'అవి ఎప్పటికీ భారత్ వే' | Arunachal Pradesh and Kashmir always with india | Sakshi
Sakshi News home page

'అవి ఎప్పటికీ భారత్ వే'

Published Thu, May 28 2015 7:02 PM | Last Updated on Sun, Sep 3 2017 2:50 AM

'అవి ఎప్పటికీ భారత్ వే'

'అవి ఎప్పటికీ భారత్ వే'

అరుణాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్ భారతదేశ సొంతం అని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు.

న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్ భారతదేశ సొంతం అని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. అవి అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ భారత్లోనివేనని, భారత్ వేరు ఆ ప్రాంతాలు వేరు కాదని చెప్పారు. వాటి విషయంలో ఎవరు జోక్యం చేసుకోవద్దని హెచ్చరించారు. విదేశీ గడ్డకు మరీ ప్రధాని నరేంద్రమోదీ ఇదే విషయాన్ని స్పష్టం చేశారని తెలిపారు.

చైనాలో అడుగుపెట్టిన ప్రధాని నరేంద్రమోదీ ఇంకెప్పుడు కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్ విషయంలో జోక్యం చేసుకోకూడదని చెప్పి వచ్చారని అన్నారు. అంతర్జాతీయంగా భారత ప్రతిష్ఠను మోదీ పెంచారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పదేళ్ల పాలనలో దేశం మొత్తాన్ని దోచిందని, ఈ విషయం చెప్పడానికి తానెప్పుడు వెనుకాడనని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement