
కలాం రోడ్డుపై వివాదం!
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ఔరంగ జేబు రోడ్డుకు కొత్తగా మాజీ రాష్ట్రపతి, ఇటీవల పరమపదించిన ప్రముఖ శాస్త్రవేత్త అబ్దుల్ కలాం పేరు పెట్టడం కొంత ఉద్రిక్తతలకు దారి తీస్తుందని కొందరు చరిత్రకారులు, స్కాలర్లు ఆందోళన వ్యక్తం చేశారు. అలా చేయడం చరిత్రను వక్రీకరించనట్లు అవుతుందని, బహుశా అది కొంత టెన్షన్ వాతావరణాన్ని భవిష్యత్తులో సృష్టిస్తుందేమోనని చెప్పారు. గత నెల 28న న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ ఔరంగ జేబు రోడ్డుకు ఇక నుంచి అబ్దుల్ కలాం రోడ్డుగా నామకరణం చేయాలనుకుంటున్నట్లు ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసిన విషయం తెలిసిందే.