
పక్కా సమాచారంతోనే నాయక్ అరెస్ట్: నగర సీపీ
హైదరాబాద్: పాక్ మహిళకు దేశ రక్షణ సమాచారం చేరవేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్మీ అధికారి పటన్కుమార్ పొద్దార్ నాయక్ కేసు విచారణ కొనసాగుతుందని నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి వెల్లడించారు. గురువారం హైదరాబాద్లో మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... పక్కా సమాచారంతోనే పటన్ కుమార్ను అరెస్టు చేసినట్లు చెప్పారు.
పాక్ మహిళ, పటన్ నాయక్ల మధ్య మనీ సర్క్యూలేషన్ జరిగిందా లేదా అనే విషయం తదుపరి విచారణలో తేలుతుందని తెలిపారు. నాయక్ అరెస్టు విషయాన్ని ఆర్మీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు మహేందర్ రెడ్డి వివరించారు.