హైదరాబాద్ను యూటీ చేయొద్దు: అసదుద్దీన్ | Asaduddin Owaisi Opposes Hyderabad As Union Territory | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ను యూటీ చేయొద్దు: అసదుద్దీన్

Published Fri, Nov 22 2013 1:27 PM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

హైదరాబాద్ను యూటీ చేయొద్దు: అసదుద్దీన్ - Sakshi

హైదరాబాద్ను యూటీ చేయొద్దు: అసదుద్దీన్

న్యూఢిల్లీ : ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ శుక్రవారం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో సమావేశం అయ్యారు. వీరి ఇరువురి భేటీ సుమారు 45 నిమిషాలు పాటు కొనసాగింది. భేటీ అనంతరం అసదుద్దీన్ మాట్లాడుతూ హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేయవద్దని సోనియాని కోరినట్లు తెలిపారు. అవశేష ఆంధ్రప్రదేశ్కు హైదరాబాద్తో భౌగోళిక సంబంధం లేదని అసద్ అన్నారు.

శాంతి భద్రతలు, రెవిన్యూ, భూపరిపాలన రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండాలన్నారు. కేంద్రంలో అతివాద ప్రభుత్వాలు వస్తే ముస్లింలపై దాడులు చేసే అవకాశం ఉంటుందని అసదుద్దీన్ అన్నారు. హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేయవద్దంటూ ప్రధానమంత్రి, రాష్ట్రపతిని కోరనున్నట్లు అసదుద్దీన్ తెలిపారు. శనివారం వారిద్దరి అపాయింట్మెంట్ కోరానని...వారిని కలిసి ఇదే అంశాన్ని చెబుతానని అన్నారు. తొలి నుంచి హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంత ప్రతిపాదనను ఎంఐఎం వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement