minister resign
-
ఢిల్లీలో కీలక పరిణామం.. ‘ఆప్’ మంత్రి రాజీనామా
సాక్షి, న్యూఢిల్లీ: మత మార్పిడి వివాదంలో చిక్కుకుని ఆరోపణలు ఎదుర్కొన్న ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్ తన పదవికి రాజీనామా చేశారు. మత మార్పిడి కార్యక్రమంలో పాల్గొనటంపై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. పదవి నుంచి తొలగించాలని ఆందోళనలు చేపట్టటంతో ఆమ్ ఆద్మీ పార్టీ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. వివాదాస్పదం కాకుండా ఉండేందుకు మంత్రి చేత రాజీనామా చేయించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. వివాదం ఏమిటి? దసరా రోజు(ఈనెల 5న) ఢిల్లీలోని కరోల్ బాగ్‌లో భారీ సంఖ్యలో హిందువులు బౌద్ధ మతాన్ని స్వీకరిస్తున్న కార్యక్రమంలో ఢిల్లీ మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్ పాల్గొనడంపై తీవ్ర వివాదం ముసురుకుంది. మతం మారుతున్న వ్యక్తులు హిందూ దేవుళ్లు, దేవతలను దూషిస్తున్నట్లుగా ఉన్న వీడియో దృశ్యాలు గత శుక్రవారం వెలుగులోకి వచ్చాయి. ఇటువంటి కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి నేతృత్వం వహించటంపై బీజేపీ, వీహెచ్‌పీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గౌతమ్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను డిమాండ్ చేశారు. కేజ్రీవాల్ ప్రభుత్వంలో గౌతమ్ సాంఘీక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు. #BreakingNews Delhi social welfare minister @AdvRajendraPal, at the centre of an alleged conversion row, resigns@htTweets pic.twitter.com/jlM4XXkljD — Alok K N Mishra HT (@AlokKNMishra) October 9, 2022 ఇదీ చదవండి: రాహుల్ అంటే భారత్.. భారత్ అంటే రాహుల్: యూపీ కాంగ్రెస్ -
యూపీ సర్కార్‌కు బిగ్ షాక్.. ఏకంగా మంత్రి రాజీనామా
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సర్కార్‌కు భారీ షాక్ తగిలింది. ఏకంగా కేబినెట్ మంత్రి దినేష్ ఖతిక్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు పంపించారు. కాగా ఖతిక్ యూపీ నీటిపారుదలశాఖ మంత్రిగా ఉన్నారు. ఇటీవల సీఎం తనను అవమానిస్తున్నారని, గత 100 రోజుల నుంచి తనకు పనులు అప్పజెప్పడం లేదని దినేష్ ఖతిక్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేగాక తన శాఖపరమైన బదిలీల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఎంతో బాధను అనుభవించే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ‘నేను దళితుడు అవ్వడం వల్ల పక్కకు పెట్టారు. ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. మంత్రిగా నాకు అధికారాలు లేవు. రాష్ట్ర మంత్రిగా పనిచేయడం వల్ల దళిత వర్గానికి ఎలాంటి ఉపయోగం లేదు. నన్ను ఏ సమావేశానికి పిలవరు. నా మంత్రిత్వశాఖ గురించి ఏం చెప్పరు. ఇది దళిత సమాజాన్ని అవమానించడమే’నని రాజీనామా లేఖలో పేర్కొన్నారు. అయితే పార్టీ నేతలు ఖతిక్తో మాట్లాడి, బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. చదవండి: తెలంగాణలో ధాన్యం కొనుగోలు.. కేసీఆర్ సర్కార్‌పై కేంద్రమంత్రి ఫైర్ దీనికి తోడు మరోమంత్రి జితిన్ ప్రసాద సైతం సీఎం యోగిపై ఆగ్రహంతో ఉన్నట్లు, అతను కూడా రాజీనామాకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన ఢిల్లీలోని బీజేపీ అధిష్టానంతో భేటీ అయ్యారు. కాగా ప్రసాద పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆ శాఖ అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటుంది. పలువురు అధికారులు బదిలీల కోసం లంచం తీసుకున్నట్లు తేలడంతో ముఖ్యమంత్రి కార్యాలయం విచారణకు ఆదేశించింది. డిపార్ట్మెంటల్ బదిలీల్లో తీవ్ర అవకతవకలకు పాల్పడిన ఐదుగురు సీనియర్ పీడబ్ల్యూడీ అధికారులను మంగళవారం యూపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ క్రమంలో యూపీ ప్రభుత్వంపై ప్రసాద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది యూపీ ఎన్నికలకు నెలరోజుల ముందే ప్రసాద కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి మారారు. ఇదిలా ఉండగా బీజేపీ ప్రభుత్వాల్లో అసంతృప్తి బయటపడటం చాలా అరుదు. ప్రస్తుతం రాష్ట్ర మంత్రే రాజీనామా చేయడంతో కాషాయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సొంత పార్టీ నేతల నుంచే అసమ్మతి సెగ రాజుకోవడంతో వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న యోగికి పెద్ద ఎద్దురుదెబ్బ తగిలినట్లైంది. చదవండి: గో ఫస్ట్ విమానానికి తప్పిన పెనుముప్పు.. రెండు రోజుల్లో మూడోసారి -
రాజీనామా చేసిన ఏపీ మంత్రులు...
-
మంత్రులకు ఇదే చివరి కేబినెట్..
-
పూజా చవాన్ ఆత్మహత్య.. మంత్రి రాజీనామా
సాక్షి, ముంబై: మహారాష్ట్ర అటవీ మంత్రి సంజయ్ రాథోడ్ ఆదివారం పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని శివసేన అధినేత, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు అందజేశారు. రాష్ట్రంలో ఓ మహిళ మరణానికి సంజయ్ రాథోడ్ కారణమని ప్రతిపక్ష బీజేపీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తుండడంతో ఆయన పదవి నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. మహిళ మరణంపై నీచ రాజకీయాలు చేస్తున్నారని సంజయ్ రాథోడ్ మండిపడ్డారు. సత్యం నిగ్గుతేలాలన్న ఉద్దేశంతోనే మంత్రి పదవికి రాజీనామా చేశానని చెప్పారు. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన పూజా చవాన్ (23) ఫిబ్రవరి 8న పుణేలో భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. సంజయ్ వేధింపుల వల్లే ఆమె బలవన్మరణానికి పాల్పడిందని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. బాధిత మహిళతో మంత్రి ఉన్నట్లు, మాట్లాడినట్లుగా చెబుతున్న ఫొటోలు, వీడియోలు, ఆడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో రాజీనామా చేసిన తొలిమంత్రి సంజయ్ రాథోడ్. -
కువైట్‌ను ముంచెత్తిన వరదలు: మంత్రి రాజీనామా
ఎడారి దేశాన్ని వరదలు మళ్లీ ముంచెత్తాయి. గత నాలుగు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు చోట్ల రోడ్లు ధ్వంసమైనాయి. దేశవ్యాప్తంగా పరిస్థితి అతలాకుతమైపోయింది. ఉరుములతో కూడిన భారీ వర్షం కువైట్‌లో బీభత్సం సృష్టించింది. వీధులన్నీ వరద నీటితో నిండిపోయాయి. రబ్బరు బోట్ల ద్వారా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీంతో సౌకర్యాలలేమిపై ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో కువైట్ పబ్లిక్‌వర్క్స్ మంత్రి హుస్సం అల్-రౌమి రాజీనామా చేశారు. మరోవైపు అంతర్గత వ్యవహారాల శాఖ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తుంది. సైన్యం, నేషనల్ గార్డ్ భారీ ఎత్తున సహాయక చర్యలు చేపట్టింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితుల్లో మినహా బయటికి రావొద్దంటూ ప్రజలను హెచ్చరించారు. మరోవైపు వర్షధాటికి అనేక వాహనాలు కొట్టుకుపోయాయి. దీంతో నెటిజన్లు ట్విటర్ ద్వారా ఈ వరద బీభత్స దృశ్యాలను పోస్ట్ చేస్తున్నారు. WATCH: Rubber boats are used in #Kuwait’s rescue operations from floods caused by heavy rains pic.twitter.com/652DJR6Lb9 — Al Arabiya English (@AlArabiya_Eng) November 9, 2018 شكرا لرجال الاطفاء وكل فرق الطوارئ .#الكويت_الان pic.twitter.com/ogEeWkfRSw — مباشر نيوز (@mobashernewss) November 9, 2018 -
‘ముజఫర్’ కేసులో మంత్రి రాజీనామా
ముజఫర్‌పూర్/పట్నా: బిహార్‌లోని ముజఫర్‌పూర్ వసతిగృహంలో బాలికలపై అత్యాచారాల ఉదంతంలో ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో ఆ రాష్ట్ర సాంఘిక, సంక్షేమ శాఖ మంత్రి మంజు వర్మ రాజీనామా చేశారు. బుధవారం ఈ మేరకు బిహార్ సీఎంకు తన రాజీనామా లేఖ ఇచ్చారు. ప్రభుత్వ నిధులతో నిడిచే ఓ అనాథ శరణాలయంలో 34 మంది బాలికలపై నిర్వాహకులు లైంగికదాడికి పాల్పడటం తెల్సిందే. మంత్రి మంజు వర్మ భర్త చందేశ్వర్ వర్మ ఆ వసతిగృహానికి తరచూ వచ్చే వారంటూ ఓ నిందితుడి భార్య ఆరోపణలు చేసింది. దీన్ని ఆధారంగా చేసుకుని మంజు వర్మపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. మరోవైపు ‘ప్రధాన నిందితుడు బ్రజేశ్ థాకూర్ మొబైల్ ఫోన్‌ను పోలీసులు పరీక్షించగా.. బ్రజేశ్‌తో మంత్రి భర్త 17 సార్లు మాట్లాడినట్లు తేలింది. ‘రాజకీయాలకు సంబంధించిన విషయాలు’ మాత్రమే మాట్లాడుకున్నట్లు బ్రజేశ్ వెల్లడించాడు. ఈ పరిణామాల నేపథ్యంలోనే మంజు రాజీనామా చేసినట్లు సమాచారం.మంత్రి మంజు వర్మతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని ఈ కేసులో ప్రధాన నిందితుడు బ్రజేశ్ థాకూర్ తెలిపాడు. -
