ఎగ్జిట్ పోల్స్ అన్నీ తప్పవుతాయి | Bihar exit polls were wrong, we are winning Uttar Pradesh, Rahul Gandhi | Sakshi
Sakshi News home page

ఎగ్జిట్ పోల్స్ అన్నీ తప్పవుతాయి

Published Fri, Mar 10 2017 1:03 PM | Last Updated on Mon, Dec 3 2018 1:54 PM

ఎగ్జిట్ పోల్స్ అన్నీ తప్పవుతాయి - Sakshi

ఎగ్జిట్ పోల్స్ అన్నీ తప్పవుతాయి

న్యూఢిల్లీ: ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పు అవుతాయని, ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్-సమాజ్‌వాదీ పార్టీ కూటమి విజయం సాధిస్తుందని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. బిహార్ ఎన్నికల సమయంలో కూడా బీజేపీ గెలుస్తుందని ఎన్నికల సర్వేలు వెల్లడించాయని, అయితే ఇవన్నీ తప్పయ్యాయని చెప్పారు.

ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ మెజార్టీ స్థానాలు గెలుచుకుంటుందని పలు సర్వేలు వెల్లడించగా, రాహుల్ తోసిపుచ్చారు. యూపీలో తామే విజయం సాధిస్తామని, దీని గురించి శనివారం మాట్లాడుతాననని చెప్పారు. యూపీ సహా ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో రేపు కౌంటింగ్ జరగనుంది. యూపీలో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ పొత్తుపెట్టుకుని పోటీ చేశాయి. ఎస్పీ అధ్యక్షుడు, యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్, రాహుల్ గాంధీ కలసి ఎన్నికల ర్యాలీలలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement