అనంత్ గీతే(ఫైల్ ఫోటో)
ముంబై: మహారాష్ట్రలో బీజేపీతో చెలిమి చెడడంతో కేంద్ర కేబినెట్ నుంచి వైదొలగాలని శివసేన నిర్ణయించింది. ఎన్డీఏ సర్కారులో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న తమ పార్టీ నేత అనంత్ గీతే పదవి నుంచితప్పుకుంటారని శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే ప్రకటించారు.
అమెరికా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత అనంత్ గీతే మంత్రి పదవికి రాజీనామా చేస్తారని వెల్లడించారు. మోడీ ప్రభుత్వంలో శివసేన తరపున ప్రాతినిథ్యం వహిస్తున్న ఏకైక మంత్రి అనంత్ గీతే. వచ్చే నెలలో జరగనున్న మహారాష్ట్ర ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు కుదరకపోవడంతో బీజేపీ, శివసేన వేరుబాట పట్టాయి.