కశ్మీర్ సీఎం ముఫ్తీకి అసంతృప్తి సెగ
జమ్ము: జమ్ముకశ్మీర్‌లో బీజేపీ, పీడీపీల సారథ్యంలో సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరి రెండ్రోజులయినా కాకముందే అసంతృప్తి జ్వాల రేగింది. ఒకప్పటి వేర్పాటువాది సజ్జద్ లోన్ తనకు కేటాయించిన పోర్ట్‌ఫోలియోపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ మంత్రి పదవికి రాజీనామా చేశారు. సజ్జద్ రాజీనామా పత్రాన్ని బుధవారం బీజేపీ హైకమాండ్‌కు పంపినట్టు ఆయన సన్నిహితులు చెప్పారు. మీడియాకు దూరంగా ఉన్న సజ్జద్ తన ఫోన్లను స్విచాఫ్ చేసుకున్నారు. జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రిగా పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ సోమవారం ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. బీజేపీకి చెందిన నిర్మల్ సింగ్ డిప్యూటీ సీఎంగా, మరో 21 మంది మంత్రులతో గవర్నర్ ఎన్ ఎన్ వోహ్రా ప్రమాణస్వీకారం చేయించారు. సజ్జద్ తనకు వైద్య, ఆరోగ్య శాఖ దక్కుతుందని భావించినట్టు ఆయన సన్నిహితులు చెప్పారు. కాగా ఆయనకు సాంఘిక సంక్షేమ శాఖను కేటాయించారు. దీంతో అసంతృప్తి చెందిన సజ్జద్ రాజీనామా చేశారు. స్థానిక బీజేపీ నాయకులతో కలిసేందుకు నిరాకరించారు. రాజీనామా నిర్ణయాన్ని మార్చుకోవాల్సిందిగా పీడీపీకి చెందిన ఆర్థిక మంత్రి హసీబ్ డ్రాబు.. సజ్జద్‌ను కోరారు. 2002లో హత్యకు గురైన పీపుల్స్ కాన్ఫరెన్స్ నాయకుడు అబ్దుల్ గిలానీ లోన్ చిన్న కుమారుడైన సజ్జద్ బీజేపీ కోటాలో కేబినెట్ మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. కుప్వారా జిల్లాలోని హంద్వారా నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. దివంగత ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ మంత్రివర్గంలో సజ్జద్ పశుసంవర్థక శాఖను నిర్వహించారు. -
జేడీయూకు బీహార్ మంత్రి గుడ్ బై
పాట్నా: లోక్‌సభ ఎన్నికల ముందు బీహార్‌లో అధికార పార్టీ జేడీయూ, నితీష్ కుమార్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. ఆ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పర్వీన్ అమానుల్లా మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. పర్వీన్ నితీష్ కుమార్ కేబినెట్ నుంచి వైదొలగడంతో పాటు జేడీయూకూ గుడ్ బై చెప్పారు. ఆమె తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రికి పంపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం, పార్టీలో కొనసాగలేకపోతున్నానని చెప్పారు. రాజకీయాలకు దూరంగా ప్రజా సేవ చేయనున్నట్టు పర్వీన్ తెలిపారు. ఆమె భర్త అఫ్జల్ అమానుల్లా సీనియర్ ఐఏఎస్ అధికారి. కేంద్ర ప్రభుత్వం సర్వీసులో పనిచేస్తున్నారు. ఇదిలావుండగా, బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీని ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ జేడీయూ.. ఎన్డీయే నుంచి బయటకు వచ్చింది. దీంతో బీజేపీతో కొనసాగించిన సుదీర్ఘ అనుబంధానికి తెరపడింది. ఓ వైపు నరేంద్ర మోడీ ప్రభంజనంతో బీజేపీ దూసుకుపోతుండటం.. మరో వైపు ఆర్జేడీ కూటమి మోహరించడం.. వెరసీ జేడీయూకు బీహార్‌లో సవాల్ ఎదురు కానుంది.