మంత్రులపై సీఎం అసంతృప్తి
ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు వివాదం అంశాన్ని మంత్రులు సరిగా డీల్ చేయలేదంటూ ఆయన మండిపడినట్లు సమాచారం.
సమస్య పరిష్కారానికి విశాఖ, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన మంత్రులు చొరవ తీసుకోవడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిర్పోర్టుకు కావాల్సిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు రైతులతో మాట్లాడాలని ఆ జిల్లాల మంత్రులను చంద్రబాబు నాయుడు ఆదేశించారు.