే చెబుతారు ఏరియా పోస్ట్మేన్లను సంప్రందించి ఇంటి ముంగిటే ఆధార్ ఏటీఎంల సేవలు పొందవచ్చు. బ్యాంక్, ఏటీఎంలకు వెళ్లలేని వృద్ధులు, మహిళలు, వికలాంగులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలి. ఇందుకోసం ఎలాంటి సర్వీస్ చార్జీ ఉండదు. టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందిస్తే మీ ఏరియా పోస్ట్‌మేన్ అందుబాటులోకి వస్తారు. – జయరాజ్, చీఫ్ పోస్ట్‌మాస్టర్, జనరల్ పోస్టాఫీసు, హైదరాబాద్ -
విస్తరణపై పోస్టల్ పేమెంట్ బ్యాంకు దృష్టి
న్యూఢిల్లీ: తపాలా విభాగానికి చెందిన ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) తన కార్యకలాపాలు విస్తరించడంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్ నాటికి ఐపీపీబీ మొత్తం 650 శాఖలను ప్రారంభించే అవకాశం ఉన్నట్లు లోక్సభకిచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలు సాగించేందుకు గతేడాది జనవరి 20న ఐపీపీబీకి ఆర్బీఐ లైసెన్సు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఐపీపీబీ గతేడాది జనవరి 30న ప్రయోగాత్మకంగా రాయ్‌పూర్ (చత్తీస్‌గఢ్), రాంచీ (జార్ఖండ్)లో రెండు శాఖలను మాత్రమే ప్రారంభించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా శాఖలను విస్తరించలేదు. దేశవ్యాప్తంగా కార్యకలాపాలు విస్తరించాలని భావిస్తున్న ఐపీపీబీ.. వీలును బట్టి మొత్తం పోస్టాఫీసులన్నింటినీ (సుమారు 1.55 లక్షలు) బ్యాంకింగ్ పథకాలు, సర్వీసులను అందించడానికి ఉపయోగించుకునే అవకాశం ఉన్నట్లు మనోజ్ సిన్హా తెలిపారు. మరోవైపు, ఇతర బ్యాంకింగ్, ఆర్థిక సంస్థలతో కూడా ఐపీపీబీ ఒప్పం దాలు కుదుర్చుకోవాలని భావిస్తున్నట్లు మంత్రి తెలిపారు. దీనిపై ఇప్పటికే పలు సంస్థలు ఆసక్తి వ్యక్తపర్చాయని, ప్రాథమిక స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే పంజాబ్ నేషనల్ బ్యాంకు, పీఎన్బీ మెట్‌లైఫ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలతో ఐపీపీబీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని మనోజ్ సిన్హా చెప్పారు. -
పోస్టల్ పేమెంట్ బ్యాంక్ షురూ
న్యూఢిల్లీ: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) ప్రయోగాత్మకంగా సర్వీసులు ప్రారంభించింది. రాయ్‌పూర్, రాంచీల్లో సేవలు ఆరంభించినట్లు సంస్థ సీఈవో ఏపీ సింగ్ తెలిపారు. రూ. 25,000 దాకా డిపాజిట్లపై 4.5 శాతం, రూ. 25,000–రూ.50,000 దాకా 5 శాతం, అంతకు మించి రూ. 1,00,000 దాకా డిపాజిట్లపై 5.5 శాతం వడ్డీ రేటు ఇవ్వనున్నట్లు ఆయన వివరించారు. ప్రతి జిల్లాలో తమ శాఖ ఉండాలని నిర్దేశించుకున్నట్లు, 3 లక్షల మంది పైచిలుకు పోస్ట్‌మెన్ ఇందులో పాలుపంచుకోనున్నట్లు సింగ్ పేర్కొన్నారు. ఇండియా పోస్ట్‌కి చెందిన 1,000 ఏటీఎంలు.. ఐపీపీబీకి బదిలీ కానున్నట్లు ఆయన పేర్కొన్నారు. మారుమూల ప్రాంతాల వారికి కూడా బ్యాంకింగ్ సేవలను చౌకగా పేమెంట్స్ బ్యాంక్ అందుబాటులోకి తేగలదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ సందర్భంగా చెప్పారు. రాబోయే రోజుల్లో ఇవి సాంప్రదాయ బ్యాంకులకు పోటీ ఇవ్వగలవని ఆయన పేర్కొన్నారు. మరోవైపు సెప్టెంబర్ నాటికి దేశవ్యాప్తంగా 650 శాఖలు ప్రారంభించాలని ఐపీపీబీ నిర్దేశించుకున్నట్లు ఆయన వివరించారు. చెల్లింపుల బ్యాంకులు ఖాతాకు రూ. 1 లక్ష దాకా డిపాజిట్లు స్వీకరించవచ్చు. పేమెంట్స్ బ్యాంక్‌ల ఏర్పాటుకు ఆర్బీఐ నుంచి లైసెన్స్‌లు పొందిన వాటిలో ఐపీపీబీతో పాటు ఎయిర్టెల్, పేటీఎం తదితర సంస్థలు ఉన్నాయి.