‘బీజేపీ రూ. 36 కోట్లు ఆఫర్ చేసింది’ | BJP offered her Rs 36 crore: Irom Sharmila | Sakshi
Sakshi News home page

‘బీజేపీ రూ. 36 కోట్లు ఆఫర్ చేసింది’

Published Mon, Feb 13 2017 7:15 PM | Last Updated on Tue, Sep 5 2017 3:37 AM

‘బీజేపీ రూ. 36 కోట్లు ఆఫర్ చేసింది’

‘బీజేపీ రూ. 36 కోట్లు ఆఫర్ చేసింది’

ఇంపాల్: బీజేపీ తనకు రూ. 36 కోట్లు ఇవ్వజూపిందని పోరాటయోధురాలు ఇరోం షర్మిలా చాను వెల్లడించారు. అంతేకాదు మణిపూర్ ముఖ్యమంత్రి ఒక్రమ్ ఇబోబి సింగ్ పై పోటీ చేసేందుకు తౌబాట్ నియోజవర్గం సీటు ఆఫర్ చేసిందని తెలిపారు.

‘నేను దీక్ష ముగించిన తర్వాత బీజేపీ నేత ఒకరు నన్ను కలిశారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాల్లోకి రావాలంటే చాలా డబ్బు అవసరమవుతుందని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేయాలంటే కనీసం రూ. 36 కోట్లు ఉండాలన్నారు. నేను కావాలనుకుంటే ఆ డబ్బు కేంద్రం ఇస్తుందని, ఒకవేళ ఇవ్వకపోతే తాను సమకూరుస్తానని బీజేపీ నాయకుడు నాతో చెప్పార’ని ఇరోం షర్మిల వెల్లడించారు. ఈ ఆఫర్ ను తాను తిరస్కరించినట్టు చెప్పారు.

ఈ ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. తాను చేసిన ఆరోపణలకు ఆధారాలకు చూపకుంటే షర్మిలపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని బీజేపీ ప్రధాన కార్యదర్శి(అడ్మినిస్ట్రేషన్) తొంగమ్ బిశ్వజిత్ సింగ్ హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement