
మోదీజీ.. మీరు భయపడుతున్నట్టున్నారు
న్యూఢిల్లీ: ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్ వేదికగా మరోసారి ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. గురువారం ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ర్యాలీలో మోదీ ప్రసంగించిన వాటిలో ముఖ్యాంశాలను ఆయన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీనికి స్పందించిన కేజ్రీవాల్.. ఐదు రాష్ట్రల ఎన్నికల ఫలితాల పట్ల బీజేపీ, ప్రధాని మోదీ భయపడుతున్నారని ట్వీట్ చేశారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రచారం చేస్తున్న మోదీ భయపడుతున్నట్టుగా కనిపిస్తున్నారని కేజ్రీవాల్ పేర్కొన్నారు. కాగా ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఆప్ పోటీచేయడం లేదు. పంజాబ్, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో ఉంది. గోవా, పంజాబ్, ఉత్తరాఖండ్ ఎన్నికలు ముగిశాయి. యూపీలో రెండు దశల పోలింగ్ ముగిసింది. మరో ఐదు దశల్లో యూపీ ఎన్నికలు, మణిపూర్ ఎన్నికలు జరగాల్సి వుంది. వచ్చే నెల 11న ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది.
Sir, u are looking nervous https://t.co/6F9aBzVmAn
— Arvind Kejriwal (@ArvindKejriwal) 16 February 2017