పాట్నా: లోక్సభ ఎన్నికల ముందు బీహార్లో అధికార పార్టీ జేడీయూ, నితీష్ కుమార్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. ఆ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పర్వీన్ అమానుల్లా మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. పర్వీన్ నితీష్ కుమార్ కేబినెట్ నుంచి వైదొలగడంతో పాటు జేడీయూకూ గుడ్ బై చెప్పారు. ఆమె తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రికి పంపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం, పార్టీలో కొనసాగలేకపోతున్నానని చెప్పారు.
రాజకీయాలకు దూరంగా ప్రజా సేవ చేయనున్నట్టు పర్వీన్ తెలిపారు. ఆమె భర్త అఫ్జల్ అమానుల్లా సీనియర్ ఐఏఎస్ అధికారి. కేంద్ర ప్రభుత్వం సర్వీసులో పనిచేస్తున్నారు. ఇదిలావుండగా, బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీని ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ జేడీయూ.. ఎన్డీయే నుంచి బయటకు వచ్చింది. దీంతో బీజేపీతో కొనసాగించిన సుదీర్ఘ అనుబంధానికి తెరపడింది. ఓ వైపు నరేంద్ర మోడీ ప్రభంజనంతో బీజేపీ దూసుకుపోతుండటం.. మరో వైపు ఆర్జేడీ కూటమి మోహరించడం.. వెరసీ జేడీయూకు బీహార్లో సవాల్ ఎదురు కానుంది.
జేడీయూకు బీహార్ మంత్రి గుడ్ బై
Published Tue, Feb 4 2014 5:31 PM | Last Updated on Sat, Sep 2 2017 3:20 AM
Advertisement
Advertisement