ఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ బీజేపీ ఆరోపించింది. ఈ మేరకు బీజేపీ నేతలు ఆదివారం ఓ మెమోరాండంను ఎన్నికల సంఘానికి అందజేశారు. గుజరాత్ లో పర్యటనలో భాగంగా ఆర్ఎస్ఎస్ పై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారని బీజేపీ ఆ ఫిర్యాదులో పేర్కొంది. ఆరెస్సెస్ విధానాలు, సిద్ధాంతాల వల్లే మహాత్మాగాంధీ హత్యకు గురయ్యారని రాహుల్ చేసిన ఘాటు వ్యాఖ్యలను తన నివేదికలో పేర్కొంది.
ఎన్నికల పర్యటనలో మత విద్వేషాలను రెచ్చగొడుతున్న రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆరోపిస్తూ బీజేపీ నేతలు ఎలక్షన్ చీఫ్ వీఎస్ సంపత్ కు ఓ నివేదిక అందజేశారు. అనంతరం బీజేపీ ఉపాధ్యక్షుడు ముక్తార్ అబ్బాస్ నక్వీ మీడియాతో మాట్లాడుతూ.. మహత్మా గాంధీ హత్యకు ఆర్ఎస్ఎస్ కు సంబంధాలను అంటగడుతున్న రాహుల్ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు.