యాపిల్ చౌక ఐఫోన్ వచ్చేసింది..
యాపిల్ చౌక ఐఫోన్ వచ్చేసింది..
Published Wed, Sep 11 2013 1:35 AM | Last Updated on Tue, Nov 6 2018 5:26 PM
కాలిఫోర్నియా: స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్లో పూర్వ వైభవం పొందడం, కొత్త మార్కెట్లకు విస్తరించడం లక్ష్యాలుగా యాపిల్ కంపెనీ కొత్త ఐఫోన్‌లను ఆవిష్కరించింది. భారత్, చైనాల్లో చౌక ధరల స్మార్ట్‌ఫోన్‌లు బాగా అమ్ముడవుతుండటంతో, శామ్‌సంగ్, ఇతర దేశీయ కంపెనీల స్మార్ట్‌ఫోన్లకు పోటీగా యాపిల్ కంపెనీ ఐఫోన్ 5సీని మార్కెట్లోకి తెచ్చింది.
పసుపు, ఆకుపచ్చ, నీలం, తెలుపు, ఎరుపు రంగుల్లో లభ్యమయ్యే ఈ ఫోన్ ధరలను (రెండేళ్ల పాటు మొబైల్ ఆపరేటర్లతో కాంట్రాక్ట్‌తో) 16జీబీ 99 డాలర్లు, 32 జీబీ 199 డాలర్లుగా కంపెనీ నిర్ణయించింది. మల్టీ టచ్ ఇంటర్‌ఫేస్‌తో లభ్యమయ్యే ఈ ఫోన్‌లో 4 అంగుళాల రెటినా డిస్‌ప్లే, ఫుల్ ఎస్‌ఆర్‌జీబీ, ఏ6 పవర్ ప్రాసెసర్, 8 మెగా పిక్సెల్ ఐసైట్ కెమెరా వంటి ఫీచర్లున్నాయి. ఇక టాప్‌ఎండ్ మోడల్, యాపిల్ ఐఫోన్ 5 ఎస్‌ను హై గ్రేడ్ అల్యూమినియంతో తయారు చేశారు.
మూడు వెర్షన్లలో లభించే వీటి ధరలను 199 డాలర్లు(16జీబీ), 299 డాలర్లు(32జీబీ), 399 డాలర్లు(64జీబీ)గా కంపెనీ నిర్ణయించింది. ఏ7(ఏ-64 బిట్) చిప్, యాక్సిలరో మీటర్, గైరోస్కోప్, కాంపాస్ సపోర్ట్, ఎం7(మోషన్ కో-ప్రాసెసర్) వంటి ప్రత్యేకతలున్నాయి. 10 గంటల 3జీ టాక్‌టైమ్, 250 గంటల స్టాండ్‌బై, 10 గంటల ఎల్‌టీఈ బ్రౌజింగ్, 40 గంటల మ్యూజిక్ ప్లే బాక్‌నిచ్చే బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ వంటి ప్రత్యేకతలున్నాయి. ఈ రెండు కొత్త ఫోన్లు ఈ ఏడాది డిసెంబర్ కల్లా భారత్‌లో లభ్యమవుతాయి.
Advertisement
Advertisement