సమాచార హక్కు చట్టం ద్వారా ఏ డాక్యుమెంట్ ను పొందాలంటే 10 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. అయితే బీహార్ లో మాత్రం ఆర్టీఐ కార్యకర్త శివ్ ప్రకాశ్ రాయ్ కి మాత్రం ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ అధికారులు దిమ్మతిరిగేలా షాకిచ్చారు. ఓ వ్యవసాయ భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలను కోరిన ఓ వ్యక్తికి 1.34 కోట్లను చెల్లించాలని అధికారులు తెలిపారు.
వ్యవసాయ భూమిని కమర్షియల్ కేటగిరికి మార్పు చేసిన పత్రాలను ఇవ్వాలని బీహార్ లోని బెగుసరాయ్ జిల్లా రిజిస్త్రేషన్ అధికారులను కోరారు. అయితే తాము కోరిన మొత్తాన్ని చెల్లిస్తే భూమికి సంబంధించిన పత్రాలను ఇస్తామని అధికారులు చెప్పడంతో అవాక్కయ్యారు. సాధారణంగా 10 రూపాయలు చెల్లిస్తే సరిపోతుందని.. కోట్ల రూపాయలను చెల్లించాలని కోరడం సమాచార చట్టం నిబంధనలను ఉల్లంఘించడమే అని శివ్ ప్రకాశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.