iPhone 5c
-
యాపిల్ 5సీ... పండలేదు?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐఫోన్లో ఏ మోడలొచ్చినా హాట్‌కేకే. ఐఫోన్..ఐప్యాడ్లతో యాపిల్ చరిత్రే మారిపోయింది. అలాంటి యాపిల్‌కు... ఐఫోన్ 5సీ మాత్రం కలిసి రాలేనట్లే కనిపిస్తోంది. ఇటీవల విడుదల చేసిన ఐఫోన్ 5సీకి దేశవ్యాప్తంగా స్పందన అంతంతమాత్రంగానే వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు దాదాపు 10 వేల పీసులే విక్రయించినట్టు సమాచారం. ఎలాగైనా 5సీ అమ్మకాలను పెంచాలని భావిస్తున్న ఆపిల్... ఆ దిశగా ఎత్తులు వేస్తోంది. త్వరలో బై బ్యాక్ పథకాన్ని ప్రకటించనుంది. ఇందులో భాగంగా పాత స్మార్ట్‌ఫోన్(ఎంపిక చేసిన మోడళ్లు) తెచ్చిన వారికి 5సీపై డిస్కౌంట్‌ను ఆఫర్ చేయనున్నట్టు తెలుస్తోంది. అంతేగాక యాపిల్ కంపెనీ మొబైల్ ఫోన్ల విక్రయదారులపై(రిటైలర్లు) ఒత్తిడి కూడా పెంచుతోంది. ఐఫోన్ 5ఎస్ కావాలంటే ఒక 2 జీబీ ఐపోడ్, ఒక ఐఫోన్ 5సీ కొనాల్సిందేనని షరతు పెడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. రూ.3,400 ఖరీదైన ఈ ఐపోడ్‌కు కూడా పెద్దగా డిమాండ్ లేదని తెలుస్తోంది. 5సీ ఖరీదెక్కువా? భారత్‌లో ఐఫోన్ 5సీ 16 జీబీ మోడల్ ధర రూ.41,900 కాగా, 32 జీబీ రూ.53,500 ఉంది. ధర ఎక్కువగా ఉందని కస్టమర్లు తమతో అంటున్నారని ఒక రిటైలర్ చెప్పారు. వాస్తవానికి 5సీ ఫీచర్లు బాగున్నాయని, దాని గురించి వివరిస్తే కస్టమర్లు కొంటున్నారని ఆయన తెలియజేశారు. 5సీ పరిస్థితి ఇలా ఉంటే, మరోవైపు 5ఎస్ గోల్డ్ కలర్ మోడల్‌ను రూ.1.2 లక్షలు వెచ్చించి సైతం దక్కించుకున్న వారు కూడా ఉన్నారు. కాగా, ఎయిర్‌టెల్‌తో బండిల్ ఆఫర్‌ను ప్రకటించేందుకు ఆపిల్ సిద్ధమవుతోంది. ఎయిర్‌టెల్‌తో జత కలవడం వల్ల కొత్త మోడళ్ల అమ్మకాలు పెరుగుతాయని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే రిలయన్స్‌తో బండిల్ ఆఫర్‌ను ప్రకటించింది. యాపిల్ నవంబరు 1న భారత్‌లో ఐఫోన్ 5ఎస్, 5సీ విడుదల చేసింది. 5ఎస్‌కు కొరత.. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు ఐఫోన్ 5ఎస్ 30 వేల పీసులు అమ్ముడయ్యాయి. 5ఎస్‌కు డిమాండ్ విపరీతంగా ఉంది. సరఫరా ఆ స్థాయిలో లేదు. యాపిల్ తొలిసారిగా బంగారు వర్ణంలో 5ఎస్‌ను రూపొందించింది. విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈ మోడల్ కోసం కస్టమర్లు అందరూ పట్టుబడుతున్నారు. గోల్డ్ కలర్‌కు ప్రపంచవ్యాప్తంగా స్పందన ఈ స్థాయిలో ఉంటుందని కంపెనీ సైతం ఊహించలేదు. గోల్డ్, సిల్వర్(వైట్), స్పేస్ గ్రే(బ్లాక్) రంగుల్లో ఐఫోన్ 5ఎస్‌ను యాపిల్ రూపొందించింది. ఐఫోన్ 5ఎస్ 16 జీబీ మోడల్ రూ.53,500, 32 జీబీ రూ.62,500, 64 జీబీ రూ.71,500గా ఉంది. కాగా, బ్లూ, గ్రీన్, పింక్, యెల్లో, వైట్ రంగుల్లో ఐఫోన్ 5సీ లభిస్తోంది. వైట్ మినహా మిగిలినవన్నీ ఆపిల్ తొలిసారిగా విడుదల చేసిన రంగులే. కొన్ని రంగుల 5సీ మోడళ్లు గోడౌన్లలో పేరుకుపోతున్నాయట. పరిస్థితి ఇలాగే ఉంటే యాపిల్‌కు కొత్త కష్టాలొచ్చే అవకాశం లేకపోలేదు. -
ఖరీదైన శామ్సంగ్ స్మార్ట్‌ఫోన్
న్యూఢిల్లీ: శామ్సంగ్ ఇండియా... నోట్ 3 స్మార్ట్‌ఫోన్‌ను, స్మార్ట్ వాచ్-గెలాక్సీ గేర్లను భారత మార్కెట్లోకి ప్రవేశ పెట్టింది. నోట్ 3 స్మార్ట్‌ఫోన్ ధరను రూ.49,900గా, గెలాక్సీ గేర్ ధరను రూ.22,990గా నిర్ణయించామని కంపెనీ పేర్కొంది. వీటి అమ్మకాలు ఈ నెల 25 నుంచి ప్రారంభిస్తామని వివరించింది. పండుగల సీజన్ కారణంగా పలు బై బ్యాక్ స్కీమ్‌లను అందించనున్నామని ఈ సందర్భంగా పేర్కొంది. సులభ వాయిదాల్లో నోట్ 3 నోట్ 3 స్మార్ట్‌ఫోన్‌ను 12 సులభవాయిదాల్లో కూడా కొనుగోలు చేసే అవకాశాన్నిస్తున్నామని కంపెనీ తెలిపింది. శామ్సంగ్ కంపెనీ నుంచి వస్తోన్న అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్ ఇదే. భారత్‌లో ఈ ఫోన్‌ను 3జీ వెర్షన్లో అందిస్తున్నామని కంపెనీ పేర్కొంది. ఒకేసారి మల్టిఫుల్ ఫ్రేమ్స్‌ను యూజర్లు ఓపెన్ చేసుకునేలా ఈ ఫోన్‌ను డిజైన్ చేశామని వివరించింది. 5.7 అంగుళాల సూపర్ అమెలెడ్ స్క్రీన్, స్టైలస్(ఎస్ పెన్), 13 మెగా పిక్సెల్ కెమెరా, 2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 32 జీబీ/64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, అదనపు మెమరీ కోసం మైక్రో ఎస్డీ కార్డ్ వంటి ప్రత్యేకతలున్నాయి. డేటాను సురక్షితంగా ఉంచే కంటైనర్ ఫోల్డర్ (శామ్సంగ్ నాక్స్ ఆప్సన్ ద్వారా ఇది పనిచేస్తుంది) ఈ ఫోన్ ప్రత్యేకతని కంపెనీ వివరించింది. ఒక వేళ ఫోన్ పోతే, దాంట్లో ఉన్న డేటాను నాక్స్ ఫీచర్‌తో తొలగించడం కానీ, ట్రాక్ చేయడం గానీ చేయవచ్చని పేర్కొంది. 3200 ఎంఏహెచ్ బ్యాటరీ 24 గంటల బ్యాకప్‌ను ఇస్తుందని వివరించింది. గెలాక్సీ గేర్ ప్రత్యేకతలు... 1.6 అంగుళాల స్క్రీన్, 2.6 ఔన్స్‌ల బరువు, 1.9 మెగా పిక్సెల్ కెమెరా, యూజర్లు హ్యాండ్స్ ఫ్రీ కాల్స్ చేసుకోవడానికి బిల్టిన్ స్పీకర్, మెసేజ్‌లు పంపించడం వంటి పనులను ఈ వాచీ నిర్వర్తిస్తుంది. నడిచేటప్పుడు అడుగులు లెక్కించే స్టెప్-కౌంటింగ్ పెడో మీటర్, ఎస్ వాయిస్‌లతో సహా మొత్తం 60యాప్‌లు ప్రి లోడెడ్‌గా ఈ వాచ్ లభిస్తుంది. ఈ వాచ్‌తో తీసిన వీడియోలను, ఫొటోలను బ్లూటూత్ ద్వారా గెలాక్సీ నోట్ 3 వంటి మొబైల్ డివైస్‌లకు ట్రాన్సిమిట్ చేసుకోవచ్చు. -
డిసెంబర్ కల్లా యాపిల్ చౌక ఐఫోన్
-
డిసెంబర్ కల్లా యాపిల్ చౌక ఐఫోన్
స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్లో పూర్వ వైభవం పొందడం, కొత్త మార్కెట్లకు విస్తరించడం లక్ష్యాలుగా యాపిల్ కంపెనీ కొత్త ఐఫోన్లను ఆవిష్కరించింది. భారత్, చైనాల్లో చౌక ధరల స్మార్ట్ఫోన్లు బాగా అమ్ముడవుతుండటంతో, శామ్సంగ్, ఇతర దేశీయ కంపెనీల స్మార్ట్ఫోన్లకు పోటీగా యాపిల్ కంపెనీ ఐఫోన్ 5సీని మార్కెట్లోకి తెచ్చింది. పసుపు, ఆకుపచ్చ, నీలం, తెలుపు, ఎరుపు రంగుల్లో లభ్యమయ్యే ఈ ఫోన్ ధరలను (రెండేళ్ల పాటు మొబైల్ ఆపరేటర్లతో కాంట్రాక్ట్‌తో) 16జీబీ 99 డాలర్లు, 32 జీబీ 199 డాలర్లుగా కంపెనీ నిర్ణయించింది. మల్టీ టచ్ ఇంటర్ఫేస్తో లభ్యమయ్యే ఈ ఫోన్లో 4 అంగుళాల రెటినా డిస్ప్లే, ఫుల్ ఎస్ఆర్జీబీ, ఏ6 పవర్ ప్రాసెసర్, 8 మెగా పిక్సెల్ ఐసైట్ కెమెరా వంటి ఫీచర్లున్నాయి. ఇక టాప్ఎండ్ మోడల్, యాపిల్ ఐఫోన్ 5 ఎస్‌ను హై గ్రేడ్ అల్యూమినియంతో తయారు చేశారు. మూడు వెర్షన్లలో లభించే వీటి ధరలను 199 డాలర్లు(16జీబీ), 299 డాలర్లు(32జీబీ), 399 డాలర్లు(64జీబీ)గా కంపెనీ నిర్ణయించింది. ఏ7(ఏ-64 బిట్) చిప్, యాక్సిలరో మీటర్, గైరోస్కోప్, కాంపాస్ సపోర్ట్, ఎం7(మోషన్ కో-ప్రాసెసర్) వంటి ప్రత్యేకతలున్నాయి. 10 గంటల 3జీ టాక్‌టైమ్, 250 గంటల స్టాండ్‌బై, 10 గంటల ఎల్టీఈ బ్రౌజింగ్, 40 గంటల మ్యూజిక్ ప్లే బాక్నిచ్చే బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ వంటి ప్రత్యేకతలున్నాయి. ఈ రెండు కొత్త ఫోన్లు ఈ ఏడాది డిసెంబర్ కల్లా భారత్‌లో లభ్యమవుతాయి. -
యాపిల్ చౌక ఐఫోన్ వచ్చేసింది..
కాలిఫోర్నియా: స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్లో పూర్వ వైభవం పొందడం, కొత్త మార్కెట్లకు విస్తరించడం లక్ష్యాలుగా యాపిల్ కంపెనీ కొత్త ఐఫోన్లను ఆవిష్కరించింది. భారత్, చైనాల్లో చౌక ధరల స్మార్ట్ఫోన్లు బాగా అమ్ముడవుతుండటంతో, శామ్సంగ్, ఇతర దేశీయ కంపెనీల స్మార్ట్ఫోన్లకు పోటీగా యాపిల్ కంపెనీ ఐఫోన్ 5సీని మార్కెట్లోకి తెచ్చింది. పసుపు, ఆకుపచ్చ, నీలం, తెలుపు, ఎరుపు రంగుల్లో లభ్యమయ్యే ఈ ఫోన్ ధరలను (రెండేళ్ల పాటు మొబైల్ ఆపరేటర్లతో కాంట్రాక్ట్‌తో) 16జీబీ 99 డాలర్లు, 32 జీబీ 199 డాలర్లుగా కంపెనీ నిర్ణయించింది. మల్టీ టచ్ ఇంటర్ఫేస్తో లభ్యమయ్యే ఈ ఫోన్లో 4 అంగుళాల రెటినా డిస్ప్లే, ఫుల్ ఎస్ఆర్జీబీ, ఏ6 పవర్ ప్రాసెసర్, 8 మెగా పిక్సెల్ ఐసైట్ కెమెరా వంటి ఫీచర్లున్నాయి. ఇక టాప్ఎండ్ మోడల్, యాపిల్ ఐఫోన్ 5 ఎస్‌ను హై గ్రేడ్ అల్యూమినియంతో తయారు చేశారు. మూడు వెర్షన్లలో లభించే వీటి ధరలను 199 డాలర్లు(16జీబీ), 299 డాలర్లు(32జీబీ), 399 డాలర్లు(64జీబీ)గా కంపెనీ నిర్ణయించింది. ఏ7(ఏ-64 బిట్) చిప్, యాక్సిలరో మీటర్, గైరోస్కోప్, కాంపాస్ సపోర్ట్, ఎం7(మోషన్ కో-ప్రాసెసర్) వంటి ప్రత్యేకతలున్నాయి. 10 గంటల 3జీ టాక్‌టైమ్, 250 గంటల స్టాండ్‌బై, 10 గంటల ఎల్టీఈ బ్రౌజింగ్, 40 గంటల మ్యూజిక్ ప్లే బాక్నిచ్చే బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ వంటి ప్రత్యేకతలున్నాయి. ఈ రెండు కొత్త ఫోన్లు ఈ ఏడాది డిసెంబర్ కల్లా భారత్‌లో లభ్యమవుతాయి.