Shabwa province
-
ఆల్ ఖైదా తీవ్రవాదులు దాడి: ఏడుగురు మృతి
యెమెన్: దక్షిణ యెమెన్ ఆల్ ఖైదా తీవ్రవాదులు గురువారం పేట్రేగిపోయారు. షబ్వా ప్రావెన్స్లోని బైహన్ పట్టణంలో సైనిక శిబిరాన్ని ఆల్ ఖైదా తీవ్రవాదులు చుట్టుముట్టి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఏడుగురు మరణించారు. ఆ కాల్పులు జరిపింది తామేనని ఆల్ ఖైదాకు చెందిన అన్సర్ అల్ షరియా ప్రకటించింది. రాజధాని సనాలో సైన్యం పెత్తనానికి నిరసనగానే ఈ దాడి చేసినట్లు తీవ్రవాదులు ట్విట్టర్లో పేర్కొన్నారు. -
యెమెన్‌లో బాంబు పేలుళ్లు: 20 మందికి గాయాలు
యెమెన్ రాజధాని సనాలోని అల్ రాబట్ విధిలో నిన్న సంభవించిన వరుస జంట బాంబు పేలుళ్ల ఘటనలో 20 మంది గాయపడ్డారని ఆ దేశ హోం మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. క్షతగాత్రులను సనాలోని ప్రభుత్వ ఆసుప్రతికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది. వారిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పింది. అయితే నగరంలోని రాబర్ట్ వీధిలో చెత్త ఉంచిన ప్రదేశంలో మొదటి బాంబు పేలింది. ఆ ఘటనలో ఎవరు గాయపడలేదు. ఆ శబ్దానికి అటువైపుగా వెళ్తున్న పాదచారులు అందరు గుమ్మిగూడారు. మరి కొన్ని నిముషాల వ్యవధిలో మరో బాంబు పేలింది. దాంతో అక్కడ ఉన్నవారందరు తీవ్రంగా గాయపడ్డారు. బాంబు పేలుడు ధాటికి సమీపంలోని కార్లు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. దాంతో భద్రత సిబ్బంది రంగంలోని దిగారు. సమీపంలోని దుకాణాలను మూసివేయించారు. అనంతరం స్థానికంగా తనిఖీలు చేపట్టారు. భద్రత దళాలను హతమార్చేందుకు ఆ బాంబులు పెట్టి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. దేశంలో బలంగా విస్తరించిన అల్ ఖైదా అనుబంధ సంస్థలే ఆ బాంబు పేలుళ్లకు కారణమని ప్రభుత్వం భావిస్తుంది. అలాగే యెమెన్ దక్షణ భాగంలోని సాబ్వా రాజధాని అతక్లో నిన్న ఆత్మాహుతి దాడిలో ఆర్మీ నిఘా అధికారి మరణించాడు. -
యెమెన్‌లో ఆత్మహుతి దాడి: 40 మంది మృతి
యెమెన్ దేశంలో ఆగ్నేయ ప్రాంతంలోని షబ్బవా ప్రావెన్లో సైనికులు అత్యధికంగా నివసించే ప్రాంతంలోని ఈ రోజు తెల్లవారుజామున ఆగంతకులు జరిపిన ఆత్మాహుతి దాడిలో 40 మంది సైనికులు మరణించారని ఉన్నతాధికారులు వెల్లడించారు. దాదాపు వంద మంది వరకు గాయపడ్డారని చెప్పారు. క్షతగాత్రులంతా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని వివరించారు. వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపారు. అజ్జన్ ప్రాంతంలో ఆత్మాహుతి జరిపిన కారు బాంబు ఘటనలో 30 మంది సైనికులు మరణించారని, మరో 20 మంది గాయపడ్డారని చెప్పారు. అలాగే పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో జరిగిన రెండు కారు బాంబు పేలుళ్లలో 10 మంది సైనికులు మృతి చెందారని, పలువురు సైనికులు గాయపడ్డారని ఉన్నతాధికారులు వివరించారు. ఈ మేరకు స్థానిక మీడియా శుక్రవారం పేర్కొంది.