virar
-
మహారాష్ట్రలో మరో ఘోరం..
సాక్షి ముంబై/న్యూఢిల్లీ: మహారాష్ట్రలో మరో ఘోరం జరిగింది. ముంబైకి సమీపంలోని విరార్‌లోని ఓ ఆసుపత్రిలో సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో 14 మంది సజీవ దహనమయ్యారు. పాల్ఘర్ జిల్లా విరార్‌లోని విజయ్ వల్లబ్ ఆసుపత్రిలో శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో రెండో అంతస్తులోని ఏసీలో షార్ట్ సర్క్యూట్‌తో పేలుడు సంభవించి మంటలు అంటుకున్నాయి. ఐసీయూలో చికిత్స పొందుతున్న 17 మందిలో ముగ్గురు రోగులు బయటికి వెళ్లగలిగారు. కానీ మిగతా 14 మంది కదల్లేని పరిస్థితిలో ఉండటం వల్ల వారందరు సజీవదహనమయ్యారు. ఈ ఆసుపత్రిలో మొత్తం 90 మంది రోగులున్నారు. నాసిక్‌లోని జాకీర్ హుస్సేన్ ఆసుపత్రిలో బుధవారం ఆక్సిజన్ లీకేజీ కారణంగా ప్రాణవాయువు అందక 24 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అగ్నిమాపక సిబ్బంది సుమారు రెండు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఢిల్లీ ఆసుపత్రిలో 25 మంది మృతి దేశ రాజధాని ఢిల్లీలోని ప్రఖ్యాత సర్ గంగారాం హాస్పిటల్లో సరిపడా ప్రాణవాయువు లేక 24 గంటల్లో 25 మంది కరోనా బాధితులు చనిపోయారు. తక్కువ పీడనంతో ఆక్సిజన్ సరఫరా కావడమే ఈ మరణాలకు కారణమని అధికారులు తెలిపారు. వారికి అవసరమైన ఆక్సిజన్ అందక చనిపోయినట్లు భావిస్తున్నారు. మరో 60 మంది బాధితుల పరిస్థితి ఆదోళనకరంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ ఆసుపత్రిలో 500 మందికిపైగా కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. వీరిలో 150 మంది హై ఫ్లో ఆక్సిజన్ సపోర్ట్‌పై ఉన్నారు. వీరికి అధిక పీడనంతో ఆక్సిజన్ అందించాల్సి ఉంటుంది. అయితే, గంగారాం ఆసుపత్రిలో సరిపడా ఆక్సిజన్ నిల్వ లున్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. -
రైలులో కీకీ అన్నారు.. ఇప్పుడు అనుభవిస్తున్నారు
ముంబై : కీకీ చాలెంజ్ చాలా ప్రమాదకరం.. కీకీ అంటూ విన్యాసాలు చేస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా జనాలు మాత్రం వాటిని బుర్రకెక్కించుకోవడం లేదు. దాంతో ఇన్ని రోజులు మందలించి వదిలేసిన పోలీసులు ఇప్పుడు మాత్రం కాస్తా కఠినంగానే వ్యవహరిస్తున్నారు. కీకీ చాలెంజ్ అంటూ కదులుతున్న రైలుతో పాటు విన్యాసాలు చేసిన ఒక యువకుడికి, ఈ తతంగాన్నంతా వీడియో తీసిన అతని స్నేహితులకు కూడా పనిష్మెంట్ ఇచ్చారు. కాకాపోతే అది కాస్తా వెరైటీ పనిష్మెంట్. రైల్వే ప్లాట్‌ఫాంపై డ్యాన్స్ చేశారు కాబట్టి వరుసగా మూడు రోజుల పాటు రైల్వే స్టేషన్‌ను శుభ్రపర్చాలంటూ కోర్టు ఆ యువకులను ఆదేశించింది. వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని విరార్ ప్రాంతానికి చెందిన నిషాంత్ షా(20), ధ్రువ్ షా(23), శ్యాం శర్మ(24) అనే ముగ్గురు యువకులు కీకీ ఛాలెంజ్ పేరిట కదులుతున్న రైల్లో నుంచి కిందకి దిగి డ్యాన్స్ చేశారు. అంతటితో ఆగకుండా ఫ్లాట్‌ఫాంపై రకరకాల విన్యాసాలు చేశారు. దీన్నంతా వీడియో తీసి ఇంటర్నెట్లో పోస్టు చేశారు. దాంతో అది కాస్తా పోలీసుల కంట పడింది. రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు, సీసీ టీవీ, సదరు కీకీ వీడియోలోని దృశ్యాల ఆధారంగా ఆ ముగ్గురుని అరెస్టు చేశారు. అయితే ఈ యువకులు కీకీ పేరుతో ఇలా విన్యాసాలు చేయడం ఇదే ప్రథమం కాదని తెలిసిందే. గతంలో వీళ్లు ఏకంగా అంబులెన్స్ దగ్గర కూడా కీకీ ఛాలెంజ్ డ్యాన్స్ చేశారట. ఆ వీడియోను కూడా రైల్వే పోలీసులు గుర్తించారు. అనంతరం వాళ్లను అరెస్టు చేసి వసాయ్ ప్రాంతంలోని రైల్వే కోర్టులో హాజరుపరిచారు. యువకులను విచారించిన రైల్వే కోర్టు వారికి శిక్ష విధించింది. ఈ వారంలో మూడు రోజుల పాటు వసాయ్ రైల్వే స్టేషన్‌ను శుభ్రం చేయాల్సిందిగా ఆదేశించింది. అంతేకాక ముగ్గురు యువకులు రైల్వే స్టేషన్‌ను శుభ్రపరుస్తుండగా వీడియో తీసి దాన్ని కోర్టుకు అందజేయాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటలు, అనంతరం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకూ రైల్వే స్టేషన్‌ను శుభ్రం చెయ్యాలని కోర్టు ఆదేశించింది. -
మూడోవిడతలో మరో 2,500 ఇళ్లు
సాక్షి, ముంబై : శివారు ప్రాంతమైన విరార్‌లో అదనంగా మరో 2,500 ఇళ్లు నిర్మించేందుకు మహారాష్ట్ర గృహనిర్మాణ అభివృద్థి సంస్థ (మాడా) రంగం సిద్ధం చేసింది. ఇక ముంబైకర్లకు చౌక ధరలకే మరిన్ని ఇళ్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం విరార్‌లోని బోలింజ్ ప్రాంతంలో కొంకణ్ మండలి ఆధ్వర్యంలో రెండు విడతల్లో మంజూరైన 6,290 ఇళ్ల నిర్మాణం పనులు వేగంగా సాగుతున్నాయి. ఇవి పూర్తికాకముందే మూడో విడత ఇళ్లు నిర్మించేందుకు మాడా ఏర్పాట్లు చేస్తోంది. 2,500 ఇళ్లు నిర్మించేందుకు ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసింది. తొలగిన వివాదం ఎట్టకేలకు రిజర్వేషన్ వివాదం తొలగిపోయింది. ఈ వివాదంలో చిక్కుకున్న సుమారు మూడున్నర హెక్టార్ల స్థలం మాడాకు లభించింది. ఇక్కడ మరిన్ని ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు మార్గం సుగమమైంది. విరార్-బోలింజ్ ప్రాంతంలో మాడాకు దాదాపు 47 హెక్టార్ల సొంత స్థలాలున్నాయి. అందులో వసయి-విరార్ కార్పొరేషన్ ఏకంగా 22 హెక్టార్ల స్థలాలు వివిధ రకాల రిజర్వేషన్లకు కేటాయించింది. మిగతా 25 హెక్టార్లలో 11 హెక్టార్ల స్థలాలను ఇటీవల విక్రయానికి పెట్టింది. ఇక మిగిలిన 14 హెక్టార్లలో ఏడు హెక్టార్ల స్థలంలో రెండు దశల్లో ప్రస్తుతం ఇళ్ల నిర్మాణ పనులు కొసాగుతున్నాయి. మిగతా ఏడు హెక్టార్లలో మూడున్నర హెక్టార్ల స్థలం రిజర్వేషన్ వివాదంలో చిక్కుకుంది. ఇప్పుడు పరిష్కారం కావడంతో అదనంగా మరో రెండున్నర వేల ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు మాడా నిర్ణయించింది. 22 హెక్టార్ల స్థలాన్ని మాడాకు అప్పగించాలి వసయి-విరార్ కార్పొరేషన్ వివిధ రకాలకు కేటాయించిన 22 హెక్టార్ల స్థలాన్నీ మాడాకు అప్పగించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేయనున్నట్లు కొంకణ్ మండలి నూతన సభాపతి మాణిక్‌రావ్ జగ్తాప్ తెలిపారు. ఇంత పెద్ద మొత్తంలో మాడా స్థలాలను వసయి-విరార్ కార్పొరేషన్ రిజర్వేషన్ చేయడం సబబు కాదన్నారు. కనీసం 50 శాతం స్థలాలను తిరిగి మాడాకు అప్పగించాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు తెలిపారు. ఒకవేళ ఆ స్థలం కూడా మాడా ఆధీనంలోకి వస్తే బోలింజ్ ప్రాంతంలో భవిష్యత్‌లో పేదలకు లక్షలాది ఇళ్లు నిర్మించి ఇవ్వడానికి వీలు పడనుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దాదాపు తొమ్మిది వేల ఇళ్లు అందుబాటులోకి రానున్నాయని అన్నారు. ధారావిలో పూర్తికావచ్చిన బహుళ అంతస్తుల భవనం సాక్షి, ముంబై : ఆసియాలోనే అతి పెద్ద మురికివాడగా పేరుగాంచిన ‘ధారావి’లో నిర్మించిన మొదటి బహుళ అంతస్తుల భవనం నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. జోపడ్‌పట్టి పునరావసం (జోపు) పథకం ద్వారా చేపట్టిన ఈ భవనం ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుకుంటోంది. శాసన సభ ఎన్నికల ప్రవర్తన నియమావలి (కోడ్) అమలులోకి రాకముందే ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ చేతుల మీదుగా అర్హులైన పేదలకు ఇళ్లు అప్పగించేందుకు మహారాష్ట్ర గృహనిర్మాణ అభివృద్థి సంస్థ (మాడా), రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఐదు సెక్టార్లుగా ధారావి విభజన ఆసియా ఖండంలోనే అతిపెద్ద మురికివాడ పేరు గాంచిన ఈ ధారావి ప్రాంతంలో వేలాది గుడిసెలు, చిన్న చితికా కుటీర పరిశ్రమలు ఉన్నాయి. కొన్ని హెక్టార్లలో విస్తరించి ఉన్న ఈ ప్రాంతాన్ని ఒక్కసారి పునరాభివృద్ధి చేయడం సాధ్యం కాదని అప్పట్లో తేలిపోయింది. ఈ ప్రాంతాన్ని మొత్తం ఐదు సెక్టార్లుగా విభజించారు. అయినప్పటికీ వివిధ ఆటంకాల కారణంగా తొమ్మిది సంవత్సరాల నుంచి ధారావి జోపడ్‌పట్టి పునరాభివృద్థి పథకం అమలుకు నోచుకోలేకపోయింది. చివరకు అంతర్జాతీయ స్థాయిలో టెండర్లను ఆహ్వానించి ప్రైవేటు బిల్డర్ల ద్వారా ఈ పథకాన్ని పూర్తిచేయాలని ప్రభుత్వం చేసిన ప్రయత్నం బెడసి కొట్టింది. ఐదో నెంబర్ సెక్టార్లో.. దీంతో కేవలం ఐదో నెంబర్ సెక్టార్‌ను మాడాకు అప్పగించి ఈ ప్రాజెక్టును ముందు తీసుకెళ్లాలని ప్రభుత్వం భావించింది. ఆ ప్రకారం ధారావి బస్ డిపో సమీపంలో ఉన్న ఖాళీ స్థలంలో మొదటి బహుళ అంతస్తుల భవనం నిర్మించేందుకు బి.జి.శిర్కే కన్స్ట్రక్షన్కు కాంట్రాక్టు బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం ఆ భవనం తుది మెరుగులు దిద్దుకొని ఓసీ కోసం వేచి చూస్తోంది. ఈ వారం, పది రోజుల్లో ఓసీ లభించే అవకాశాలున్నాయి. ఆ తర్వాత అర్హులకు ఇళ్ల తాళాలు పంపిణీ చేసే కార్యక్రమానికి ముహూర్తం ఖరారు చేస్తారు. రెండు వారాల తరువాత ఎప్పుడైననా కోడ్ అమలులోకి వచ్చే సూచనలు ఉన్నాయి. అంతలోపే కార్యక్రమాన్ని పూర్తిచేయాలని అధికారులు యోచిస్తున్నారు. అందుకు అర్హులైన 170 మంది పేదలను ఎంపిక చేసి సిద్ధంగా ఉంచారు. ఈ భవనంలో సౌకర్యాలు.......... పార్కింగ్ సౌకర్యంతోపాటు మొత్తం 18 అంతస్తుల భవనం . {పతీ అంతస్తులో 21 ఫ్లాట్లు ఒక్కో ఫ్లాట్‌కు సుమారు రూ.13.50లక్షలు ఖర్చు 300 చ.ట. కార్పెట్ ఏరియా. (556 చ.ట. సూపర్ బిల్ట్ అప్) -
ఓవల్‌మైదాన్-చర్చ్‌గేట్-విరార్ ఎలివేటెడ్ కారిడార్‌లో మార్పులు
సాక్షి, ముంబై: ప్రతిపాదిత ఓవల్‌మైదాన్-చర్చ్‌గేట్-విరార్ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులో రైల్వే మంత్రిత్వశాఖ ఇటీవల స్వల్పమార్పులు చేసింది. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని విరార్‌లోనే విరార్ సౌత్, విరార్ నార్త్ రెండు స్టేషన్లను నిర్మించనున్నారు. ఈ స్టేషన్ల మధ్య దూరం రెండు కిలోమీటర్లు ఉంటుందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. విరార్ సౌత్ స్టేషన్‌ను కొత్తగా నిర్మిస్తున్న కార్‌షెడ్ వద్ద నిర్మించాలని భావిస్తుండగా, విరార్ నార్త్ స్టేషన్‌ను ప్రస్తుతమున్న విరార్ స్టేషన్‌కు కిలోమీటర్ దూరంలో నిర్మించనున్నారు. అంతేగాకుండా మహాలక్ష్మీ, విలేపార్లేలో కూడా స్టేషన్లను నిర్మించాలని మంత్రిత్వశాఖ నిర్ణయించింది. మహాలక్ష్మీ స్టేషన్ పరిసరాల్లో వివిధ ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, వ్యాపారసంస్థలు ఉండడంతో వచ్చిపోయే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. దీనిని పరిగణనలోకి తీసుకున్న మంత్రిత్వశాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుందని సంబంధిత అధికారి తెలిపారు. అయితే విలేపార్లే ఎయిర్ పోర్ట్ ప్రాంతంలో ఉండడంతో ఇక్కడ ఈ కారిడార్ నిర్మించడాన్ని నిషేధించారని, దీంతో ఇక్కడ భూగర్భ మార్గం నిర్మించి, స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నారని చెప్పారు. ఫలితంగా ఇయిర్ పోర్టు నుంచి వచ్చే ప్రయాణికులకు కూడా ఈ కారిడార్ సౌకర్యవంతంగా ఉంటుందని, దీంతో ఈ ఎలివేటెడ్ రైలును వీరు కూడా ఉపయోగించుకోవచ్చన్నారు. ఈ కారిడార్ ఏర్పాటుతో విలేపార్టే ప్రాంతం కూడా గొప్ప వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందనుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక మీరారోడ్‌లో ఈ కారిడార్ డిపోను ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉన్నప్పటికీ ఇక్కడ చట్టపరమైన అడ్డంకులు ఉన్నాయని అధికారుల పరిశీలనలో తేలింది.. దీంతో రైల్వే బోర్డు ఈ డిపోను నాయ్‌గావ్ స్టేషన్ వద్ద నిర్మించే ఆలోచన చేస్తోంది. ఈ కారిడార్ నిర్మాణం కోసం రూ.20 వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేయగా ఇందులో ప్రణాళిక సంఘం రూ.1,240 కోట్లు భరించనుంది. ఈ మోత్తాన్ని కారిడార్ నిర్మాణానికి అడ్డు వచ్చే కట్టడాలు, భూగర్భంలో ఉన్న వివిధ సంస్థల కేబుళ్లు, పైప్లైన్లు తొలగించడానికి ఉపయోగించనున్నారు. ఈ పనులను బీఎంసీ, టాటా పవర్ రిలయన్స్, ఎంటీఎన్ఎల్, బీఎస్ఎన్ఎల్, మహానగర్ గ్యాస్, తదితర 12 ఏజెన్సీలు చేపట్టనున్నాయి. -
విరార్‌లో ఆసియాలోనే అతిపెద్ద రైల్వే కార్ షెడ్
ఆసియా ఖండంలోనే అతిపెద్ద రైల్వే కార్ షెడ్‌ను పశ్చిమ రైల్వే పరిధిలోని విరార్‌లో నిర్మిస్తున్నారు. అత్యాధునిక సదుపాయాలతో సుమారు 25.87 హెక్టార్ల స్థలంలో నిర్మిస్తున్న ఈ షెడ్లో ఒకేసారి 16 లోకల్ రైళ్లను నిలిపేందుకు వీలు కలుగనుంది. దీంతోపాటు మూడు 15 బోగీల లోకల్ రైళ్ల మరమ్మతులను ఈ షెడ్లో చేపట్టే అవకాశం ఉంది. ఈ కార్ షెడ్ నిర్మాణ పనులు సుమారు 90 శాతం పూర్తయ్యాయని ‘ముంబై రైల్వే వికాస్ కార్పొరేషన్’ (ఎంఆర్వీసీ) పేర్కొంది. మిగిలిన పనులు 2014 ఆరంభం నాటికి పూర్తి అవుతాయని భావిస్తున్నారు. నిర్మాణ పనులు పూర్తికాగానే పశ్చిమ రైల్వేకి ఈ షెడ్‌ను అప్పగించనున్నట్టు ఎంఆర్వీసీ పేర్కొంది. మరమ్మతులు, నిర్వహణ కారణంగా ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు షెడ్లను అధికంగా నిర్మించాలని నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. ఈ మేరకు పశ్చిమ రైల్వేమార్గంలో ప్రయాణికుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ఈ మార్గంలో అతిపెద్ద కార్ షెడ్ నిర్మించాలని నిర్ణయించారు. అయితే ముంబైలో స్థలాభావం వల్ల కార్ షెడ్‌ను విరార్‌లో నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకుగానూ విరార్-నాలాసోపారా రైల్వేస్టేషన్ల మధ్య సుమారు 25.87 హెక్టార్లు అనగా సుమారు 62 ఎకరాల స్థలాన్ని 2004లో ఎంపిక చేశారు. 2005లో ఈ స్థలాన్ని రూ. 31 కోట్లతో కొనుగోలు చేశారు. ఇదే స్థలంలో రూ. 300 కోట్ల వ్యయంతో ఎంఆర్పీసీ 2006 ఈ అత్యాధునికమైన అతిపెద్ద కార్‌షెడ్ నిర్మాణం పనులు చేపట్టింది. సమీపంలోని ఓ దిగుడు బావిని ఈ మరమ్మతు షెడ్‌కు నీటి సరఫరా కోసం కేటాయించారు. ఇక్కడ ఉపయోగించిన నీటిని పునర్వినియోగించడానికి సమీపంలోనే ఓ నీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రానికి ప్రతిరోజూ సుమారు 2.5 లక్షల లీటర్ల నీటిని శుద్ధి చేసే సామర్థ్యం ఉన్నట్టు ఎంఆర్వీసీ పేర్కొంది. ప్రస్తుతం భూమిలోపల తొమ్మిది లక్షల లీటర్ల నీటిని నిలువ చేసేందుకు వీలుగా ట్యాంక్‌ను నిర్మించారు. ఈ షెడ్లో లోకల్ రైళ్లను అత్యాధునిక అటోమెటిక్ యంత్రాలతో వాషింగ్ చేసేందుకు వీలుంది. సమీపంలో పనిచేసే సిబ్బంది విశ్రాంతి కోసం 53 గదులను నిర్మించడంతోపాటు మోటర్‌మెన్, గార్డుల విశ్రాంతి కోసం 28 పడకలను ఏర్పాటు చేస్తున్నారు. అన్ని అత్యాధునిక సదుపాయాలతో నిర్మితమవుతున్న ఈ కార్‌షెడ్ ఆసియాలో అతిపెద్ద కార్ షెడ్‌గా గుర్తింపు పొందనుందని ఎంఆర్వీసీ పేర్కొంటోంది. -
విరార్‌లో ఆసియాలోనే అతి పెద్ద రైల్వే కార్ షెడ్
సాక్షి, ముంబై: ఆసియా ఖండంలోనే అతిపెద్ద రైల్వే కార్‌షెడ్‌ను పశ్చిమ రైల్వే పరిధిలోని విరార్‌లో నిర్మిస్తున్నారు. అత్యాధునిక సదుపాయాలతో సుమారు 25.87 హెక్టార్ల స్థలంలో నిర్మిస్తున్న ఈ షెడ్లో ఒకేసారి 16 లోకల్ రైళ్లను నిలిపేందుకు వీలు కలుగనుంది. దీంతోపాటు మూడు 15 బోగీల లోకల్ రైళ్ల మర్మతులను ఈ షెడ్లో చేపట్టే అవకాశం ఉంది. ఈ కార్‌షెడ్ నిర్మాణ పనులు సుమారు 90 శాతం పూర్తయ్యాయని ‘ముంబై రైల్వే వికాస్ కార్పొరేషన్’ (ఎంఆర్వీసీ) పేర్కొంది. మిగిలిన పనులు 2014 ఆరంభం నాటికి పూర్తి అవుతాయని భావిస్తున్నారు. నిర్మాణ పనులు పూర్తికాగానే పశ్చిమ రైల్వేకి ఈ షెడ్‌ను అప్పగించనున్నట్టు ఎంఆర్వీసీ పేర్కొంది. మరమ్మతులు, నిర్వహణ కారణంగా ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు షెడ్లను అధికంగా నిర్మించాలని నిర్ణయం తీసుకున్నామని రైల్వే వర్గాలు తెలిపాయి. ఈ మేరకు పశ్చిమ రైల్వేమార్గంలో ప్రయాణికుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ఈ మార్గంలో అతిపెద్ద కార్ షెడ్ నిర్మించాలని నిర్ణయించారు.