నాలుగు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు! | BJP seeks early elections | Sakshi
Sakshi News home page

నాలుగు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు!

Published Fri, Aug 30 2013 3:31 PM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM

నాలుగు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు! - Sakshi

నాలుగు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు!

ప్రస్తుతం దేశంలో తీవ్ర అనిశ్చిత వాతావరణం నెలకొందని భారతీయ జనతపార్టీ అధ్యక్షుడు ఎల్.కే.అద్వానీ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో దేశంలో పార్లమెంట్కు ఎన్నికలు ఈ ఏడాదిలోనే జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆయన జోస్యం చెప్పారు. శుక్రవారం న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎల్.కే.అద్వానీ ప్రసంగించారు.

 

అసలు అయితే 2014లో పార్లమెంట్కు ఎన్నికలు జరగాలి, కానీ వచ్చే నాలుగు మాసాల్లో ఎప్పుడైన దేశంలో ఎన్నికలు జరగవచ్చు అన్నారు. వాటితోపాటు వివిధ రాష్ట్రాలల శాసనసభలకు కూడా ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. ఆ సమావేశంలో ప్రస్తుత యూపీఏ సర్కార్పై అద్వానీ నిప్పులు చెరిగారు. ఇలాంటి ప్రభుత్వాన్ని గతంలో ఎన్నడు చూడలేదని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక పరిస్థితులపై  ఆర్థికమంత్రి పి. చిదంబరం చెప్పే కారణాలు పలాయనవాదానికి నిదర్శనమని ఎల్.కే.అద్వానీ వ్యంగంగా వ్యాఖ్యానించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement