విరార్‌లో ఆసియాలోనే అతి పెద్ద రైల్వే కార్ షెడ్ | asia's largest railway car shed in virar | Sakshi
Sakshi News home page

విరార్‌లో ఆసియాలోనే అతి పెద్ద రైల్వే కార్ షెడ్

Published Mon, Oct 21 2013 6:24 PM | Last Updated on Fri, Sep 1 2017 11:50 PM

asia's largest railway car shed in virar

సాక్షి, ముంబై:  ఆసియా ఖండంలోనే అతిపెద్ద రైల్వే కార్‌షెడ్‌ను పశ్చిమ రైల్వే పరిధిలోని విరార్‌లో నిర్మిస్తున్నారు. అత్యాధునిక సదుపాయాలతో సుమారు 25.87 హెక్టార్ల స్థలంలో నిర్మిస్తున్న ఈ షెడ్‌లో ఒకేసారి 16 లోకల్ రైళ్లను నిలిపేందుకు వీలు కలుగనుంది. దీంతోపాటు మూడు 15 బోగీల లోకల్ రైళ్ల మర్మతులను ఈ షెడ్‌లో చేపట్టే అవకాశం ఉంది. ఈ కార్‌షెడ్ నిర్మాణ పనులు సుమారు 90 శాతం పూర్తయ్యాయని ‘ముంబై రైల్వే వికాస్ కార్పొరేషన్’ (ఎంఆర్‌వీసీ) పేర్కొంది. మిగిలిన పనులు 2014 ఆరంభం నాటికి పూర్తి అవుతాయని భావిస్తున్నారు.
 
 

నిర్మాణ పనులు పూర్తికాగానే పశ్చిమ రైల్వేకి ఈ షెడ్‌ను అప్పగించనున్నట్టు ఎంఆర్‌వీసీ  పేర్కొంది. మరమ్మతులు, నిర్వహణ కారణంగా ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు షెడ్‌లను అధికంగా నిర్మించాలని నిర్ణయం తీసుకున్నామని రైల్వే వర్గాలు తెలిపాయి. ఈ మేరకు పశ్చిమ రైల్వేమార్గంలో ప్రయాణికుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ఈ మార్గంలో అతిపెద్ద కార్ షెడ్ నిర్మించాలని నిర్ణయించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement