హైదరాబాద్: సికింద్రాబాద్ ఆర్మీ ఆర్టిలరీ సెంటర్ సైనికాధికారి పటన్ కుమార్ పోద్దార్ కేసుకు సంబంధించి అనుష్క అగర్వాల్ అనుచరుడు అసిఫ్ అలీని పోలీసులు అరెస్ట్ చేశారు. పాక్ ఐఎస్‌ఐ ఏజెంట్ అనుష్క అగర్వాల్ మోజులోపడి పటన్ మిలటరీ రహస్య పత్రాలు ఆమెకు పంపిన విషయం తెలిసిందే. ఏడాది కాలంగా ఆమెకు 104 పేజీల రహస్యాలను పంపినట్లు పోలీసుల విచారణలో తేలింది. అదుపులోకి తీసుకున్న అసిఫ్ అలీని పీటీ వారెంట్‌పై 15 రోజుల కస్టడీకి సీసీఎస్ డీసీపీ కోరారు.
దేశంలోని 12 ఆర్మీ యూనిట్ల ప్రాంతాలు, సైనికాధికారుల పేర్లు, ఏయే యూనిట్లో ఏయే ఆయుధాలు ఎక్కడెక్కడ ఉంటాయి అన్న విషయాలను పటన్ అనుష్కకు అందించాడు. సైనికాధికారుల సమావేశాల సర్క్యులర్ కాపీలను సైతం ఆమెకు పంపినట్లు తేలింది. అత్యంత క్రమశిక్షణకు మారుపేరైన మిలటరీలో పనిచేస్తున్న తాను అనుష్క మోజులో పడి మోసపోయానని అతడు అంగీకరించాడు. తప్పు చేసినందుకు పశ్చాత్తాప పడుతున్నానని అతను పోలీసుల విచారణలో పేర్కొన్నాడు.
అనుష్క అనుచరుడు అరెస్ట్
Published Sat, Aug 23 2014 6:26 PM | Last Updated on Sat, Sep 2 2017 12:20 PM
Advertisement