యెమెన్: దక్షిణ యెమెన్ ఆల్ ఖైదా తీవ్రవాదులు గురువారం పేట్రేగిపోయారు. షబ్వా ప్రావెన్స్లోని బైహన్ పట్టణంలో సైనిక శిబిరాన్ని ఆల్ ఖైదా తీవ్రవాదులు చుట్టుముట్టి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఏడుగురు మరణించారు. ఆ కాల్పులు జరిపింది తామేనని ఆల్ ఖైదాకు చెందిన అన్సర్ అల్ షరియా ప్రకటించింది. రాజధాని సనాలో సైన్యం పెత్తనానికి నిరసనగానే ఈ దాడి చేసినట్లు తీవ్రవాదులు ట్విట్టర్లో పేర్కొన్నారు.