కూతురికి గిప్ట్గా 5 లక్షల గన్!!
కూతురికి గిప్ట్గా 5 లక్షల గన్!!
Published Sat, Aug 27 2016 3:19 PM | Last Updated on Mon, Sep 4 2017 11:10 AM
అహ్మదాబాద్ : ఒలంపిక్స్లో అమ్మాయిలు సాధిస్తున్న ఘనతలు.. తల్లిదండ్రుల్లో ప్రోత్సాహం గణనీయంగా పెంచుతోంది. అమ్మాయిలకు కేవలం పెళ్లిళ్లు చేసి అత్తారింటికీ పంపించకుండా.. వారికి ఇష్టమైన రంగంలో వారిని ప్రోత్సహించడానికి, తల్లిదండ్రులు ఎంతో కృషిచేస్తున్నారు . తాజాగా ఓ రిక్షా డ్రైవర్ మనిలాల్ గోహిల్, తన కూతురి కలల్ని సాకారం చేసుందుకు పెళ్లి కోసం దాచిపెట్టిన 5 లక్షల రూపాయలతో జర్మన్ రైఫెల్ను కొనుగోలు చేసి గిప్ట్ గా బహుకరించాడు. అంతర్జాతీయ స్థాయి షూటర్గా తన కూతురు నిలవాలని ఆకాంక్షిస్తూ మనిలాల్ ఈ గిప్ట్ను తన కూతురికి అందించాడు.
పెళ్లి కోసం కూడబెట్టిన నగదుతో ఇంత ఖరీదైన గిప్ట్ను బహుకరించడాన్ని కూతురు మిట్టల్ ఎంతో ఆనందం వ్యక్తంచేస్తోంది. తండ్రి, కుటుంబసభ్యులు చేసిన త్యాగానికి బహుమానంగా తప్పనిసరిగా అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటానని మిట్టల్ చెబుతోంది. 27 ఏళ్ల మిట్టల్ నేషనల్ షూటింగ్ చాంపియన్షిప్లో అంతకుముందే కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. కూతురు కోసం కొనుగోలుచేసిన ఈ రైఫిల్ కోసం ఇటీవలే పోలీసు కమిషన్ ఆఫీసు నుంచి మహిలాల్ లైసెన్సు కూడా పొందాడు. కూతురు కలలను సాకారం చేసేందుకు ఓ తండ్రి తపనను పోలీసులు కొనియాడారు.
Advertisement