ఎస్పీలో సంచలనం: అఖిలేశ్‌పై వేటు | Akhilesh expelled from Samajwadi party | Sakshi
Sakshi News home page

ఎస్పీలో సంచలనం: అఖిలేశ్‌పై వేటు

Published Fri, Dec 30 2016 6:55 PM | Last Updated on Fri, Aug 17 2018 7:32 PM

ఎస్పీలో సంచలనం: అఖిలేశ్‌పై వేటు - Sakshi

ఎస్పీలో సంచలనం: అఖిలేశ్‌పై వేటు

లక్నో: దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీలో అగ్నిపర్వతం పేలింది. అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌..తన కుమారుడు, యూపీ సీఎం అయిన అఖిలేశ్‌ యాదవ్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు.  సోదరుడు రాంగోపాల్‌ యాదవ్‌పైనా వేటు వేశారు. ఈ ఇద్దరినీ ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ములాయం శుక్రవారం లక్నో లోని పార్టీ కార్యాలయంలో ప్రకటించారు.

(235 మందితో అఖిలేశ్‌ జాబితా)
మరి కొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ టికెట్ల వ్యవహారం తండ్రీకొడుకుల మధ్య దూరాన్ని మరింత పెంచింది. సీఎం అఖిలేశ్‌ సూచించినవారికి కాకూడా తనకు నచ్చిన వారికే టికెట్లు కేటాయిస్తూ ములాయం 325 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఇది జరిగిన గంటల వ్యవధిలోనే తండ్రి నిర్ణయాన్ని ధిక్కరిస్తూ అఖిలేశ్‌.. 235 మంది పేర్లతో కూడి రెబర్స్‌ జాబితాను ప్రకటించారు. అఖిలేశ్‌ తిరుగుబాటు చర్యను తీవ్రంగా పరిగణించిన ములాయం.. శుక్రవారం ఉదయం షోకాజ్‌ నోటీసులు జారీచేశారు. మరి కొద్ది గంటల్లోనే అఖిలేశ్‌ సహా రాంగోపాల్‌ యాదవ్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు  ప్రకటించారు.
యూపీ పరిణామాలకు సంబంధించిన మరిన్ని కథనాలు చదవండి..

1.(ములాయం కుటుంబంలో ఏం జరిగింది?)

2.(కొత్త సీఎంను నేనే ప్రకటిస్తా: ములాయం)

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement