శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో అధికారిపై దాడి | attack on officer shamshabad airport | Sakshi
Sakshi News home page

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో అధికారిపై దాడి

Published Tue, Nov 1 2016 8:19 PM | Last Updated on Mon, Sep 4 2017 6:53 PM

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో అధికారిపై దాడి

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో అధికారిపై దాడి

శంషాబాద్‌: శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిరిండియా అధికారిపై మంగళవారం సాయంత్రం దాడి జరిగింది. ఎయిరిండియా డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ సుదర్శన్‌(45)పై బైక్‌పై వచ్చిన కొందరు దుండగులు దాడి చేశారు. విమానాశ్నరయండిచివెళుతున్న ఆయనపై అకస్మాత్తుగా విరుచుకుపడి..  ఆయన వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను లాక్కెళ్లారు.

దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన సుదర్శన్‌ చేయి విరిగింది. ఈ ఘటనపై ఎయిర్‌పోర్టు భద్రతా అధికారులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. ఎయిర్‌పోర్ట్‌లోనే  ఇలాంటి దాడి జరుగడంతో ప్రయాణికుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతున్నది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement