Patan Kumar Poddar
-
పతాన్ కుమార్ బెయిల్ పై విడుదల
-
అనుష్క అనుచరుడు అరెస్ట్
హైదరాబాద్: సికింద్రాబాద్ ఆర్మీ ఆర్టిలరీ సెంటర్ సైనికాధికారి పటన్ కుమార్ పోద్దార్ కేసుకు సంబంధించి అనుష్క అగర్వాల్ అనుచరుడు అసిఫ్ అలీని పోలీసులు అరెస్ట్ చేశారు. పాక్ ఐఎస్ఐ ఏజెంట్ అనుష్క అగర్వాల్ మోజులోపడి పటన్ మిలటరీ రహస్య పత్రాలు ఆమెకు పంపిన విషయం తెలిసిందే. ఏడాది కాలంగా ఆమెకు 104 పేజీల రహస్యాలను పంపినట్లు పోలీసుల విచారణలో తేలింది. అదుపులోకి తీసుకున్న అసిఫ్ అలీని పీటీ వారెంట్‌పై 15 రోజుల కస్టడీకి సీసీఎస్ డీసీపీ కోరారు. దేశంలోని 12 ఆర్మీ యూనిట్ల ప్రాంతాలు, సైనికాధికారుల పేర్లు, ఏయే యూనిట్లో ఏయే ఆయుధాలు ఎక్కడెక్కడ ఉంటాయి అన్న విషయాలను పటన్ అనుష్కకు అందించాడు. సైనికాధికారుల సమావేశాల సర్క్యులర్ కాపీలను సైతం ఆమెకు పంపినట్లు తేలింది. అత్యంత క్రమశిక్షణకు మారుపేరైన మిలటరీలో పనిచేస్తున్న తాను అనుష్క మోజులో పడి మోసపోయానని అతడు అంగీకరించాడు. తప్పు చేసినందుకు పశ్చాత్తాప పడుతున్నానని అతను పోలీసుల విచారణలో పేర్కొన్నాడు. -
అనుష్క పది లక్షలు ఇచ్చిన తర్వాతే..!
-
'అనుష్క నా అకౌంట్లో 10 లక్షలు జమ చేసింది'
హైదరాబాద్ : పాకిస్థాన్ ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలకు దేశ మిలటరీ రహస్యాలను చేరవేస్తున్నారనే ఆరోపణలపై అరెస్ట్ అయిన ఆర్మీ అధికారి పటన్‌కుమార్ పొద్దార్ నాయక్ (40) విచారణలో సరికొత్త నిజాలు వెలుగులోకి వస్తున్నాయని పోలీసులు తెలిపారు. పాక్ మహిళ అనుష్క అగర్వాల్‌తో గత మూడు నెలలుగా చాటింగ్ చేస్తున్నట్లు పటన్ కుమార్ వెల్లడించారని చెప్పారు. అలాగే అనుష్క తన అకౌంట్లో రూ.10 లక్షలు జమ చేసిందని చెప్పాడన్నారు. భారత్ - పాక్ సరిహద్దుల్లోని పూంచ్ సెక్టర్లో ఆర్మీ కదలికలపై అనుష్కకు సమాచారం అందించాడన్నారు. అయితే పటన్‌కుమార్ చెందిన రెండు అకౌంట్ల నుంచి రూ. 3 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. పటన్ కుమార్‌ను తమకు అప్పగించాలని నాంపల్లి కోర్టులో సీసీఎస్ పోలీసులు పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఎన్ఐఏ, ఐబీ, ఆర్మీ, ఇంటెలిజెన్స్, సీఐఎస్ఎఫ్లు పటన్ కుమార్‌ను తమకు అప్పగించాలని ఇప్పటికే కోరుతున్నాయని తెలిపారు. పోలీసుల విచారణలో పొద్దార్ నాయక్ వెల్లడించిన విషయాలను పోలీసులు వెల్లడించారు. అనుష్క అగర్వాల్‌తో గత మూడు నెలలుగా చాటింగ్ చేస్తున్నట్లు చెప్పారు. అనుష్క అగర్వాల్ ఫేస్ బుక్ అకౌంట్ రాజస్థాన్ రాజధాని జైపూర్ అడ్రస్‌తో ఉందని పోలీసులు వెల్లడించారు. -
పక్కా సమాచారంతోనే నాయక్ అరెస్ట్: నగర సీపీ
హైదరాబాద్: పాక్ మహిళకు దేశ రక్షణ సమాచారం చేరవేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్మీ అధికారి పటన్‌కుమార్ పొద్దార్ నాయక్ కేసు విచారణ కొనసాగుతుందని నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి వెల్లడించారు. గురువారం హైదరాబాద్‌లో మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... పక్కా సమాచారంతోనే పటన్ కుమార్‌ను అరెస్టు చేసినట్లు చెప్పారు. పాక్ మహిళ, పటన్ నాయక్‌ల మధ్య మనీ సర్క్యూలేషన్ జరిగిందా లేదా అనే విషయం తదుపరి విచారణలో తేలుతుందని తెలిపారు. నాయక్ అరెస్టు విషయాన్ని ఆర్మీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు మహేందర్ రెడ్డి వివరించారు.