'ఇరుప్రాంతాల న్యాయం కోసం తుది వరకు పోరాడాం' | BJP favours formation of Telangana: Rajnath Singh | Sakshi
Sakshi News home page

'ఇరుప్రాంతాల న్యాయం కోసం తుది వరకు పోరాడాం'

Published Fri, Feb 21 2014 12:48 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM

బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ - Sakshi

బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్

అటు తెలంగాణ, ఇటు సీమాంధ్ర ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలని తుది వరకు భారతీయ జనతా పార్టీ  పోరాటం చేసిందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్ ఉభయ సభలలో ఆమోదం పొందిన నేపథ్యంలో ఆ ప్రాంత ప్రజలు ధన్యవాదాలు తెలిపేందుకు శుక్రవారం ఉదయం రాజ్నాథ్ను కలసిశారు.

 

ఈసందర్భంగా రాజ్నాథ్ మాట్లాడుతూ... తెలంగాణపై ఇచ్చిన మాటను తమ పార్టీ నిలబెట్టుకుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాలుగా విడిపోయిన ఇరు ప్రాంత ప్రజలు సొంత అన్నదమ్ములులాగా కలసి ఉండాలని ఆయన ఆక్షాంకించారు. అలాగే తెలంగాణ ప్రాంతంలో నివసించే సీమాంధ్రలకు పూర్తి రక్షణ కల్పించాలని తెలంగాణ ప్రాంత నాయకులుకు రాజ్నాథ్ సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement